Begin typing your search above and press return to search.

'దేవుడు ఉన్నాడంటే నమ్ముతావా?'.. మిస్టరీ, సస్పెన్స్ తో అబ్బవరం

మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఓ పిల్లి చుట్టూ కథలో కొన్ని మిస్టరీ ఎలిమెంట్స్ ను అల్లినట్లు టీజర్‌ బట్టి తెలుస్తోంది.

By:  M Prashanth   |   19 Sept 2026 9:36 AM IST
దేవుడు ఉన్నాడంటే నమ్ముతావా?.. మిస్టరీ, సస్పెన్స్ తో అబ్బవరం
X

ఓ చీకటి గది.. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి.. అసలు దేవుడు ఉన్నాడా అనే ప్రశ్న.. దాని చుట్టూ అల్లుకున్న అంతులేని మిస్టరీ.. వీటితో ఇప్పుడు ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ పెంచుతోంది హతః టీజర్. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆ మిస్టరీ థ్రిల్లర్ టీజర్ రీసెంట్ గా రిలీజై సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. సినిమా స్టోరీపై ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తోంది.

'ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి.. ఏంటిదంతా?' అనే వాయిస్ ఓవర్‌ తో టీజర్ మొదలవుతుంది. ఆ వెంటనే సీనియర్ నటుడు రెహమాన్ సీరియస్ వాయిస్ తో 'దేవుడు ఉన్నాడంటే నమ్ముతావా?' అని అడగడం ఆసక్తిని పెంచుతోంది. అందుకు సమాధానంగా 'నేను నీకు పూర్తి నిజం చెప్పినా.. నన్ను ఒక పిచ్చివాడిలా చూస్తావ్' అనే డైలాగ్ వినిపిస్తుంది. ఆ రెండు డైలాగ్స్ సినిమాలో ఏదో అంతుచిక్కని రహస్యం ఉందనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి.

టీజర్‌ లో కనిపించే విజువల్స్ కూడా ఇదే తరహాలో ఉన్నాయి. చీకటి వాతావరణం, మంచుతో నిండిన అడవులు, నీటిలో తేలుతున్న మనుషులు, రక్తంతో కనిపించే కొన్ని రహస్య గుర్తులు.. వీటికి తోడు ఒక్కసారిగా దాడి చేసే వింత జీవి కనిపిస్తుంది. అసలు వీటన్నింటికీ సంబంధం ఏంటి? కథలో ఏం జరిగింది? అనే ప్రశ్నలను ప్రేక్షకుల ముందుంచేలా టీజర్‌ ను కట్ చేశారు.

మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఓ పిల్లి చుట్టూ కథలో కొన్ని మిస్టరీ ఎలిమెంట్స్ ను అల్లినట్లు టీజర్‌ బట్టి తెలుస్తోంది. అయితే ఆ పిల్లికి కథతో ఉన్న సంబంధం ఏంటనేది మాత్రం రివీల్ చేయలేదు. సైకలాజికల్ థ్రిల్లర్, హారర్, మిస్టరీ అంశాలను కలిపి దర్శకుడు అనుష్ గోరక్ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రతి సీన్ లో కూడా ఏదో తెలియని భయాన్ని, సస్పెన్స్ ని కంటిన్యూ చేసేలా టీజర్‌ ను కట్ చేశారు.

హతఃతో అనుష్ గోరక్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయన స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే బాధ్యతలు కూడా చూసుకున్నారు. రెహమాన్, కుష్లు మద్దాల, నమ్రిత ఎం.వి., తనూజ పుట్టస్వామి కీలక పాత్రల్లో నటించారు. బుల్లితెర, బిగ్‌బాస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న తనూజ సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. కిరణ్ అబ్బవరం తన సొంత బ్యానర్ కే ప్రొడక్షన్స్ ద్వారా కొత్త టాలెంట్‌ ను ఎంకరేజ్ చేస్తూ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

పౌర్ణమి ఎంటర్టైన్మెంట్స్‌ తో కలిసి ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వై. శివ శంకర్ నాయుడు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జెసిన్ జార్జ్ అందించిన బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ టీజర్‌ లోని సస్పెన్స్‌ ను మరింత పెంచింది. ఇప్పటివరకు కథకు సంబంధించిన కీలక విషయాలను బయట పెట్టకుండా కేవలం ప్రశ్నలు మాత్రమే ప్రేక్షకుల ముందుంచారు మేకర్స్. దీపావళి కానుకగా నవంబర్ 6న సినిమా థియేటర్లలోకి రానుందని వెల్లడించారు.