సోషల్ మీడియాలో సెగలు రేపుతున్న కుమారి
సినీ పరిశ్రమలో కేవలం అందం మాత్రమే ఉంటే సరిపోదు.. ప్రేక్షకులను ఆకట్టుకునే టెక్నిక్స్ .. నిరంతర శ్రమ కూడా అవసరమని నేటి తరం నటీమణులు నిరూపిస్తున్నారు
By: Sivaji Kontham | 1 April 2026 8:30 AM ISTసినీ పరిశ్రమలో కేవలం అందం మాత్రమే ఉంటే సరిపోదు.. ప్రేక్షకులను ఆకట్టుకునే టెక్నిక్స్ .. నిరంతర శ్రమ కూడా అవసరమని నేటి తరం నటీమణులు నిరూపిస్తున్నారు. ఈ కోవలోకే వస్తుంది టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ హెబ్బా పటేల్. `కుమారి 21F` చిత్రంతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ.. తొలి సినిమాతోనే తన నటనా ప్రతిభను చాటుకుంది. కేవలం గ్లామర్ డాల్‌గా మాత్రమే కాకుండా.. కథా బలమున్న పాత్రలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో దశాబ్ద కాలంగా తన ఉనికిని చాటుకోవడం విశేషం.
హెబ్బా పటేల్ కేవలం ప్రధాన కథానాయిక పాత్రలకే పరిమితం కాకుండా.. ప్రాధాన్యత ఉన్న సహాయ పాత్రలను కూడా పోషిస్తూ కెరీర్‌ను విజయవంతంగా ముందుకు నడిపిస్తోంది. చిత్ర పరిశ్రమలోకి ఎందరో అందగత్తెలు వస్తుంటారు.. వెళ్తుంటారు.. కానీ పోటీని తట్టుకుని నిలబడటం అందరికీ సాధ్యం కాదు. ఈ విషయంలో హెబ్బా పటేల్ ప్రయాణం నిజంగా ఆశ్చర్యకరం. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుని తెలుగు సినీరంగంలో పట్టు సాధించిన తీరు తనలోని పట్టుదలకు నిదర్శనం.
తాజాగా హెబ్బా పటేల్ తన బోల్డ్ ఫోటోషూట్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది. షర్ట్ బటన్స్ తీసేసి.. టాప్ లెస్ హాఫ్ షోల్డర్ లుక్‌లో ఆమె ఇచ్చిన పోజులు ప్రస్తుతం ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నాయి. తనలోని గ్లామర్ కోణాన్ని ఆవిష్కరిస్తూ హెబ్బా చేసిన ఈ ఫోటోషూట్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ అవుట్‌ఫిట్‌ను క్యారీ చేసిన విధానం తన కళ్ళలోని ఆత్మవిశ్వాసం స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. గ్లామర్ ప్రియులను ఆకట్టుకునేలా ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియా లలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
నటనతోనే కాకుండా డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్ , ప్రమోషన్స్‌తోనూ హెబ్బా బిజీగా గడుపుతోంది. ఇటీవలే హాంకాంగ్ టూరిజం ప్రమోషన్స్‌లో భాగంగా అక్కడి ఐలాండ్స్‌లో ఆమె విహరించిన వీడియోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అయిన `ఇషా` అనే వెబ్ సిరీస్‌లో నటించి డిజిటల్ ఆడియన్స్‌ను కూడా మెప్పించింది. ఇలా వైవిధ్యమైన ప్రమోషన్స్ , విభిన్నమైన ప్రాజెక్టులతో హెబ్బా నిరంతరం వార్తల్లో నిలుస్తోంది.
హెబ్బా పటేల్ షేర్ చేసిన ఈ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ లుక్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు హెబ్బా బోల్డ్ స్టైల్‌ను చూసి అవాక్కవుతుంటే.. మరికొందరు తన ధైర్యాన్ని.. ఫ్యాషన్ సెన్స్‌ను మెచ్చుకుంటున్నారు. తనదైన విలక్షణమైన డ్రెస్సింగ్ సెన్స్‌తో యువతకు కొత్త ఫ్యాషన్ గోల్స్ సెట్ చేస్తూ... హెబ్బా ఒక స్టైల్ ఐకాన్‌గా ఎదుగుతోంది. సినిమాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియా ద్వారా తన పాపులారిటీని ఎలా కాపాడుకోవాలో హెబ్బాకు బాగా తెలుసని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
