పర్పుల్ చీరలో హెబ్బా హొయలు.. మాయ చేస్తూ!
కుమారి 21ఎఫ్ సినిమా ద్వారా కుర్రకారు హృదయాలను దోచుకున్న హెబ్బా పటేల్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
By: Madhu Reddy | 25 May 2026 11:25 AM ISTకుమారి 21ఎఫ్ సినిమా ద్వారా కుర్రకారు హృదయాలను దోచుకున్న హెబ్బా పటేల్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. చిట్టి పొట్టి బట్టలతో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకొని ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ. నిజానికి ఈ సినిమాతో భారీ క్రేజ్ అందుకున్నప్పటికీ ఈమె నటించిన తొలి తెలుగు చిత్రం మాత్రం అలా ఎలా?.. రాహుల్ రవీంద్రన్ , వెన్నెల కిషోర్, కృష్ణ భగవాన్ తదితరులు కీలక పాత్రలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో పరవాలేదు అనిపించుకుంది. ఇక కుమారి 21ఎఫ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఇకపోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ గ్లామర్ వలకబోస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న హెబ్బా పటేల్ తాజాగా ఈసారి ట్రెడిషనల్ లుక్ లో కనిపించింది. పర్పుల్ కలర్ రా మాంగో బనారసీ సిల్క్ చీర కట్టుకున్న ఈమె తన చీరకట్టుతో అందరినీ ఆకట్టుకుంది. జుట్టును ముడివేసి మల్లెపూలు పెట్టుకున్న ఈమె.. నక్షితో డిజైన్ చేసిన నెక్ చౌకర్ను అలాగే చెవి దుద్దులను ధరించి చాలా సాంప్రదాయంగా కనిపించింది . చాలా రోజుల తర్వాత ఇలా ట్రెడిషనల్ గా కనిపించడంతో అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు.
ఈ పర్పుల్ కలర్ సిల్క్ చీరకి కాంబినేషన్లో స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి తన అందాలతో హొయలు పోయింది. ఇంస్టాగ్రామ్ వేదికగా హెబ్బా పటేల్ పంచుకున్న ఈ ఫోటోషూట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. హెబ్బా పటేల్ లేటెస్ట్ ఫోటోస్ చూసిన అభిమానులు క్యూటీ అని, బ్యూటిఫుల్ అని ఇలా తమకు నచ్చిన విధంగా ఆమెపై తమ అభిప్రాయాలను కామెంట్ రూపంలో షేర్ చేస్తున్నారు.
ఇక హెబ్బా పటేల్ విషయానికి వస్తే.. 1988 జనవరి 6 ముంబై, మహారాష్ట్రలో జన్మించిన ఈమె.. నటిగానే కాకుండా నృత్యకారణిగా కూడా మంచి పేరు సొంతం చేసుకుంది. 2014లో వచ్చిన తిరుమనం ఎనుమ్ నిఖా అనే చిత్రం ద్వారా తమిళ సినీ రంగంలోకి అడుగుపెట్టింది. కన్నడలో అధ్యక్ష అనే చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించింది. కుమారి 21ఎఫ్ తర్వాత ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, నేను నాన్న నా బాయ్ ఫ్రెండ్స్, మిస్టర్, అంధగాడు, ఏంజెల్, 24 కిస్సెస్, ఒరేయ్ బుజ్జిగా ఇలా పలు తెలుగు చిత్రాలలో నటించిన ఈమె చివరిగా ఈషా అనే చిత్రంలో నటించింది.
ప్రస్తుతం ఆద్య అనే తమిళ్ సినిమాలో నటించింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే విడుదల కానుంది.. ఇక అలాగే వ్యవస్థ అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ . ఏది ఏమైనా సినిమాలు, వెబ్ సిరీస్లలో బిజీగా ఉంటూనే మరొకవైపు ఆడియన్స్ను ఆకట్టుకోవడానికి ఇలా స్పెషల్ గా ఫోటోషూట్ చేస్తూ అలరిస్తోంది.
