వరుసగా రెండోసారి హిట్టుతో హీరో జోష్
భారతదేశంలో రీరిలీజ్‌తో రికార్డులు బ్రేక్ చేసిన అరుదైన హీరోగా `హర్షవర్ధన్ రాణే` పేరు వినిపిస్తుంది.
By: Sivaji Kontham | 25 Oct 2025 2:00 AM ISTభారతదేశంలో రీరిలీజ్‌తో రికార్డులు బ్రేక్ చేసిన అరుదైన హీరోగా `హర్షవర్ధన్ రాణే` పేరు వినిపిస్తుంది. అతడు దశాబ్ధ కాలంగా సినీరంగంలో తనను తాను ఆవిష్కరించుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. కానీ అదృష్టం వరించలేదు. చివరికి అతడి హార్డ్ వర్క్ ఫలించింది. ఎంపిక చేసుకున్న కథలో తన పాత్రకు ప్రాణం పోయడానికి అతడు శ్రమించే విధానం అందరికీ నచ్చింది. అతడు నటించిన `సనమ్ తేరి కసమ్` రీరిలీజ్ లో సంచలన విజయం సాధించింది.
ఈ చిత్రంలో హర్షవర్ధన్ రాణే పాకిస్తానీ నటి మావ్రా హుకేన్ జంటగా నటించారు. ఇది ఒక వైవిధ్యమైన ఘాడత ఉన్న ప్రేమకథా చిత్రం. ఇప్పుడు హర్షవర్ధన్ రాణే - సోనమ్ బజ్వా జోడీ నటించిన `ఏక్ దేవానే కి దీవానియాత్` ఆశ్చర్యకరమైన విజయాన్ని అందుకుంది. ఇది మడాక్ నిర్మించిన `థామ`తో పోటీపడుతూ విడుదలైనా కానీ పెద్ద విజయం అందుకుంది. ఈ చిత్రం మొదటి రెండు రోజుల్లోనే 19కోట్లు వసూలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. `సనమ్ తేరి కసమ్` తర్వాత మరోసారి కంటెంట్ ఉన్న సినిమాగా `ఏక్ దేవానే కి దీవానియాత్` గుర్తింపు దక్కించుకుంది.
మొదటి రోజు 10 కోట్లు, రెండో రోజు 9 కోట్లు అందుకోవడం అంటే ఆషామాషీ కాదు. కానీ హర్షవర్ధన్ లాంటి చిన్న హీరోకి ఇది అతి పెద్ద బూస్ట్ అని చెప్పాలి. అతడిని ద్వితీయ తృతీయ శ్రేణి ప్రేక్షకులు వోన్ చేసుకుని చూస్తున్నారు. ఇది నిజంగా ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ లేని ఎందరో నటీనటులకు స్ఫూర్తి అని చెప్పాలి. హర్షవర్ధన్ నిజాయితీ, హార్డ్ వర్క్ కి ఇప్పుడు గొప్ప గుర్తింపు దక్కుతోంది. రెండు వరుస చిత్రాలతో అతడు తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు. మునుముందు మరిన్ని వైవిధ్యమైన ఎంపికలతో అతడు స్టార్ గా తనను తాను ఆవిష్కరించుకుంటాడేమో చూడాలి.
