పుష్ప రేంజ్ మ్యాచ్ చేయాలంటే..?
పుష్ప ముందు వరకు సుకుమార్ లెక్క వేరు కానీ ఎప్పుడైతే పుష్ప రెండు భాగాలు తీశాడో సుకుమార్ మీద విపరీతమైన అంచనాలు పెరిగాయి.
By: Ramesh Boddu | 23 Dec 2025 10:31 AM ISTపుష్ప ముందు వరకు సుకుమార్ లెక్క వేరు కానీ ఎప్పుడైతే పుష్ప రెండు భాగాలు తీశాడో సుకుమార్ మీద విపరీతమైన అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ డైరెక్టర్ గా పుష్ప సినిమాతో సుకుమార్ రేంజ్ పెరిగింది. అందుకే పుష్ప తర్వాత ఆయన చేస్తున్న సినిమా గురించి నేషనల్ లెవెల్ లో డిస్కషన్ నడుస్తుంది. పుష్ప 1 & 2 సినిమాలతో సుకుమార్ చేసిన మ్యాజిక్ తెలిసిందే. పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటనతో ఆడియన్స్ కి పూనకాలు తెప్పించేలా చేయడంలో సుకుమార్ సూపర్ సక్సెస్ అయ్యాడు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా..
పుష్ప 2 మాత్రమే కాదు పార్ట్ 3 కూడా ఉంటుందని తెలిసిందే. ఐతే దానికి కాస్త టైం పట్టేలా ఉంది. ప్రస్తుతం సుకుమార్ తన నెక్స్ట్ సినిమా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా హార్స్ రేస్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతుందని కొందరు అంటుంటే కాదు కాదు రంగస్థలం పార్ట్ 2 అని మరికొందరు చెబుతున్నారు. ఐతే పుష్ప తర్వాత సుకుమార్ చేసే సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ హై రేంజ్ లో ఉంటాయి.
చరణ్ తో ఆల్రెడీ రంగస్థలం సినిమా చేసిన సుకుమార్ పుష్పని ఇలా తీయడానికి ఆ సినిమా ఇచ్చిన బూస్టింగ్ తోడైందని చెప్పొచ్చు. ఐతే పుష్ప రేంజ్ మళ్లీ సుకుమార్ కూడా అందుకుంటాడా అంటే పుష్ప స్టోరీ, స్క్రీన్ ప్లే అన్నిటి కన్నా ఎక్కువ క్లిక్ అయ్యింది పుష్ప రాజ్ క్యారెక్టరైజేషన్.. సో అందుకే చరణ్ సినిమాకు కూడా హీరోకి బలమైన క్యారెక్టరైజేషన్ రాసుకుంటున్నాడట సుకుమార్.
పుష్పని బ్రేక్ చేసే సినిమా..
ప్రస్తుతం చరణ్ పెద్ది సినిమా చేస్తున్నాడు ఆ సినిమా తర్వాత సుకుమార్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. సుకుమార్ తో రంగస్థలం 2 చేసినా లేదా మరో కథతో వచ్చినా ఆయన నుంచి పుష్పని బ్రేక్ చేసే సినిమా రావాలనే ఆడియన్స్ కోరుతున్నారు. మరి సుకుమార్ ప్లానింగ్ ఎలా ఉందో తెలియాల్సి ఉంది. మామూలుగా కథ కోసమే కాస్త ఎక్కువ టైం తీసుకునే సుక్కు చరణ్ తో సినిమాకు కూడా 2 ఏళ్లు టైం తీసుకునేలా ఉన్నాడు.
పుష్ప 3 ముందే చరణ్ సినిమాతో మరోసారి తన డైరెక్షన్ స్టామినా ఏంటో చూపించాలని చూస్తున్నాడు సుకుమార్. చరణ్ కూడా సుకుమార్ తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు. సుక్కు, చరణ్ కాంబినేషన్ లో వచ్చే సినిమా చేసే హంగామా ఎలా ఉంటుందో చూడాలని మెగా ఫ్యాన్స్ చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. సుకుమార్ ప్లానింగ్ గురించి అందరికీ తెలిసిందే.. సినిమా బాగా వచ్చేందుకు ఆయన కాస్త ఎక్కువ టైం తీసుకున్నా కూడా సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని తెలిసిందే కదా.
