చీరకట్టులో బ్యాక్ అందాలతో గిలిగింతలు పెడుతున్న కుమారి!
హెబ్బా పటేల్ తాజాగా ధరించిన చీర విషయానికి వస్తే.. ముకైష్ వర్క్ చీరలో కనిపించింది.సాంప్రదాయమైన హస్తకళలతో డిజైన్ చేసిన ఈ పీచ్ కలర్ చీర అభిమానులను ఆకట్టుకుంటుంది.
By: Madhu Reddy | 8 Jun 2026 12:24 PM ISTహెబ్బా పటేల్.. 1988 జనవరి 6న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించిన ఈ చిన్నది.. ఇండస్ట్రీలోకి రాకముందు నృత్యకారిణిగా మంచి పేరు సొంతం చేసుకుంది. ఇండస్ట్రీలోకి రావాలనే తపనతో తొలి అడుగు కన్నడ ఇండస్ట్రీ వైపు వేసింది. నిజానికి 2014లో వచ్చిన తమిళ్ మూవీ తిరుమనం ఎనుం నిఖా అనే చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం కావాల్సిన ఈమె.. కన్నడంలో వచ్చిన అధ్యక్ష అనే చిత్రంతో మొదటగా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. అధ్యక్ష తర్వాతే తమిళ మూవీ విడుదల కావడం గమనార్హం.ఇక 2014లోనే తొలిసారి అలా ఎలా? అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది..అలా ఒకే ఏడాది ఏకంగా మూడు భాషలలో అరంగేట్రం చేసి తన నటనను నిరూపించుకునే ప్రయత్నం చేసింది.
అయితే 2015లో వచ్చిన కుమారి 21ఎఫ్ అనే చిత్రం ఈమెకు మంచి గుర్తింపును అందించింది. సుకుమార్ కథ ,స్క్రీన్ ప్లే తో పాటు సహ నిర్మాణం చేసిన ఈ చిత్రానికి పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించారు. రాజ్ తరుణ్ హీరోగా విజయ్ రెడ్డి , థామస్ రెడ్డి సహ నిర్మాణంలో సుకుమార్ రైటింగ్స్ , పీఏ మోహన్ పిక్చర్స్ పతాకం పై నిర్మితమైన ఈ సినిమా హెబ్బా పటేల్ కి ఊహించని విజయాన్ని అందించింది. ఇక ఈ సినిమా తర్వాత ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, మిస్టర్ , ఏంజెల్ , 24 కిస్సెస్, ఒరేయ్ బుజ్జిగా ఇలా దాదాపు పదుల సంఖ్యలో చాలా చిత్రాలు చేసింది.
అయితే తెలుగులో సినిమాలు చేస్తోంది కానీ సరైన సక్సెస్ లభించలేదు. కానీ ఓదెల రైల్వే స్టేషన్ సినిమాతో మంచి పేరు సొంతం చేస్తోంది.ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కానీ గత ఏడాది మళ్లీ ఓదెలా 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె ఈషా అనే సినిమాలో చివరిగా నటించింది. ఇక ప్రస్తుతం మరికొన్ని తమిళ చిత్రాల షూటింగ్లలో బిజీగా ఉన్న ఈమె మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ గ్లామర్ వలకబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా చీరకట్టులో కనిపించి బ్యాక్ అందాలతో అభిమానులలో గిలిగింతలు పెట్టే ప్రయత్నం చేసింది.
హెబ్బా పటేల్ తాజాగా ధరించిన చీర విషయానికి వస్తే.. ముకైష్ వర్క్ చీరలో కనిపించింది.సాంప్రదాయమైన హస్తకళలతో డిజైన్ చేసిన ఈ పీచ్ కలర్ చీర అభిమానులను ఆకట్టుకుంటుంది. దీనికి సరిపోయే లోతైన వి నెక్ తో డిజైన్ చేసిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి మరింత హొయలు పోయింది. స్టెల్లా క్రియేషన్స్ వారి స్టేట్మెంట్ డ్రాప్ చెవిపోగులు ధరించిన ఈమె ఆరేలియాస్ జ్యువెలర్స్ వారి నుండి సున్నితమైన లోహపు బ్రాస్లెట్ ధరించి తన మేకోవర్ ను ఫుల్ ఫిల్ చేసుకుంది . ఇక మానస డిజైన్ చేసిన హెబ్బా పటేల్ లుక్ అభిమానులను విపరీతంగా అలరిస్తోందని చెప్పవచ్చు. హెబ్బా పటేల్ లేటెస్ట్ శారీ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.
