Begin typing your search above and press return to search.

హే భగవాన్ ట్రైలర్.. ఎలా ఉందంటే..

ఆయన యాక్ట్ చేస్తున్న తాజా చిత్రం హే భగవాన్.. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్‌ గా తెరకెక్కుతోంది. త్వరలో థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

By:  M Prashanth   |   12 Feb 2026 2:19 PM IST
హే భగవాన్ ట్రైలర్.. ఎలా ఉందంటే..
X

వైవిధ్యమైన కథలతో టాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో సుహాస్ మరో మూవీతో ఆడియన్స్ ను అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఆయన యాక్ట్ చేస్తున్న తాజా చిత్రం హే భగవాన్.. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్‌ గా తెరకెక్కుతోంది. త్వరలో థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.




ఇప్పటికే టీజర్, సాంగ్స్ తో సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవ్వగా.. తాజాగా విడుదలైన ట్రైలర్‌ అంచనాలను మరింత పెంచిందనే చెప్పాలి. ట్రైలర్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచే నవ్వులు పూయిస్తుంది. సీనియర్ నటుడు నరేష్ కీలక పాత్రలో కనిపించనుండగా.. ఆయన ఒక సీక్రెట్ బిజినెస్ ను నడుపుతూ ఉంటారు. కానీ ఆ వ్యాపారం గురించి బయటకు చెప్పకూడదనే స్ట్రిక్ట్ రూల్ కూడా ఉంటుంది.

అయితే ఆ బిజినెస్ తన చేతుల్లోకి తీసుకోవాలని సుహాస్ అనుకోవడం వల్ల కథలో ఇంట్రెస్టింగ్ మలుపులు తిరుగుతాయి. అలా తండ్రీ కొడుకుల మధ్య జరిగే సంఘటనలు, ఆ సీక్రెట్ బిజినెస్ చుట్టూ తిరిగే కామెడీ, సిచ్యువేషనల్ హ్యూమర్ ట్రైలర్‌ లో బాగా హైలైట్ అయ్యాయి. ఆ బిజినెస్ అసలు ఏమిటన్నది మాత్రం మేకర్స్ సస్పెన్స్‌ గా ఉంచారు. అదే మూవీపై మరింత క్యూరియాసిటీ పెంచుతోంది.

ఇక హీరోయిన్‌ గా శివానీ నాగారం నటిస్తోంది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తర్వాత సుహాస్ తో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటుండంతో ఆ జంట స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, లవ్ స్టోరీ కూడా సినిమాకు బిగ్ అసెట్స్ గా మారనున్నాయని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. దర్శకుడు గోపి అచ్చర.. సినిమాను కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్‌ గా తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతుంది.

ఫన్ తో పాటు క్లైమాక్స్‌ లో ఎమోషనల్ టచ్ కూడా ఉండనుంది. అందుకే సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ కు కూడా బాగా కనెక్ట్ అవ్వనున్నట్లు కనిపిస్తోంది. సంగీత దర్శకుడు వివేక్ సాగర్ అందించిన బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ కు మరో హైలైట్‌ గా నిలిచింది. సీన్స్ కు తగ్గట్టుగా మ్యూజిక్ ఎలివేట్ చేయడంతో ఎంటర్టైన్మెంట్ మరింత పెరిగింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సూపర్ రేంజ్ లో ఉన్నట్టు కనిపిస్తున్నాయి.

త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌ పై నరేంద్ర రెడ్డి చిత్రాన్ని నిర్మించగా, బన్నీ వాస్- వంశీ నందిపాటి రిలీజ్ చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న హే భగవాన్ ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏదేమైనా హే భగవాన్ ట్రైలర్ చూస్తుంటే ఇది నార్మల్ మూవీ కాదని, థియేటర్ లో నవ్వుల వర్షం కురిపించే ఫన్ బ్యాంగర్ అవుతుందని క్లియర్ గా తెలుస్తోంది. మరి సుహాస్ ఈసారి ఎలాంటి హిట్ కొడతారో వేచి చూడాలి.