Begin typing your search above and press return to search.

'ధురంధ‌ర్' సాంగ్‌పై షాకింగ్ అప్ డేట్‌!

ఇండియ‌న్ సినిమాల్లో ఇంత వ‌ర‌కు చూడ‌ని, ట్రై కూడా చేయ‌ని స్థాయి మేకింగ్‌తో రా అండ్ ర‌స్టిక్ క్యారెక్ట‌ర్‌తో అత్యంత సాహ‌సోపేతంగా తెర‌కెక్కించిన `ధురంధ‌ర్‌` వ‌ర‌ల్డ్ బాక్సాఫీస్ వ‌ద్ద చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

By:  Ravindar Gorantla   |   16 March 2026 5:39 PM IST
ధురంధ‌ర్ సాంగ్‌పై షాకింగ్ అప్ డేట్‌!
X

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన చిత్రం `ధురంధ‌ర్‌`. ర‌ణ్‌వీర్ సింగ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ సినిమా గ్లోబ‌ల్ పాలిటిక్స్‌, దాని వెనుక ఇండియాపై పాక్ చేసిన దురాగతాల‌ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపిస్తూ ఆదిత్య‌ధ‌ర్ చేసిన ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని వ‌ర్గాల‌ని షాక్‌కు గురి చేసింది. ఇండియ‌న్ సినిమాల్లో ఇంత వ‌ర‌కు చూడ‌ని, ట్రై కూడా చేయ‌ని స్థాయి మేకింగ్‌తో రా అండ్ ర‌స్టిక్ క్యారెక్ట‌ర్‌తో అత్యంత సాహ‌సోపేతంగా తెర‌కెక్కించిన `ధురంధ‌ర్‌` వ‌ర‌ల్డ్ బాక్సాఫీస్ వ‌ద్ద చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

ఫ‌స్ట్ పార్టే భీభ‌త్సం సృష్టించింది అనుకుంటే సీక్వెల్‌గా వ‌స్తున్న `ధురంధ‌ర్ ది రివేంజ్‌` దానికి మించిన హింస‌, ఒళ్లు గ‌గుర్పోడిచే స‌న్నివేశాల‌తో రూపొంది అంద‌రిని షాక్‌కు గురి చేస్తోంది. ఇటీవ‌ల విడుద‌లై ఈ మూవీ టీజ‌ర్‌, ట్రైల‌ర్‌లు సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా సునామీని సృష్టించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే పెయిడ్ ప్రీమియ‌ర్స్‌, అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులు మోత మోగిస్తోంది. మార్చి 19న భారీ స్థాయిలో రిలీజ్ కానున్న సీక్వెల్ స‌రికొత్త చ‌రిత్ర సృష్టించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

ఈ నేప‌థ్యంలోనే `ధురంధ‌ర్` సాంగ్‌పై షాకింగ్ అప్ డేట్ ఒక‌టి బ‌య‌టికొచ్చి నెట్టింట ట్రెండ్ అవుతోంది. `ధురంధ‌ర్`లో సంజ‌య్‌ద‌త్ ఎంట్రీకి సంబంధించి `హ‌వా హ‌వా..` అంటూ సాగే ఓ సాంగ్ ని తీసుకున్నారు. ఇది 1986లో ఐకానిక్ సాంగ్‌గా విడుద‌లై యూత్‌ని ఊర్రూత‌లూగించింది. ఇప్ప‌టికీ ఎవ‌ర్ గ్రీన్ సాంగ్‌గా నిలిచి ఆక‌ట్టుకుంటోంది. అయితే ఈ పాట‌ని రాసింది పాకిస్థాన్‌కు చెందిన సింగ‌ర్ హ‌స‌న్ స‌హంగీర్ కంపోజ్ చేశాడు. 40 ఏళ్ల క్రితం కంపోజ్ చేసిన పాట ఇప్ప‌టికీ ట్రెండ్ అవుతుండ‌టం విశేషం.

అయితే ఈ పాట‌కు సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యాల్ని తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో బ‌య‌ట‌పెట్టాడు హ‌స‌న్ జ‌హంగీర్‌. `ధురంధ‌ర్‌` సినిమాలో మీ పాట‌ని వాడుకున్నారు కాదా? మ‌రి మీ నుంచి అనుమ‌తి తీసుకున్నారా? అని అడిగితే ఆస‌క్తిక‌ర స‌మాధానం చెప్పాడు. `ధురంధ‌ర్` టీమ్ త‌న‌ని సంప్ర‌దించి ప‌ర్మీష‌న్ తీసుకున్నార‌ని, అంతే కాకుండా రాయాల్టీ కింద రూ.46 ల‌క్ష‌లు ఇచ్చార‌ని చెప్పుకొచ్చాడు. అంత‌కు ముందు ఈ పాట‌ని బాలీవుడ్ మూవీస్ `బిల్లో బాద్ షా`, ఇన్‌సాఫ్ అప్నే లాహూసే వంటి సినిమాల్లో వాడారు. మ‌ళ్లీ ఇన్నేళ్ల త‌రువాత `ధురంధ‌ర్‌`లో ఉప‌యోగించుకోవ‌డంతో హ‌స‌న్ జహంగీర్‌కు కాసుల వ‌ర్షం కురిపించింది. 40 ఏళ్లు గ‌డుస్తున్నా ఇప్ప‌టికీ అత‌నికి రాయ‌ల్టీ ప‌రంగా ఈ పాట‌ డ‌బ్బుల వ‌ర్షం కురిపిస్తుండ‌టం గ‌మ‌నార్హం.