Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్‌లో సోఫాలు అమ్మి.. ముంబైలో 16 కోట్ల ఇల్లు కొన్న హీరో!

హైదరాబాద్‌లో సోఫాలు అమ్మిన స్థాయి నుంచి బాలీవుడ్ హీరోగా ఎదిగిన హర్షవర్ధన్ రాణే ఇప్పుడు ముంబైలో రూ.16 కోట్ల విలువైన విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. తెలుగులో వరుస ఫ్లాపుల తర్వాత ‘సనం తేరీ కసమ్’ రీ-రిలీజ్ విజయంతో ఆయనకు గుర్తింపు పెరిగింది. ప్రస్తుతం ‘ఫోర్స్ 3’, ‘పోలీస్ కంపెనీ’ చిత్రాల్లో నటిస్తున్నారు.

By:  Sivaji Kontham   |   13 Nov 2026 6:00 AM IST
హైద‌రాబాద్‌లో సోఫాలు అమ్మి.. ముంబైలో 16 కోట్ల ఇల్లు కొన్న హీరో!
X

హైద‌రాబాద్‌లో సోఫాలు అమ్మాడు.. క‌ట్ చేస్తే ఆడిష‌న్స్ కి వెళ్లి హీరో అయ్యాడు. భూమిక నిర్మించిన `త‌కిట త‌కిట‌`లో న‌టించాడు. మొద‌టి సినిమా డిజాస్ట‌ర్. నిర్మాత‌లు తీవ్ర అప్పుల్లో కూరుకుపోయార‌ని టాక్ వ‌చ్చింది. ఆ త‌ర్వాతా ఈ హీరోకి అన్నీ ఫ్లాపులే. చివ‌రికి తెలుగు ప‌రిశ్ర‌మ వ‌దిలేసి ముంబైకి వెళ్లాడు. బాలీవుడ్ లో షైన్ అయ్యాడు. అక్క‌డ నెమ్మ‌దిగా సోలో హీరోగా అవ‌కాశాలు అందుకున్నాడు. అయినా విజయాలు ద‌క్క‌లేదు. చివ‌రికి త‌న సినిమా మొద‌టి సినిమా ఫ్లాపై.. రెండో సినిమా రెండో రిలీజ్ తో బంప‌ర్ హిట్ కొట్టి ఆ త‌ర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌కు సంత‌కాలు చేసాడు. ఇప్పుడు ఏకంగా ముంబైలో రూ. 15-16 కోట్ల విలువైన విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారు.

ఇదంతా ఎవ‌రి గురించి? అంటే... యంగ్ హీరో హర్షవర్ధన్ రాణే గురించే. కెరీర్ ఆద్యంతం ఫ్లాపులు ఎదుర్కొని కూడా పోరాటం సాగించిన ఈ హీరోకి విజ‌య‌వాడ మూలాలు ఉన్నాయి. తాజా స‌మాచారం మేర‌కు.. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణే ముంబైలోని ఓ పోష్ ఏరియాలో సొంత ఇంటిని కొనుగోలు చేసేందుకు ఏకంగా లోట‌స్ బిల్డ‌ర్స్ వ‌ద్ద 16 కోట్లు పెట్టాడ‌నేది న‌మ్మ‌శ‌క్యం కాని వార్త‌. ఆస‌క్తిక‌రంగా అత‌డు గ‌తంలో ముంబైలోని మ‌ధ్ ఐల్యాండ్ లోని 2 ఫ్లాట్ల‌ను 12 కోట్ల‌కు కొనుగోలు చేసాడు. ఇప్పుడు మ‌రోసారి స్తిరాస్థిపై భారీ పెట్టుబ‌డి పెట్టాడు. హీరో అవ్వ‌డం వెయ్యి జ‌న్మ‌ల పుణ్య‌ఫ‌లం అని ఓ ప్ర‌ముఖ నిర్మాత ఎందుకు అన్నారో ఇప్పుడు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణే ప్ర‌యాణం చూస్తే అర్థ‌మ‌వుతుంది.

