ఓటీటీ రంగంలో టాప్ -5 రెమ్యునరేషన్స్
భారతీయ వినోద పరిశ్రమలో ఓటీటీల డామినేషన్ అంతకంతకు పెరుగుతోంది. బిగ్ స్క్రీన్ నుంచి వినోదం నెమ్మదిగా అరచేతిలోని మొబైలో ఫోన్లకు షిఫ్టయింది.
By: Sivaji Kontham | 26 Dec 2025 10:00 PM ISTభారతీయ వినోద పరిశ్రమలో ఓటీటీల డామినేషన్ అంతకంతకు పెరుగుతోంది. బిగ్ స్క్రీన్ నుంచి వినోదం నెమ్మదిగా అరచేతిలోని మొబైలో ఫోన్లకు షిఫ్టయింది. థియేటర్ కి మాత్రమే వెళ్లి సినిమా చూడాలి! అనే ఆసక్తి యూత్ లో నెమ్మదిగా సన్నగిల్లుతోంది. దీనిపై అమీర్ ఖాన్ సహా చాలా మంది అగ్ర హీరోలు ఆందోళన వ్యక్తం చేసారు. ఓటీటీలు వీక్షకులకు ఏం కావాలో అలాంటి వినోదాన్ని అందిస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ 5, సోని లివ్, జియో హాట్ స్టార్, జియో సినిమా వంటి ఓటీటీ వేదికలు పోటీబరిలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాయి. ఈ పరిస్థితుల్లో పెద్ద స్టార్లు సైతం ఓటీటీల్లో అడుగుపెడుతున్నారు. వారంతా భారీ పారితోషికాలు కూడా అందుకుంటున్నారు.
ఓటీటీల ఆరంభ దశలోనే ఈ రంగంలో ప్రవేశించిన అజయ్ దేవగన్ పారితోషికంలోను రికార్డ్ సృష్టించాడు. 2021లో బ్రిటిష్ సిరీస్ లూథర్ భారతీయ వెర్షన్ `రుద్ర: ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్`లో దేవగన్ నటించాడు. ఏడు ఎపిసోడ్‌ల సిరీస్ కోసం అతడు 125 కోట్లు వసూలు చేశాడని కథనాలొచ్చాయి. దేవగన్ ఓటీటీ పారితోషికం బాలీవుడ్‌లోని కొందరు ప్రముఖుల పారితోషికాలను మించిపోవడం ఆశ్చర్యపరిచింది. అలాగే ఓటీటీలపై ఉన్న చిన్న చూపును తగ్గించి, సరికొత్త ప్రమాణాలను రీడిఫైన్ చేసాడు దేవగన్. ధమాల్ 4, గోల్‌మాల్ 5, దృశ్యం 3 వంటి భారీ ప్రాజెక్టులతో అతడు ఇప్పుడు బిజీగా ఉన్నాడు.
జాతీయ ఉత్తమ నటుడు మనోజ్ భాజ్ పాయ్ ఒక పాత్రకు ప్రాణ ప్రతిష్ఠ చేయడంలో నిష్ణాతుడు. `ది ఫ్యామిలీ మ్యాన్`లో శ్రీకాంత్ తివారీ పాత్రను మనోజ్ బాజ్‌పేయి అద్భుతంగా పోషించాడు. మూడు సీజన్లలో అతడి నటనకు గొప్ప పేరొచ్చింది. OTTలో అత్యంత పాపులర్ నటులలో ఒకరిగా మనోజ్ భాజ్‌పాయ్ పేరు మార్మోగుతోంది. ఫ్యామిలీమ్యాన్ ఫ్రాంఛైజీ కోసం అతడు ఒక్కో సీజన్‌కి సుమారు రూ.10 కోట్లు సంపాదించారు.
OTTలలో అవకాశాల్ని అందిపుచ్చుకోవడం సైఫ్ అలీ ఖాన్ కెరీర్‌లో కీలక మలుపు. నెట్‌ఫ్లిక్స్- సేక్రెడ్ గేమ్స్‌లో అతడు పోషించిన సర్తాజ్ సింగ్ పాత్ర అందరినీ ఆకట్టుకుంది. కల్ట్ హిట్ జానర్ సిరీస్ కోసం రూ.15 కోట్లు పారితోషికం అందుకున్నాడు. ఈ సిరీస్ అతడిని అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా నిలిపింది.
`ది ఫ్యామిలీ మ్యాన్ 2`లో రాజి పాత్రలో సమంత అద్భుత నటనకు విమర్శకులు, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ షో విజయవంతం అయిన తర్వాత ఒక్కో ప్రాజెక్టుకు 4 కోట్లు అదనంగా పెంచిందని కథనాలొచ్చాయి. ఓటీటీ రంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరిగా సమంత పేరు ఇటీవల మార్మోగుతోంది. డ్యాషింగ్ పెర్ఫామెన్స్‌తో కట్టి పడేసే రాధికా ఆప్టే ఓటీటీలో పాపులర్ నటిగా చర్చల్లోకొచ్చింది. లస్ట్ స్టోరీస్, సేక్రెడ్ గేమ్స్, ఘౌల్‌లలో అద్భుత నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సేక్రెడ్ గేమ్స్ లో తన పాత్రకు రూ.4 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం.
పాతాళ్ లోక్ (2020)లో తన పాత్రతో జైదీప్ అహ్లవత్ OTT స్టార్ గా ఎదిగాడు. ఈ సిరీస్‌లో ఇన్‌స్పెక్టర్ హాథిరామ్ చౌదరి పాత్రకు గొప్ప ప్రశంసలు అందుకున్నారు. మొదటి సీజన్‌లో ఆయనకు తక్కువ పారితోషికం అందుకున్నా, నటుడిగా నిరూపించుకున్న తర్వాత రెండవ సీజన్‌లో ఆయన జీతం 50 రెట్లు పెరిగి టాప్ ఎర్నర్ గా జాబితాలో స్థానం సంపాదించాడు. త్రీ ఆఫ్ అజ్, జానే జాన్, మహారాజ్, ది బ్రోకెన్ న్యూస్‌లలో అద్భుత పాత్రలతో జైదీప్ పాపులరయ్యాడు. ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డులు సహా పలు అవార్డులను గెలుచుకున్నారు. ఫ్యామిలీమ్యాన్ సీజన్ 3లో జైదీప్ అహ్లావత్ నటనకు ప్రశంసలు కురిసాయి.
ఓటీటీ రంగలో పెద్ద స్టార్‌గా వెలిగిపోతున్నాడు పంకజ్ త్రిపాఠి. మీర్జాపూర్ సిరీస్ కోసం దాదాపు రూ.10 కోట్లు, సేక్రెడ్ గేమ్స్ కోసం రూ.8-12 కోట్లు పంకజ్ సంపాదించారు. తనదైన వైవిధ్యమైన పాత్రలతో అతడు నమ్మదగిన ఫాలోవర్స్ ని పెంచుకున్నాడు పంకజ్. స్పెషల్ ఓపిఎస్‌లోను రా ఇంటెలిజెన్స్ అధికారిగా అతడి నటనకు మంచి పేరొచ్చింది.
