Begin typing your search above and press return to search.

నిర్మాతలుగా సత్తా చాటుతున్న స్టార్ హీరోయిన్లు!

కాలంతో పాటు నటీమణుల ఆలోచనా విధానం కూడా పూర్తిగా మారిపోతుంది. కేవలం నటిగా మాత్రమే కాకుండా తెరవెనుక బాధ్యతలను భుజాన వేసుకుంటూ నిర్మాణ రంగంలోనూ తమదైన ముద్ర వేస్తున్నారు.

By:  Srikanth Kontham   |   26 Aug 2026 6:00 PM IST
నిర్మాతలుగా సత్తా చాటుతున్న స్టార్ హీరోయిన్లు!
X

కొన్ని సంవత్సరాల క్రితం వరకు హీరోయిన్లు గ్లామర్ పాత్రలకు...పరిమితమైన నటనకు మాత్రమే పరిమిత మయ్యేవారు. తెరపై అందంగా కనిపించడం, పాటలకు డ్యాన్స్ చేయడం వరకే కెరీర్ పరిమితమై ఉండేది. కానీ కాలం మారింది. కాలంతో పాటు నటీమణుల ఆలోచనా విధానం కూడా పూర్తిగా మారిపోతుంది. కేవలం నటిగా మాత్రమే కాకుండా తెరవెనుక బాధ్యతలను భుజాన వేసుకుంటూ నిర్మాణ రంగంలోనూ తమదైన ముద్ర వేస్తున్నారు.

సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న నయనతార ఈ ట్రెండ్‌కు చక్కని ఉదాహరణగా నిలుస్తున్నారు. భర్త విగ్నేష్ శివన్‌తో కలిసి రౌడీ పిక్చర్స్ బ్యానర్‌ను స్థాపించి పలు ప్రయోగాత్మక చిత్రాలను నిర్మిస్తున్నారు. తమిళ సినిమాలకే పరిమితం కాకుండా ఇతర భాషా చిత్రాలపై కూడా దృష్టి పెడుతున్నారు. స్ట్రాంగ్ స్క్రిప్ట్ లు ఎక్క‌డ దొరికితే? అక్క‌డ నిర్మించ‌డానికి రెడీగా ఉన్నారు. న‌య‌న్ ఇటీవల గుజరాతి సినిమా `శుభయాత్ర`ను కూడా నిర్మించి ఆశ్చర్యపరిచారు.

బాలీవుడ్ విషయానికి వస్తే అగ్ర హీరోయిన్ అలియా భట్ నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ను స్థాపించి దూసుకుపోతున్నారు. ఇప్పటికే `డార్లింగ్స్`, `జిగ్రా` వంటి వైవిధ్యమైన సినిమాలను నిర్మించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా `డోంట్ బి షై` అనే చిత్రాన్ని కూడా ప్ర‌క‌టించారు. ఇలా అలియాభ‌ట్ నిర్మాత‌గా.. నటిగానే బిజీగా ఉన్నారు.

ఇదే బాట‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లుగా ఉన్న కృతి సనన్ .. సమంత కూడా నిర్మాతలుగా అదే జోరును ప్రదర్శిస్తున్నారు. కృతి సనన్ తన సొతం నిర్మాణ సంస్థను ప్రారంభించి కంటెంట్ ఓరియెంటెడ్ కథలతో పాటు విభిన్నమైన ప్రాజెక్ట్‌లను ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు సమంత ట్రాలా లాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌ను స్థాపించి, బలమైన భావోద్వేగాలు ఉన్న కథలను ఎంచుకుని నిర్మాణ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర చుకుంటున్నారు.

నటీమణులు ఇలా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడానికి కార‌ణం కేవ‌లం వ్యాపార దృక్పథం మాత్రమే కాదు. నచ్చిన కథలను ప్రేక్షకులకు అందించాలనే తపనే ప్రధాన కారణం. మగవారు ఆధిపత్యం చెలాయించే ప్రొడక్షన్ రంగంలో మహిళలు అడుగుపెట్టి విజయాలు సాధించడం ఇండస్ట్రీలో సానుకూల పరిణామంగా చెప్పొచ్చు. లేడీ ఓరియేంటెడ్ కథలకు పెద్దపీట వేయడానికి ఈ స్టార్ హీరోయిన్ల ప్రొడక్షన్ వెంచర్లు ఎంతగానో దోహద పడుతున్నాయి.

తెరపై అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను అలరిస్తున్న స్టార్ హీరోయిన్లు తెర వెనుక సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్లుగా రాణించ‌డం ప్రశంసనీయం. వారి సాహసోపేతమైన అడుగులు రాబోయే యువ నటీమణులకు గొప్ప మార్గదర్శకంగా నిలుస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.