Begin typing your search above and press return to search.

హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్ మ‌ళ్లీ మ్యాజిక్ చేస్తున్నారా?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న భారీ యాక్ష‌న్ డ్రామా `స్పిరిట్‌`. సందీప్‌రెడ్డ వంగ డైరెక్ట్ చేస్తున్నారు.

By:  Ravindar Gorantla   |   6 April 2026 2:00 PM IST
హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్ మ‌ళ్లీ మ్యాజిక్ చేస్తున్నారా?
X

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న భారీ యాక్ష‌న్ డ్రామా `స్పిరిట్‌`. సందీప్‌రెడ్డ వంగ డైరెక్ట్ చేస్తున్నారు. భ‌ద్ర‌కాళి పిక్చ‌ర్స్ ప్ర‌ణ‌య్‌వంగతో క‌లిసి టి సిరీస్ అధినేత‌లు భూష‌ణ్ కుమార్, క్రిష‌న్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్రిప్తి దిమ్రి క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా కీల‌క పాత్ర‌ల్లో కాంచ‌న‌, ప్ర‌`కాష్‌రాజ్‌, వివేక్ ఓబెరాయ్ న‌టిస్తున్నారు. `యానిమ‌ల్‌` వంటి సంచ‌ల‌న బ్లాక్ బ‌స్ట‌ర్ త‌రువాత సందీప్‌రెడ్డి వంగ నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డం, అందులోనూ ప్ర‌భాస్ న‌టిస్తున్న మూవీ కావ‌డంతో దీనిపై స‌మ‌జంగానే అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ఇందులో ప్ర‌భాస్ తొలి సారి ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీర్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్నారు. ప్ర‌కాష్ రాజ్‌, ప్ర‌భాస్ వాయిస్‌తో విడుద‌ల చేసిన డైలాగ్ గ్లింప్స్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. సందీప్ రెడ్డి వంగ గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా స‌రికొత్త పంథాలో ఈ సినిమా ఉంటుంద‌నే సంకేతాల్ని అందిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు కూడా సందీప్ రెడ్డి వంగ ఆస్థాన విధ్వాంసుడు హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్ సంగీతం అందిస్తున్నారు. `అర్జున్‌రెడ్డి` నుంచి వీరి ప్ర‌యాణం స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్న‌వుతోంది.

ఈ సినిమాతో మ‌రోసారి ఈ జోడీ మ్యూజిక్‌తో మ్యాజిక్ చేయ‌బోతున్నార‌ని తెలుస్తోంది. ఈ సినిమాకు అనంత‌శ్రీ‌రామ్ పాట‌లు రాస్తున్నారు. `యానిమ‌ల్`కు తెలుగులో సాంగ్స్ రాసింది అనంత‌శ్రీ‌రామ్‌. త‌ను రాశాడు కాబ‌ట్టే ఏ పాట కూడా డ‌బ్బింగ్ సాంగ్ అనే ఫీల్ ఎక్క‌డా క‌ల‌గ‌లేదు. ప్ర‌తి పాట స్ట్రెయిట్ సాంగ్‌ని త‌ల‌పించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. పాటలు ప్ర‌ధానంగా ప్ల‌స్ అయ్యాయి.

ఈ మూవీ విష‌యంలోనూ హ‌ర్ష‌వ‌ర్థ‌న్ అందిస్తున్న సాంగ్స్‌, నేప‌థ్య సంగీతం ప్ర‌త్యేకంగా ఉంటుంద‌ని తెలుస్తోంది. అంతే కాకుండా ఈ మూవీ కోసం సందీప్‌, హ‌ర్ష‌వ‌ర్థ‌న్ క్లాస్ ట‌చ్‌తో ప్ర‌యోగం చేయ‌బోతున్నార‌ట‌. ఇప్ప‌టికే పాట‌ల రికార్డింగ్ మొద‌లైంద‌ని, ఆడియో మ‌రో లెవెల్లో ఉంటుంద‌ని, ఆడియో ఆల్బ‌మ్ క్లాస్ ఫీల్‌ని క‌లిగిస్తుంద‌ని రైట‌ర్ ఆనంత్ శ్రీ‌రామ్ చెబుతున్నారు. అర్జున్‌రెడ్డి, యానిమ‌ల్‌లో యాక్ష‌న్‌తో పాటు సున్నిత‌మైన మ‌న‌సుకు హ‌త్తుకునే భావోద్వేగాల‌ని ప‌తాక స్థాయిలో ఆవిష్క‌రించిన సందీప్‌రెడ్డి వంగ `స్పిరిట్‌` విష‌యంలోనూ అదే ఫార్ములాని వాడేస్తూ ఈ మూవీ చేస్తున్నాడ‌ట‌.

అయితే `అర్జున్‌రెడ్డి`, యానిమ‌ల్‌` మూవీస్‌కి ప్రాణంగా నిలిచిన‌ట్టుగా హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్ మ్యూజిక్ ఉంటుంద‌ని ఇన్ సైడ్ టాక్‌. హైవోల్టేజ్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ ప్ర‌భాస్ గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా ఉంటుంద‌ని, ప‌వర్‌ఫుల్ క్యారెక్ట‌ర్‌లో ప్ర‌భాస్ నెవ‌ర్ బిఫోర్ అవ‌తార్‌లో స‌రికొత్త‌గా క‌నిపిస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అంటే హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్ త‌న‌దైన మార్కు మ్యూజిక్‌తో క్లాస్ ట‌చ్‌తో హార్డ్ కోర్ వ‌యెలెన్స్‌తో మ్యా.ఇక్ చేయ‌బోతున్నార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంద ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.