Begin typing your search above and press return to search.

సమంత తో పాటు దర్శకులను వివాహం చేసుకున్న సెలబ్రిటీస్ వీళ్లే!

అయితే అలాంటి రాజ్ నిడిమోరుని తాజాగా సమంత పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. మరి సమంత దారిలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం..

By:  Madhu Reddy   |   1 Dec 2025 10:40 PM IST
సమంత తో పాటు దర్శకులను వివాహం చేసుకున్న సెలబ్రిటీస్ వీళ్లే!
X

సమంత రుత్ ప్రభు కాస్త సమంత నిడిమోరుగా మారిపోయింది. తాజాగా ఈరోజు అనగా డిసెంబర్ 1 2025న సమంత కోయంబత్తూర్ లోని ఈశా యోగ సెంటర్ దగ్గర ఉన్న లింగ భైరవి అమ్మవారి టెంపుల్ లో భూత శుద్ధి పద్ధతిలో వివాహం చేసుకున్నారు. నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. అదే సమయంలో నిర్మాత, దర్శకుడు అయినటువంటి రాజ్ నిడిమోరు కూడా తన భార్యతో ఉన్న బంధాన్ని తెంచుకున్నారు. దాంతో పాటే సమంత , రాజ్ ఇద్దరు చెట్టాపట్టాలేసుకొని తిరగడం హాట్ టాపిక్ గా మారింది. అలాగే సమంత చేసే ప్రతి ఒక పనిని సపోర్ట్ చేస్తూ ఆమె వెనకే ఉంటూ అండగా నిలుస్తున్నారు. అయితే అలాంటి రాజ్ నిడిమోరుని తాజాగా సమంత పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. మరి సమంత దారిలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం.. డైరెక్టర్స్ ని పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ లిస్టులో రమ్యకృష్ణ, కుష్బూ, యామి గౌతమ్, నయనతార, రాణి ముఖర్జీ వంటి సెలబ్రెటీలు ఉన్నారు.

కుష్బూ సుందర్ సి :

సౌత్ హీరోయిన్ కుష్బూ తమిళ డైరెక్టర్ సుందర్ .సి ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే సుందర్ సి కంటే ముందే కుష్బూ మరో నటుడిని పెళ్లి చేసుకొని పెళ్లైన మూడు నెలలకే విడాకులు ఇచ్చినట్టు తెలుస్తోంది.ఆ తర్వాత డైరెక్టర్ సుందర్ సి తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు.

రమ్యకృష్ణ - కృష్ణవంశీ :

దర్శకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్టులో రమ్యకృష్ణ కూడా ఉంటుంది. రమ్యకృష్ణ.. కృష్ణ వంశీ డైరెక్షన్లో వచ్చిన పలు సినిమాల్లో యాక్ట్ చేసింది. అలా సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఈ జంట కూడా పెళ్లి చేసుకున్నారు.

నయనతార - విఘ్నేష్ శివన్:

సౌత్ బ్యూటీ నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి సమయంలో ఎన్నో రూమర్లు వినిపించాయి. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ అయినటువంటి నయనతార అలాంటి చిన్న దర్శకుడిని పెళ్లి చేసుకోవడం ఏంటి అని విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఆ విమర్శలన్నింటినీ పక్కనపెట్టి ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇక విఘ్నేష్ శివన్ కంటే ముందే శింబు, ప్రభుదేవాలతో ప్రేమాయణం నడిపించింది.

యామి గౌతమ్ - ఆదిత్యధర్ :

బాలీవుడ్ బ్యూటీ యామి గౌతమ్ అంటే తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఈ హీరోయిన్ అల్లు శిరీష్ మొదటి మూవీ గౌరవం మూవీలో హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ హీరోయిన్ పేరు టక్కున గుర్తుకు రావాలంటే ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ పేరు చెప్తే అందరికీ ఇట్టే గుర్తుకు వస్తుంది. అలా బాలీవుడ్లో పలు సినిమాలు చేసిన యామి గౌతమ్ దర్శకుడు ఆదిత్యధర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

రాణి ముఖర్జీ - ఆదిత్య చోప్రా:

బాలీవుడ్ బ్యూటీ రాణి ముఖర్జీ బాలీవుడ్ లో ఫేమస్ అయినటువంటి యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ చైర్మన్ అయినటువంటి నిర్మాత, దర్శకుడు అయిన ఆదిత్య చోప్రాని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే రాణి ముఖర్జీకి అది మొదటి పెళ్లి అయినప్పటికీ ఆదిత్య చోప్రా రాణి ముఖర్జీ కంటే ముందే పాయల్ ఖన్నాని పెళ్లి చేసుకున్నారు.వీరిద్దరికి విడాకులు అయ్యాక 2014లో రాణి ముఖర్జీని పెళ్లాడారు. అలా సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది నటీమణులు దర్శకులను పెళ్లి చేసుకున్నారు. ఈ లిస్టులో తాజాగా సమంత కూడా చేరిపోయింది. ఇక సమంత పెళ్లి ఫోటోలు వైరల్ అవ్వడంతో ఉపాసన, లావణ్య త్రిపాఠి, సుస్మిత కొణిదెల,అనుపమ వంటి కొంతమంది సెలబ్రిటీలు ఈ జంటకు కంగ్రాట్స్ చెప్పారు.