Begin typing your search above and press return to search.

ఆ సినిమాను తొక్కి పడేసిన 'మిరాయ్‌'..!

సౌత్‌ సినిమా ఇండస్ట్రీలతో పోల్చితే బాలీవుడ్‌ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈ ఏడాది కాస్త పర్వాలేదు అనుకుంటున్న సమయంలో మళ్లీ వరుస పెట్టి ఫ్లాప్‌లు పడుతున్నాయి.

By:  Ramesh Palla   |   17 Sept 2025 11:01 AM IST
ఆ సినిమాను తొక్కి పడేసిన మిరాయ్‌..!
X

సౌత్‌ సినిమా ఇండస్ట్రీలతో పోల్చితే బాలీవుడ్‌ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈ ఏడాది కాస్త పర్వాలేదు అనుకుంటున్న సమయంలో మళ్లీ వరుస పెట్టి ఫ్లాప్‌లు పడుతున్నాయి. తాజాగా జాతీయ అవార్డ్‌ గ్రహీత దర్శకుడు ఉమేష్ శుక్లా దర్శకత్వంలో రూపొందిన హీర్‌ ఎక్స్‌ప్రెస్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదో మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని, హౌస్‌ఫుల్‌ తరహాలో మంచి కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ సినిమాలో ఉంటుంది అంటూ మేకర్స్ ప్రచారం చేస్తూ వచ్చారు. సినిమాకు పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయ్యేలా సినిమాను ప్రమోట్‌ చేశారు. తీరా సినిమా విడుదల తర్వాత తీవ్ర నష్టం చవిచూసింది. సెప్టెంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీర్‌ ఎక్స్‌ప్రెస్ సినిమా మొదటి రోజు కనీసం కోటి వసూళ్లను కూడా రాబట్టలేక పోయింది. మొదటి వీకెండ్‌ పూర్తి అయ్యేప్పటికి రూ.1.5 కోట్లు రాబట్టిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

హీర్‌ ఎక్స్‌ప్రెస్ మూవీకి బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవం

'హీర్‌ ఎక్స్‌ప్రెస్‌' సినిమాకు హిందీ నుంచి పెద్దగా పోటీ లేదు. చెప్పాలంటే సోలో రిలీజ్ ను దక్కించుకుంది. కానీ అప్పటికే ఉన్న మన తెలుగు సినిమా 'మిరాయ్‌' కారణంగా ఈ సినిమాకు మినిమం ఓపెనింగ్స్ నమోదు కాలేదు అంటూ బాక్సాఫీస్ వర్గాల టాక్‌. తేజా సజ్జా హీరోగా నటించిన మిరాయ్ సినిమాను హిందీ ప్రేక్షకులు మొదట కాస్త లైట్‌ తీసుకున్నట్లుగా అనిపించింది. కానీ పాజిటివ్‌ టాక్‌తో పాటు, ప్రముఖ హిందీ రివ్యూవర్స్‌, ట్రేడ్‌ విశ్లేషకులు పదే పదే మిరాయ్ గురించి సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేయడంతో పాటు, ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌ విడుదల చేయడంతో వసూళ్లు బలపడ్డాయి. రెండో వీకెండ్‌లో చాలా చోట్ల 50 నుంచి 80 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయినట్లుగా బాలీవుడ్‌ బాక్సాఫీస్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అక్కడ మిరాయ్‌ జోరు ముందు హీర్‌ ఎక్స్‌ప్రెస్‌ కుదేలయ్యింది.

బాలీవుడ్‌లో మిరాయ్ సినిమా ప్రభావం

దివిత జునేజా, అశుతోష్ రాణా, సంజయ్ మిశ్రా, గుల్షన్ గ్రోవర్, ప్రీత్ కమానీ, మేఘనా మాలిక్ ముఖ్య పాత్రల్లో నటించిన హీర్‌ ఎక్స్‌ప్రెస్ సినిమాకి పోటీగా మిరాయ్‌ లేకుంటే ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గర అయ్యేది. కానీ కనీసం సినిమాను గురించి ప్రేక్షకులు ఆలోచించకుండా మిరాయ్ జోరు కంటిన్యూ అవుతుంది. అందుకే హీర్‌ ఎక్స్‌ప్రెస్ సినిమాను జనాలు పక్కకు నెట్టి మరీ మిరాయ్ సినిమాను చూసేందుకు థియేటర్ల వద్ద క్యూ కట్టారు. దీంతో హీర్‌ ఎక్స్‌ప్రెస్ మేకర్స్‌, డిస్ట్రిబ్యూటర్స్ సినిమాకు ప్రేక్షకులను ఆకర్షించేందుకు గాను టికెట్ల ఆఫర్‌ పెట్టారు. అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్‌కు చూపించేందుకు గాను ఉచిత టికెట్‌ ఆఫర్‌ను చేస్తున్నారు. అయినా కూడా ప్రేక్షకులు కనీసం ఆ ఆఫర్‌ గురించి పట్టించుకోవడం లేదు, సోషల్‌ మీడియాలో దాని గురించి చర్చ కూడా లేదు.

బాక్సాఫీస్‌ వద్ద హీర్‌ ఎక్స్‌ప్రెస్‌ వర్సెస్‌ మిరాయ్‌

సాధారణంగా సినిమాల ప్రమోషన్స్‌లో భాగంగా ఉచిత టికెట్‌ ఆఫర్‌ ఇచ్చినప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ సినిమా కు ఉచితంగా ఫ్యామిలీకి టికెట్లు ఇస్తామని చెబుతున్నా కూడా పెద్దగా పట్టించుకుంటున్న వారు లేరు. సోషల్‌ మీడియాలో ఈ సినిమా గురించి పెద్దగా ప్రచారం లేక పోవడంతో ఉచిత టికెట్‌ ఆఫర్‌ను సైతం ప్రేక్షకులు తీసుకునేందుకు రెడీగా లేరు. మిరాయ్ రెండో వారంలోనూ తెగ సందడి చేస్తోంది. వీక్‌ డేస్‌లో అయినా కనీసం ప్రేక్షకులకు చేరువ కావాలి అనుకుంటే అప్పుడు కూడా మిరాయ్‌ సందడి ఉందని విశ్లేషకులు అంటున్నారు. మొత్తంగా ఆ బాలీవుడ్‌ మూవీ హీర్‌ ఎక్స్‌ప్రెస్‌ను మన మిరాయ్‌ సినిమా తొక్కి పడేసినట్లే అనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.