వారిద్దరి మధ్య రిలేషన్‌షిప్ కన్ఫర్మేషనే!?
బాలీవుడ్ నటులు హర్షవర్ధన్ రానే- సంజీదా షేక్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన వెకేషన్ ఫొటోలు ఇండస్ట్రీలో చర్చకు దారితీస్తున్నాయి.
By: Srikanth Kontham | 8 Aug 2026 12:04 PM ISTబాలీవుడ్ నటులు హర్షవర్ధన్ రానే- సంజీదా షేక్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన వెకేషన్ ఫొటోలు ఇండస్ట్రీలో చర్చకు దారితీస్తున్నాయి. ఇద్దరు వేర్వేరుగా తమ సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసినా? అందులోని లొకేషన్లు, వస్తువులు ఒకేలా ఉండటంతో నెటిజన్లు డేటింగ్‌లో ఉన్నారంటూ ఊహాగానాలకు మయరింత బలం చేకూరింది. ఈ ఆసక్తికర పరిణామం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
డేటింగ్ రూమర్స్ బలానికి ప్రధాన కారణం ఇద్దరు పోస్ట్ చేసిన చిత్రాలలో కనిపించిన కొన్ని పోలికలే. హర్షవర్ధన్ రానే తన హాలిడే ట్రిప్‌కు సంబంధించిన ఫొటోలను షేర్ చేయగా, సరిగ్గా అదే సమయంలో సంజీదా షేక్ కూడా అదే ప్రాంతం నుండి కొన్ని చిత్రాలను పంచుకున్నారు. హర్షవర్ధన్ రాసిన ఫొటోలో రెండు టీ కప్‌లు ఉండగా, సంజీదా పోస్ట్ చేసిన ఫొటోలో కూడా సరిగ్గా అదే రకమైన కప్ కనిపించడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
అంతేకాకాదు హర్షవర్ధన్ ఆమ్లెట్ తయారు చేస్తున్న దృశ్యాలు, ఆయన ఉపయోగించిన గ్యాస్ స్టవ్ , పాన్... సంజీదా ఫొటోలలో కనిపించిన వాటితో పూర్తిగా సరిపోలాయి. అలాగే వెనుక వైపు కనిపించే పచ్చని చెట్లు, చెక్క టేబుల్ ఉన్న ఒకే రకమైన బాల్కనీ దృశ్యాలు కూడా ఇద్దరూ ఒకే చోట, ఒకే ఎయిర్‌బిఎన్‌బీలో ఉన్నారనే అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి.
ఈ పోస్టులు చూసిన నెటిజన్లు, అభిమానులు సోషల్ మీడియాలో రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక కప్పు టీ ఖచ్చితంగా సంజీదా కోసమే అయి ఉంటుందని కొందరు కామెంట్లు చేయగా? మరికొందరు ఇద్దరూ కలిసి వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారని అర్థమవుతోందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అభిమానులు ఇద్దరినీ చూసి `సనమ్ తేరి కసమ్ 2` అంటూ సరదాగా కామెంట్లు చేయడం విశేషం.
ఇద్దరు టాలెంటెడ్ నటులు గతంలో `తైష్` (2020) చిత్రంలో కలిసి నటించారు. ఆ చిత్రంలో హర్షవర్ధన్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటించగా... ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ అప్పట్లో మంచి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం తాజా వెకేషన్ పోస్టులతో మరోసారి ఇద్దరి పేర్లు బాలీవుడ్ మీడియాలో మార్మోగుతున్నాయి. అయితే ఈ రూమర్స్‌పై ఇప్పటివరకు హర్షవర్ధన్ రానే గానీ, సంజీదా షేక్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
హర్షవర్ధన్ రానే తెలుగు చిత్రాలతో పాటు `సనమ్ తేరి కసమ్`చిత్రంతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సంజీదా షేక్ టెలివిజన్ రంగంలో స్టార్‌గా ఎదిగారు. అటుపై సినిమాలకు ప్రమోట్ అయ్యారు. `ఫైటర్`, `హీరామండి` వంటి భారీ ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వ్యక్తిగత జీవితంలో ఇద్దరూ తమదైన శైలిలో ముందుకు సాగుతున్న సమయంలోడేటింగ్ వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