ఫ్లాపుల నుంచి విజ‌యాల వైపు మ‌ళ్ల‌డం, అక్క‌డ బాగా సంపాదించ‌డం.. సొంతంగా కోట్లాది రూపాయ‌ల పెట్టుబ‌డితో ఆస్తులు కొన‌డం అంటే ఆషామాషీ కాదు. దీని కోసం హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ తీవ్రంగా శ్ర‌మించాడు. హీరోగా నిల‌దొక్కుకునేందుకు చాలా ఎదుర్కొన్నాడు. ఇక యువ‌హీరోల్లో ప‌ర్ఫెక్ట్ ఫిట్నెస్ మెయింటెయిన్ చేయ‌డ‌మే కాకుండా.. న‌ట‌న‌లోను ప‌రిణ‌తి చెందాడు. ప‌ర్ఫెక్ట్ ఫిజిక్ తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాడు. అంతేకాదు.. ఇత‌ర హిందీ హీరోల్లానే క‌థానాయిక‌ల‌తో ఎఫైర్లు కూడా సాగించ‌డం అత‌డి ప్ర‌త్యేక‌త‌. ఖ‌డ్గం బ్యూటీ కిమ్ శ‌ర్మ‌తో కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన ఘ‌న‌త ఇత‌డిది.

అత‌డి బ్యాక్ గ్రౌండ్ ని ప‌రిశీలిస్తే.. ఒకప్పుడు హైదరాబాద్ సికింద‌రాబాద్ ఏరియాలో రోడ్ ప‌క్క‌న‌ ఒక ఫర్నిచర్ షోరూమ్‌లో సేల్స్‌మెన్‌గా సోఫాలు అమ్ముతూ జీవనం సాగించాడు.. అక్క‌డ పాత సోఫాల్ని రిపేర్లు చేసి అమ్మేవాడు.

కానీ నేడు ముంబైలో ఏకంగా రూ. 16 కోట్ల విలువైన విలాసవంతమైన ఇంటికి యజమాని అయ్యాడు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు. హర్షవర్ధన్ రాణే సాధారణ మధ్యతరగతి స్థాయి నుంచి.. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి నేడు స్టార్ హోదాను అందుకున్న ఈ ప్రయాణం ఎందరికో స్ఫూర్తి.

నటుడు కావాలనే బలమైన కోరికతో హైదరాబాద్‌లో చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తూనే ఆడిషన్స్ ఇచ్చిన హర్షవర్ధన్.. టాలీవుడ్ లో న‌టుడు అయినా కానీ.. ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు. వరుస ఫ్లాపులతో కెరీర్ సందిగ్ధంలో పడినా కానీ.. నిరాశ చెందకుండా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ముంబై బాట పట్టారు.

బాలీవుడ్‌లో అడుగుపెట్టిన తర్వాత హర్షవర్ధన్ రాణే దశ తిరిగింది. హిందీలో అత‌డు నటించిన రెండో సినిమా `సనం తేరీ కసమ్` రీ-రిలీజ్ బాక్సాఫీస్ వ‌ద్ద‌ బంపర్ హిట్‌గా నిలవడంతో రాత్రికి రాత్రే స్టార్ ఇమేజ్ సొంతమైంది. అక్కడి ప్రేక్షకులకు అత‌డి నటన, స్క్రీన్ ప్రెజెన్స్ విపరీతంగా నచ్చేయడంతో ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుసగా సినిమాలకు సంతకాలు చేస్తూ అత్యంత బిజీ హీరోగా మారిపోయారు. అందుకున్న పారితోషికాలు, అడ్వాన్సుల‌తో ఇప్పుడు విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. ప్ర‌స్తుతం జాన్ అబ్రహాం ఫోర్స్ 3లో అత‌డు విల‌న్ గా న‌టిస్తున్నాడు. ఆర్జీవీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ `పోలీస్ కంపెనీ` అనే చిత్రంలోను అత‌డు న‌టిస్తున్నాడు.