Begin typing your search above and press return to search.

హర్షిత్ ‘దీవానా’ టీజర్ విడుదల.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్

తాజాగా విడుదలైన టీజర్, తన ప్రేమ కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధపడే ఒక మొండి ప్రేమికుడి కథను మనకు పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ విశేషాలు చూద్దాం ..

By:  Madhu Reddy   |   12 March 2026 12:04 PM IST
హర్షిత్ ‘దీవానా’ టీజర్ విడుదల.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్
X

టాలీవుడ్‌ యంగ్ హీరో హర్షిత్ రెడ్డి ఇంటెన్స్ లవ్ స్టోరీ తో మన ముందుకు రానున్నాడు. సమంత నటించిన ‘శుభమ్’ సినిమాతో వెండితెరకు పరిచయమైన హీరో ఇప్పుడు ‘దీవానా’ చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ఈ సినిమాను విడుదల చేస్తుండటంతో అంచనాలు భారిగా పెరిగిపోయాయి. తాజాగా విడుదలైన టీజర్, తన ప్రేమ కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధపడే ఒక మొండి ప్రేమికుడి కథను మనకు పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ విశేషాలు చూద్దాం ..




ఆకట్టుకుంటున్న టీజర్ సంభాషణలు:

‘దీవానా’ టీజర్ ప్రారంభమే చాలా ఆవేశపూరితమైన డైలాగులతో మొదలవుతుంది. "చస్తావా బే పిల్ల కోసం.. నువ్వేం చిల్లర్ గానివిరా" అని స్నేహితుడు నిలదీస్తుంటే, "నా దృష్టిలో ఇప్పుడు అది ఒక్కటేరా బ్యూటీ.. అందుకే నాకు అదే కావాలి" అని హీరో ఇచ్చే సమాధానం అతని గాఢమైన ప్రేమని, ఆ పాత్రలోని పిచ్చిని అద్భుతంగా ఆవిష్కరించింది. లోకంలో అందగత్తెలకు కొదవ లేకపోయినా, తను ప్రేమించిన అమ్మాయి కోసమే ఆరాటపడే యువకుడిగా హర్షిత్ రెడ్డి నటన ఆకట్టుకుంటోంది. స్నేహ మణిమేఘలై తన అందంతో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

ఆకట్టుకుంటున్న సంగీతం - గీతా ఆర్ట్స్ అండ:

ఈ చిత్రానికి ఈశ్వర్ చంద్ అందించిన సంగీతం ప్రాణం పోసింది. టీజర్‌లో వినిపించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేమలోని బాధను, ఆవేదనను కళ్లకు కట్టేలా ఉంది. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ విజువల్స్ పరంగా సినిమాకు రిచ్ లుక్ ఇచ్చింది. శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. ఇక ప్రతిష్టాత్మకమైన గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ఈ ప్రాజెక్ట్‌లోకి రావడంతో, ఈ ప్రేమకథ బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు రాబట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

వేసవి కానుకగా ‘దీవానా’ సందడి:

ఇక అర్హ మీడియా, వి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాను ఈ వేసవిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, తాజాగా వచ్చిన టీజర్ చూస్తుంటే, యువతకు కావాల్సిన ఎమోషన్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయనిపిస్తోంది. 'ప్రేమ కోసం ఏదైనా చేసేవాడు దీవానా' అనే కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ సినిమా, హర్షిత్ రెడ్డి కెరీర్‌కు ఎంతటి ఊపునిస్తుందో చూడాలి. బాక్సాఫీస్ వద్ద ఈ చిన్న సినిమా పెద్ద విజయాన్ని అందుకుంటుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇక ప్రేమ సినిమాలను ఇష్టపడే వారికి ‘దీవానా’ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. హర్షిత్ రెడ్డి మేకోవర్ మరియు ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ సినిమాకు మెయిన్ హైలైట్ కానున్నాయి. మరి ఈ సమ్మర్ లో హర్షిత్ తన ప్రేమతో ప్రేక్షకుల మనసులను ఎంతవరకు గెలుచుకుంటాడో వేచి చూడాల్సిందే.