దీవాన బాక్సాఫీస్.. వీకెండ్ తర్వాత కూడా అలానే..
హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై నటించిన దీవాన సినిమా జూన్ 20న థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే.
By: M Prashanth | 29 Jun 2026 11:30 AM ISTహర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై నటించిన దీవాన సినిమా జూన్ 20న థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వంలో ఒక స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు రెండో వారంలోకి అడుగుపెట్టింది. సాధారణంగా ఎలాంటి పెద్ద స్టార్ కాస్ట్ లేని చిన్న సినిమాలకు తొలి వీకెండ్ తర్వాత థియేటర్ల దగ్గర సందడి పూర్తిగా తగ్గిపోతుంది. కానీ దీవాన విషయంలో అలా జరగకుండా బాక్సాఫీస్ దగ్గర చాలా స్టెడీగా రన్ అవుతుండటం హైలెట్.
కొత్త వాళ్లతో తీసిన లవ్ స్టోరీలకు పబ్లిక్ నుంచి వచ్చే మౌత్ టాక్ చాలా కీలకం అవుతుంది. ఈ సినిమాకు మొదటి రోజు నుంచే ఆడియన్స్ నుంచి పాజిటివ్ వైబ్ రావడంతో ఆ ఎఫెక్ట్ ఇప్పుడు థియేటర్ల దగ్గర క్లియర్ గా కనిపిస్తోంది. భారీ ఎత్తున ఓపెనింగ్స్ రాకపోయినా కంటెంట్ నచ్చడంతో జనాలు నెమ్మదిగా థియేటర్ల వైపు వస్తున్నారు. వీకెండ్ హాలిడేస్ పూర్తయిన తర్వాత కూడా సోమవారం లాంటి వర్కింగ్ డేస్ లో డీసెంట్ కలెక్షన్స్ వస్తుండటం మేకర్స్ కు పెద్ద రిలీఫ్ ఇస్తోంది.
ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ ఫామ్ బుక్ మై షో లో గమనిస్తే ఈ సినిమా బుకింగ్స్ పరిస్థితి చాలా పాజిటివ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. వీకెండ్ హడావుడి తగ్గిన తర్వాత కూడా చాలా ఏరియాల్లో టికెట్లు ఆశాజనకంగానే అమ్ముడవుతున్నాయి. గత 24 గంటల్లో బుకింగ్స్ లెక్క 6.82k రేంజ్ లో ఉండడం విశేషం. ఆడియన్స్ నుంచి వస్తున్న కంటిన్యూస్ రెస్పాన్స్ తో ఈ యాప్ లో సినిమా ట్రెండింగ్ లోనే కొనసాగుతోంది. దీన్ని బట్టి కేవలం యూత్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాను చూడటానికి బాగానే ఆసక్తి చూపిస్తున్నారని మనకు అర్థమవుతోంది.
ఒక యువకుడు తన ప్రేమ కోసం పడే ఆరాటం ఆ తర్వాత అనుకోకుండా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం లాంటి పాయింట్స్ నేటి జనరేషన్ కు బాగా కనెక్ట్ అయ్యాయి. దర్శకుడు ఎంచుకున్న కథలో ఉన్న రియాలిటీకి కాస్త కమర్షియల్ హంగులు కూడా తోడవడంతో సినిమా బోర్ కొట్టకుండా సాగుతుంది. ముఖ్యంగా సినిమా సెకండాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉండటం ఈ సినిమా స్టెడీ రన్ కు అసలైన కారణం అని చెప్పవచ్చు.
సినిమా రిలీజ్ తర్వాత నెగటివ్ ప్రచారంపై డైరెక్టర్ చేసిన ఎమోషనల్ కామెంట్స్ కూడా సినిమాకు ఒక రకంగా ప్లస్ అయ్యాయి. కంటెంట్ మీద పూర్తి నమ్మకంతో సినిమా తీశామని థ్యాంక్యూ మీట్ లో మూవీ టీమ్ పదే పదే చెప్పడంతో జనాల్లో కూడా ఈ సినిమా కచ్చితంగా చూడాలనే క్యూరియాసిటీ పెరిగింది. దీనికి తోడు సింగిల్ స్క్రీన్స్ తో పాటు మల్టీప్లెక్స్ లలో కూడా టికెట్ రేట్లు సామాన్యుడికి అందుబాటులో ఉండేలా నిర్మాతలు తీసుకున్న నిర్ణయం గ్రౌండ్ లెవెల్ లో బాగా వర్కౌట్ అయింది.
ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర చూసుకుంటే దీవాన పెట్టిన బడ్జెట్ కు తగ్గట్టుగా సేఫ్ జోన్ లోనే వెళ్తోందని చెప్పాలి. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా సైలెంట్ గా వచ్చిన ఈ చిన్న సినిమా వీకెండ్ తర్వాత కూడా థియేటర్లలో తన ఉనికిని చాటుకోవడం మామూలు విషయం కాదు. ఇదే పాజిటివ్ ట్రెండ్ రాబోయే వారాంతం వరకు కూడా కొనసాగితే ఈ చిత్ర నిర్మాతలకు ఫైనాన్షియల్ గా లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
