Begin typing your search above and press return to search.

లోపాలు చెప్ప‌క‌పోవ‌డం ఆ హీరోకి ఓ శాపంలా!

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో స్టార్ హీరోల పాలిట భ‌జ‌న ఎలా ఉంటుంది? అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, టెక్నిషియ‌న్లు, హీరోయిన్లు, ఇత‌ర న‌టీన‌టులు ఆ సినిమాలో న‌టించే హీరో ప‌ట్ల ఏ రేంజ్ లో ఎలివేష‌న్ ఇస్తారో తెలిసిందే.

By:  Srikanth Kontham   |   25 Feb 2026 9:00 AM IST
లోపాలు చెప్ప‌క‌పోవ‌డం ఆ హీరోకి ఓ శాపంలా!
X

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో స్టార్ హీరోల పాలిట భ‌జ‌న ఎలా ఉంటుంది? అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, టెక్నిషియ‌న్లు, హీరోయిన్లు, ఇత‌ర న‌టీన‌టులు ఆ సినిమాలో న‌టించే హీరో ప‌ట్ల ఏ రేంజ్ లో ఎలివేష‌న్ ఇస్తారో తెలిసిందే. పెద్ద సినిమా అయినా..చిన్న సినిమా అయినా స‌రే హీరో మాత్ర‌మే అక్క‌డ హైలైట్ అవుతాడు. ప్ర‌త్యేకించి అగ్ర హీరోల విష‌యంలో ఈ భ‌జ‌న మ‌రీ శ్రుతిమించుతుంద‌న్న‌ది కాద‌న‌లేని నిజం. నందిని కూడా ఆ హీరో పంది అంటే? అది పందే అనే ప‌రిస్థితులు దాప‌రించాయి. హీరో తానా అంటే ఆవెంట తందానా అన్న‌ట్లే ప్ర‌తీ స‌న్నివేశంలోనూ క‌నిపిస్తుంది.

ప్ర‌ముఖంగా ఓ హీరో గురించి ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు ఇస్తోన్న ఎలివేష‌న్ చూస్తుంటే? అది అత‌డికి సానుకూలంగా కాదు..శాపంలా మారిందా? అన్న సందేహాన్ని కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు. హీరోల్ని పొగిడే క్ర‌మంలో అత‌డు ఏది చేసినా..చివ‌రికి త‌ప్పు చేసినా? క‌రెక్ట్ అవుతుంది. మిగ‌తా వారిదే త‌ప్పంతా? అన్న తీరున భ‌జ‌న క‌నిపిస్తోంది. ఆ ఒక్క హీరో విష‌యంలోనే కాదు. చాలా మంది హీరోల విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. కొంత మంది హీరోల సినిమాలు థియేట్రిక‌ల్ గా ఫెయిల‌వుతుంటాయి. కానీ బ‌య‌ట‌ ప్ర‌చారం మాత్రం వంద‌ల కోట్లు కొల్ల‌గొట్టింద‌ని చెబుతుంటారు.

ఆ హీరో దగ్గ‌ర‌కు వెళ్లి కూడా బాబు సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అంటూ అస‌లు మ్యాట‌ర్ దాస్తారు. వాస్త‌వం ఏంటి? అన్న‌ది ఆ హీరోకి తెలిసే స‌రికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. ఇప్పుడింకా సోష‌ల్ మీడియా అందుబాటులో ఉంది. వారి చేతుల్లో కూడా స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. కాబ‌ట్టి స‌రిపోయింది. సోష‌ల్ మీడియా లేని రోజుల్లో ఇలాంటి భ‌జ‌న‌లు హీరోల వ‌ద్ద బాగా చెల్లేవి. ఇప్పుడంతా వ‌ర్కౌట్ అవ్వ‌డం లేదు. ఈ విష‌యంలో భ‌జ‌న బ్యాచ్ కూడా బ్యాలెన్సింగ్ గా వ్య‌వ‌హ‌రిస్తోంది. అయితే ఇలా హీరోల‌కు నిజాయితీగ‌ల స‌మాచారం ఇవ్వ‌క‌పోవ‌డం వ‌ల్ల ఆ హీరో తాను చేసిందే? క‌రెక్టే అన్న ధోర‌ణిలోకి వెళ్లిపోతున్నారు.

దీంతో త‌ప్పిదాల్ని స‌రి దిద్దుకునే అవ‌కాశం కూడా లేక‌పోతుంది. సాధార‌ణంగానే హీరోలంటే ఓ ర‌క‌మైన భావ‌న‌లో ఉంటారు. త‌మ నిర్ణ‌యాలే క‌రెక్ట్ అన్న ధోర‌ణి వాళ్ల‌లో క‌నిపిస్తుంది. వాస్త‌వం చెబితే వినే వాళ్లు ఎవ‌రు అన్న వాద‌న కూడా జ‌రుగుతుంటుంది. దీంతో నిజం చెప్పి బాధ‌పెట్ట‌డం క‌న్నా? అబ‌ద్దం చెప్పి సంతోషంగా ఉంచ‌డ‌మే ఉత్తంమంగా కొంద‌రు భావిస్తున్నారు. ఇది తాత్కాలిక ఉపశ‌మ‌నం మాత్ర‌మే. ఈ కార‌ణంగా వ్య‌క్తిగ‌తంగా ఎంతో డ్మామేజ్ జ‌రుగుతోంద‌న్న‌ది అంతే వాస్త‌వం.