హర్షిత్ రెడ్డి 'దీవాన'.. టీజర్ తో సూపర్ బజ్!
యంగ్ హీరో హర్షిత్ రెడ్డి లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ దీవాన ఇప్పుడు టాలీవుడ్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
By: M Prashanth | 15 March 2026 11:53 PM ISTయంగ్ హీరో హర్షిత్ రెడ్డి లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ దీవాన ఇప్పుడు టాలీవుడ్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల విడుదలైన ఆ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ప్రేమ కథా చిత్రాల్ని ఇష్టపడే యూత్ ను ముఖ్యంగా టార్గెట్ చేసిన ఆ టీజర్ ఫుల్ గా ట్రెండ్ అవుతోంది. సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. విజువల్స్, మ్యూజిక్, లవ్ ఎమోషన్స్ అన్నీ సూపర్ అని సినీ ప్రియులు కామెంట్స్ పెడుతున్నారు.
అయితే టీజర్ ద్వారా దీవాన మూవీ ఇంటెన్స్ లవ్ స్టోరీగా రూపొందుతోందని క్లియర్ గా తెలుస్తోంది. ప్రేమలో ఉండే ఎమోషన్స్, యూత్ జీవితాల్లో చోటు చేసుకునే సంఘటనలను కల్ట్ లవ్ స్టోరీ తరహాలో దర్శకుడు చూపించబోతున్నారని టీజర్ చెప్పకనే చెబుతోంది. ముఖ్యంగా టీజర్ లో కనిపించిన కొన్ని సన్నివేశాలు ఇటీవల యువతను ఆకట్టుకున్న ప్రేమకథా చిత్రాల తరహా వైబ్ ను గుర్తు చేస్తున్నాయని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.
దీవాన చిత్రంలో హర్షిత్ రెడ్డికి జోడీగా స్మేహ మణిమేగలై యాక్ట్ చేస్తుండగా.. టీజర్ లో ఆ జంట స్క్రీన్ పై చాలా ఫ్రెష్ గా కనిపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ న్యాచురల్ గా కనిపిస్తుండటం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. టీజర్ లో కనిపించిన బ్యూటిఫుల్ విజువల్స్ ప్రత్యేకంగా నిలిచాయి. లవ్ ఎమోషన్ క్లియర్ గా తెలిసేలా తీసిన షాట్స్ మెప్పిస్తున్నాయి.
టీజర్ లో వినిపించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ముఖ్యంగా వినిపించిన "ప్రేమ ఇది ప్రేమ" అనే పాట ఇన్స్టంట్ గా కనెక్ట్ అయినట్లు కనిపిస్తోంది. ప్రేమ కథా చిత్రాల్లో సంగీతం కీలక పాత్ర పోషిస్తుండగా, దీవానలో కూడా అదే జరగనుందని తెలుస్తోంది. ఇక సినిమా విడుదల టైమ్ కూడా చర్చనీయాంశమైంది. సాధారణంగా సమ్మర్ సీజన్ లో స్టూడెంట్స్, యువత థియేటర్లకు ఎక్కువగా వస్తారు. అదే సమయాన్ని టార్గెట్ గా చేసుకుని చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
ఇక దీవాన చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మాతలు వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఒక అందమైన ప్రేమకథను ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్ట్ ను రూపొందిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే టీజర్ తో మంచి బజ్ సంపాదించిన ఆ సినిమా విడుదలకు ముందు మరిన్ని ప్రమోషనల్ కంటెంట్ ను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఏదేమైనా దీవాన సినిమా.. మూవీ లవర్ ను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
