కార్‌లో వేధింపులు.. గంటల పాటు నటి ఆర్తనాదాలు.. వినే దిక్కే లేదు!
ఇది త్రోబ్యాక్ మ్యాటర్.. అయినా ఈ కేసులో ప్రజలకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి.
By: Sivaji Kontham | 19 Sept 2025 12:00 AM ISTఇది త్రోబ్యాక్ మ్యాటర్.. అయినా ఈ కేసులో ప్రజలకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం ప్రముఖ కథానాయికను మార్గం మధ్యలో కిడ్నాప్ చేసి, అటుపై ఏడుగురు దుర్మార్గులు కొన్ని గంటల పాటు కార్ లో నిస్సహాయురాలిని బంధించి వేధించి విధివంచితగా మార్చిన ఈ ఘటన దేశవ్యాప్తంగా ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది.
అసలు ఆరోజు ఏం జరిగింది? అన్నది ఇప్పటికీ పూర్తిగా ప్రజలకు తెలియదు. దానికి కారణం పోలీసులు అసలు వివరాలేవీ బయటపెట్టకపోవడమే. ఆరోజు సదరు హీరోయిన్ షూటింగ్ ముగించుకుని తిరిగి తన బసకు కార్ లో వెళుతుండగా అనూహ్యమైన ప్రమాదం తలెత్తింది. వెనక నుంచి వచ్చిన ఒక కార్ బలంగా తన కార్ ని ఢీకొట్టింది. దీంతో కార్ వెంటనే ఆ నిర్మానుష్యమైన రోడ్ లో ఆగిపోయింది. వెంటనే కండలు తిరిగిన ముగ్గురు దుండగులు తన కార్ నడుపుతున్న డ్రైవర్ దగ్గరకు వచ్చి ఘోరంగా కొట్టడం ప్రారంభించారు. అది తట్టుకోలేక అతడు హీరోయిన్ ని వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఆపై అసలు కథ మొదలైంది. నిస్సహాయంగా దొరికిపోయిన హీరోయిన్ ని తమ కార్ లో ఎక్కించి అన్ని డోర్లు లాక్ చేసారు.
ఆ కార్ అక్కడికక్కడే నిర్మానుష్యంగా ఉన్న అడవి లాంటి ప్రదేశంలో రోడ్లలో చుట్టూ తిరగడం ప్రారంభించింది. అలా వెళుతున్న రన్నింగ్ కార్ డోర్లు తెరుచుకునే ఛాన్సే లేదు. బయట వెళుతున్న వారికి కూడా లోన ఏం జరుగుతుందో కనిపించేందుకు ఆస్కారం లేదు. కార్ లో హీరోయిన్ ని బంధించి మొత్తం ఏడుగురు దుండగులు తనను వేధించడం ప్రారంభించారు. అది నిర్మానుష్యమైన ప్రదేశం కావడంతో అటుగా వెళ్లే వాహనాలు కూడా చాలా తక్కువ. దీంతో ఎవరూ జరుగుతున్న ఘోరాన్ని కనిపెట్టలేకపోయారు. ఇక ఆ కార్ లోనే సదరు హీరోయన్ తనను కాపాడాలని ఆర్తనాదాలు చేసింది. కానీ ఎవరూ పట్టించుకునే నాధుడే లేడు. అలా నాలుగు గంటలు పైగా సదరు హీరోయిన్ ని దుండగులు రన్నింగ్ కార్ లోనే వేధించారు. అంతేకాదు తనను వేధించిన వీడియో ఫుటేజ్ ని కూడా వారు రికార్డ్ చేసారు.
అయితే సదరు హీరోయిన్ ని ఇంత దారుణంగా వేధించారు! అనే విషయాన్ని దర్యాప్తు అధికారులు ఎవరూ ప్రస్థావించకుండా దాచేయడంతో జరిగిన అసలు నిజం ఏమిటో ప్రజలకు ఇప్పటికీ తెలియదు. ఒక నటిని జస్ట్ వేధించారు.. అశ్లీల ఫోటోలు వీడియోలు తీసి వదిలేసారు! అని మాత్రమే ఆ సమయంలో వార్తా కథనాలొచ్చాయి. కానీ కార్ లో నాలుగు గంటల పాటు సాగిన ఘోర కృత్యం గురించి అంతగా ప్రచారం చేయలేదు. ఇక ఈ కేసును సీరియస్ గా డీల్ చేసిన పోలీసులు పిన్ టు పిన్ ఏం జరిగిందో గ్రహించారు. ఆ తర్వాత పారిపోయిన ఏడుగురు దుర్మార్గులను పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న ఫుటేజ్ ని కూడా లాక్కుని వివరాల్ని ఆరాలు తీసారు. ఆ తర్వాత నిర్ఘాంతపోయే మరో విషయం బయటపడింది.
కార్ లో తనను వేధించేప్పుడు ఒక దుండగుడి మాస్క్ ని ఆ హీరోయిన్ లాగడంతో అతడు ఒక ప్రముఖ హీరోకి డ్రైవర్ అని తెలిసిపోయింది. అప్పుడు ఆ హీరోయిన్ కి అసలు విషయం అర్థమైంది. తనపై పాత కక్షల కారణంగా పగతో ఆ హీరో వెనక ఉండి ఈ కథంతా నడిపించాడని ఆ నటి గ్రహించింది. ఆ తర్వాత కోర్టులో దీనిని విన్నవించాక అసలైన డ్రామా మొదలైంది. ఈ అన్ వాంటెడ్ కిడ్నాప్ వెనక అసలు డ్రాగన్ బయటికి వచ్చాడు. ఆ తర్వాత వ్యవహారాలన్నీ తెలిసినవే. అయితే సదరు హీరో ఎందుకు ఇంత పెద్ద కుట్ర చేసాడు? అంటే .. ప్రముఖ నటితో తన ఎఫైర్ గురించి మొదటి భార్యకు చెప్పేయడంతో విడాకులు అయ్యాయనే కోపంతోనే ఇదంతా చేసాడని కూడా ఆ హీరోయిన్ కోర్టుకు వెల్లడించారు. కార్ లో ఆ నాలుగు గంటలు ఏం జరిగిందనే మిస్టరీ చాలా కాలానికి యూట్యూబ్ చానెళ్ల ద్వారా ప్రజలు తెలుసుకోవడం ప్రారంభించారు.
