టికెట్ రేట్ల పెంపుపై హైకోర్ట్ ఆగ్రహం!
సినిమాల టికెట్ రేట్ల పెంపుకు వీళ్లేదంటూ గతంలో సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.
By: Tupaki Entertainment Desk | 9 Jan 2026 4:18 PM ISTసినిమాల టికెట్ రేట్ల పెంపుకు వీళ్లేదంటూ గతంలో సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. `పుష్ప2`, గేమ్ ఛేంజర్, ఓజీ, అఖండ 2` వంటి సినిమాలకు టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరం లేదని సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ ప్రభాస్ `ది రాజాసాబ్`, మెగాస్టార్ `మన శంకర వరప్రసాద్ గారు` చిత్రాల నిర్మాతలు ఇటీవల తెలంగాణ హైకోర్ట్‌ని ఆశ్రయించారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని కోరుతూ ఈ రెండు చిత్రాల నిర్మాతలు వేరు వేరుగా పిటీషన్‌లు దాఖలు చేశారు.
టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల కోసం హోం శాఖ కార్యదర్శికి దరఖాస్తు చేశామని తెలిపారు. ఆ విజ్ఞప్తిని పరిశీలించిన హోం శాఖ కార్యదర్శికి సూచించాలని పిటీషన్‌లో కోర్టును కోరారు. దీనిపై బుధవారం విచారణ జరిపిన రాష్ట్ర హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుని ఆ సమయంలో విడుదలైన `పుష్ప2`, గేమ్ ఛేంజర్, ఓజీ, అఖండ 2` వంటి సినిమాల వరకే పరిమితం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ప్రభాస్ `ది రాజాసాబ్`, మెగాస్టార్ `మన శంకర వరప్రసాద్ గారు` చిత్రాలకు భారీ ఊరట లభించింది. ఈ రెండు సినిమాల టికెట్ ధరలు పెంచుకునే అవకాశం లభించింది.
ఈ నేపథ్యంలో న్యాయవాది శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు కారణంగా మళ్లీ కథ మొదటికి వచ్చేలా కనిపిస్తోంది. తాజాగా వెలువడిన తీర్పుతో `ది రాజాసాబ్`, మన శంకర వరప్రసాద్ చిత్రాల టికెట్ రేట్లు పెంచుకునే వెసులు బాటు కల్పించడంతో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే న్యాయవాది శ్రీనివాస్ దీన్ని సవాల్ చేస్తూ హైకెర్టుని ఆశ్రయించారు. ఈ సందర్భంగా హూకోర్టు ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
`ది రాజాసాబ్` మూవీ టికెట్ రేట్ల పెంపుపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే రేట్లు ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నించింది. ఎన్నిసార్లు చెప్పినా మీ ఆలోచనా విధానం మారదా?.. అని ఫైర్ అయింది. మోమో ఇచ్చిన అధికారికి రూల్స్ తెలియవా? అని నిలదీసింది. దీంతో పెద్ద సినిమాల టికెట్ రేట్ల వివాదం మళ్లీ మొదటికి వచ్చేస్తుందా? అనే అనుమానాలు మొదలయ్యాయి. `మన శంకర వరస్రసాద్ గారు` పరిస్థితి ఏంటనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.
