బూతులు తిట్టిన దురభిమానిని 'సర్' అని పిలిచిన హీరో
అయితే ఇటీవల `ఏక్ దీవానే కి దీవానీయత్` సినిమాను అహాన్ పాండే సైయ్యారా సినిమాతో పోల్చినందుకు ఒక అభిమాని రాణేను విమర్శించాడు. వినకూడని బూతు పదంతో సదరు దురభిమాని దూషించాడు.
By: Sivaji Kontham | 30 Oct 2025 8:30 AM IST`సనమ్ తేరి కసమ్` రీరిలీజ్ నటుడు హర్షవర్ధన్ రాణే కెరీర్ ని మలుపు తిప్పిన సంగతి తెలిసిందే. రెండో రిలీజ్ లో ఇప్పటివరకూ సంచలన విజయం సాధించిన చిత్రాలలోనే ఇది టాప్ వన్ పొజిషన్‌లో నిలిచింది. ఆ తర్వాత పంజాబీ బ్యూటి సోనమ్ బజ్వా తో కలిసి నటించిన `ఏక్ దీవానే కి దీవానీయత్` థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందనలు అందుకుంది. అయినా హర్షవర్ధన్ రాణే సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. మొదటి రెండు రోజుల్లోనే సుమారు 18 కోట్లు వసూలు చేసింది.
ఓవైపు సెల్ఫ్ మేడ్ స్టార్ ఆయుష్మాన్ ఖురానా- రష్మిక మందన్న నటించిన `థామ`తో పోటీపడుతూనే `ఏక్ దీవానే కి దీవానీయత్` చక్కని వసూళ్లను సాధించింది. ప్రమోషన్స్ అంతంత మాత్రంగానే ఉన్నా కానీ, హర్షవర్ధన్ రాణే సినిమా బాగానే ఆడుతోంది.
అయితే ఇటీవల `ఏక్ దీవానే కి దీవానీయత్` సినిమాను అహాన్ పాండే సైయ్యారా సినిమాతో పోల్చినందుకు ఒక అభిమాని రాణేను విమర్శించాడు. వినకూడని బూతు పదంతో సదరు దురభిమాని దూషించాడు. రెడ్డిట్‌లో వైరల్ అవుతున్న స్క్రీన్‌షాట్‌లలో ఆ అభిమాని ఇలా రాసాడు. ``ఈ చెత్త సినిమాను సైయారాతో పోల్చడం ఆపండి. ప్రేమకు ఒక ప్రమాణం ఉంది.. నీ సినిమా పూర్తిగా షిట్. థామ, దీవానియత్ లతో ఆహాన్ (పాండే) సినిమాని లింక్ చేయడం సరికాదు. సైయారాతో పోల్చడం మంచిది కాదు! అని రాసాడు.
హర్షవర్ధన్ బదులిస్తూ, ``క్షమించండి సార్, నేను మరింత కష్టపడి పనిచేస్తాను. సోనమ్ (బజ్వా), అహాన్, సైయారా బాగా నటించారు`` అని అన్నారు. తన సినిమాను ఆదరించినందుకు ప్రేక్షకులకు హర్షవర్ధన్ రాణే ధన్యవాదాలు తెలిపారు. గుజరాత్ లోని ఓ థియేటర్ వద్ద హర్షవర్ధన్ మాట్లాడుతూ-ఈ దీపావళికి ఇద్దరు బయటి వ్యక్తుల సినిమాలకు మద్దతు ఇచ్చారు. ఆయుష్మాన్ ఖురానా సినిమా నా మూవీతో పాటు విడుదలైంది. దయచేసి రెండు సినిమాలు చూడండి.. రెండింటినీ ఆస్వాధించండి. మీరు మాత్రమే మొత్తం బాలీవుడ్ నుండి నెపోటిజాన్ని తరిమేయగలరు`` అని అన్నాడు.
