Begin typing your search above and press return to search.

పెద్ద న‌టుడి ప‌రువు తీస్తున్న భార్య అంటూ ఫ్యాన్స్ ఆవేద‌న‌

చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ కాలం పాటు హీరోలుగా కొనసాగే నటులు తమ కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా తోటి కథానాయికలతోనే ఎక్కువ సమయం గడుపుతారని ప్రముఖ హీరో భార్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి.

By:  Sivaji Kontham   |   3 Sept 2026 6:00 AM IST
పెద్ద న‌టుడి ప‌రువు తీస్తున్న భార్య అంటూ ఫ్యాన్స్ ఆవేద‌న‌
X

చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ కాలం పాటు హీరోలుగా కొనసాగే నటులు తమ కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా తోటి కథానాయికలతోనే ఎక్కువ సమయం గడుపుతారని ప్రముఖ హీరో భార్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒక రియాలిటీ షోలో భాగస్వామ్యుల బంధాలపై మాట్లాడుతూ ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ఒక నటుడి భార్య అయి ఉండీ బహిరంగంగా ఇలాంటి విషయాలను మాట్లాడటంపై సదరు హీరో అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సినిమాల్లో లేదా షోలలో నటీనటులు కలిసి పనిచేసేటప్పుడు వారి మధ్య సహజంగానే ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడుతుందని స‌ద‌రు హీరోగారి భార్యామ‌ణి షోలో గ‌ట్టి స్వ‌రంతో పేర్కొన్నారు. మా హీరోనే తీసుకోండి.. వారి కంటే ఎక్కువగా తోటి హీరోయిన్లతోనే ఎక్కువ సమయం గడుపుతారు.. దానివల్ల వారి మధ్య సహజంగానే బాండింగ్ (అనుబంధం) ఏర్పడుతుంది! అని బ‌హిరంగంగా వ్యాఖ్యానించారు. ఒక నటుడి వ్యక్తిగత జీవితాన్ని.. వారి వృత్తిపరమైన సంబంధాలను ఇలా బహిరంగంగా తప్పుగా అర్థం వచ్చేలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

షోలో పనిచేసే నటీనటుల మధ్య సాన్నిహిత్యంపై వస్తున్న రూమర్లను ఖండిస్తూ.. రొమాంటిక్ సన్నివేశాల్లో నటించేటప్పుడు నటీనటుల మధ్య సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడటం సహజమని విశ్లేషించారు. అయితే అంత మాత్రాన దాన్ని అక్రమ సంబంధంగా భావించకూడదని సూచించారు. వారు ఒకరికొకరు సహాయం చేసుకోవడం.. ఇంటి నుండి భోజనం తెప్పించుకోవడం వంటి విషయాలు మానవత్వంతో కూడిన అంశాలని.. వీటిని నెగెటివ్‌గా చూడాల్సిన అవసరం లేదని ఆమె అభిప్రాయపడ్డారు.

అయితే సదరు ప్రముఖ హీరో ఆయన భార్య మధ్య గత కొంతకాలంగా ఉన్న వ్యక్తిగత విభేదాలు, ఒకరిపై ఒకరు చేసుకుంటున్న బహిరంగ విమర్శల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రావడం మరింత వివాదాస్పదమైంది. ఇప్పటికే వారి దాంపత్య జీవితంలో అనేక సమస్యలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న సమయంలో ఆమె ఇలాంటి సున్నితమైన విషయాలను మీడియా ముందుకు తీసుకురావడం హీరో ప్రతిష్టను దిగజార్చేలా ఉందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఈ వ్యాఖ్యల వల్ల తమ ప్రియతమ కథానాయకుడి వ్యక్తిగత - వృత్తిపరమైన ప్రతిష్ట దెబ్బతింటోందని అభిమానులు సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. ఒక పెద్ద నటుడి స్థానాన్ని, అత‌డి పరువును కాపాడాల్సిన భార్యే ఇలాంటి వ్యాఖ్యలతో పరువు తీస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినీ రంగంలో ఉన్న వృత్తిపరమైన సంబంధాలకు ఇలాంటి రంగు పులమడం సరికాదని నెటిజన్లు కూడా అభిప్రాయపడుతున్నారు.