స్టార్ హీరోలకు జోడీలెవరు?
కొన్ని సార్లు సెట్స్ కు వెళ్లడానికి ముందే హీరోయిన్ దొరుకుతుంది. కొన్ని సార్లు సెట్స్ కు వెళ్లిన తర్వాత షూటింగ్ మధ్యలోనే నాయికను ఎంపిక చేస్తుంటారు.
By: Srikanth Kontham | 2 Oct 2025 3:00 PM ISTఎంత పెద్ద స్టార్ సినిమా అయినా? ఆ కథలో హీరోయిన్ కూడా అంతే కీలకం. పాత్ర డిమాండ్ ను బట్టి ఏ నటి సూటువుతుందో ఎంపిక చేస్తుంటారు. అప్పుడప్పుడు వాళ్లను ఎంపిక చేయడం మేకర్స్ కు సవాల్ గా మారుతుంది.
కొన్ని సార్లు సెట్స్ కు వెళ్లడానికి ముందే హీరోయిన్ దొరుకుతుంది. కొన్ని సార్లు సెట్స్ కు వెళ్లిన తర్వాత షూటింగ్ మధ్యలోనే నాయికను ఎంపిక చేస్తుంటారు. పాత్రకు తగ్గ హీరోయిన్ దొరకని సమయంలో చివరకు రాజీ పడక తప్పదు.హీరోయిన్ల విషయంలో డైరక్టర్లు ఎదుర్కోంటున్న ప్రధాన సమస్య ఇది.
హీరోయిన్ల వేటలో నయా డైరెక్టర్లు:
తాజాగా కొంత మంది స్టార్ హీరోల అప్ కమింగ్ ప్రాజెక్ట్ లలో హీరోయిన్లు ఇంకా ఫైనల్ కాలేదు. ఈనేపథ్యంలో ఆస్టార్ హీరోలకు జోడీగా ఎవరు ఎంపికవుతారు? అన్నది ఆసక్తికరంగామారింది. ఓ సారి ఆ వివరాల్లోకి వెళ్తే..పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా `సలార్ 2` చేయాల్సి ఉంది. మొదటి భాగంలో శ్రుతి హాసన్ నటించింది.రెండవ భాగంలో ఆమె పాత్ర కొనసాగుతుంది. కానీ మరో హీరోయిన్ కు అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ నుంచి స్టార్ ఇమేజ్ ఉన్న నటిని దించాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడుట.
సింహంతో ఛాన్స్ ఎవరికి?
అలాగే రామ్ చరణ్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో చరణ్ 17 లాక్ అయింది. కానీ ఇందులో హీరోయిన్ ఎవరు? అన్నది ఇంకా ఫైనల్ కాలేదు. కృతి సనన్ పేరు తెరపైకి వచ్చింది. కానీ ఇంకా ఫైనల్ కాలేదు.
హీరోయిన్ విషయంలో సుకుమార్ ఎక్కడా రాజీ పడడు. ఓ పెద్ద హీరోయిన్ నే తీసుకొస్తాడు. అలాగే నటసింహ బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో సినిమా కూడా పట్టాలెక్కాల్సి ఉంది. ఇందులో కూడా ఇంకా హీరోయిన్ ఎంపిక అవ్వలేదు. సింహానికి జోడీగా కొత్త భామని పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
ఛాన్స్ అందుకునే భామలెవరు?
హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఉండటంతో బ్యూటీ కంటే మంచి పెర్పార్మర్ అయి ఉండాలని గోపీ చంద్ భావిస్తున్నాడుట.అలాగే మెగాస్టార్ చిరజీవి 158వ చిత్రం బాబి దర్శకత్వతంలో లాక్ అయిన సంగతి తెలిసిందే.
ఈసినిమాకు హీరోయిన్ ఫైనల్ అవ్వలేదు. మాఫియా కాన్సెప్ట్ కావడంతో? బలమైన నాయికనే తీసుకోవాలని చూస్తున్నాడు. అలాగే చిరు-శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ కు హీరోయిన్ ఫైనల్ అవ్వాల్సి ఉంది. మరి ఈ స్టార్ హీరోల సరసన ఏ భామలు అవకాశాలు అందుకుంటారో చూడాలి.
