Begin typing your search above and press return to search.

హిట్ కాంబో బ్యాండ్ మేళం వాయిస్తున్నారు..!

ఒక సినిమా హిట్ పడితే ఆ కాంబోకి ఎంత క్రేజ్ వస్తుందో అందరికీ తెలిసిందే. అది స్టార్స్ మాత్రమే కానక్కర్లేదు. యంగ్ పెయిర్ కి కూడా అదే రేంజ్ క్రేజ్ ఉంటుంది

By:  Ramesh Boddu   |   17 Sept 2025 12:07 PM IST
హిట్ కాంబో బ్యాండ్ మేళం వాయిస్తున్నారు..!
X

ఒక సినిమా హిట్ పడితే ఆ కాంబోకి ఎంత క్రేజ్ వస్తుందో అందరికీ తెలిసిందే. అది స్టార్స్ మాత్రమే కానక్కర్లేదు. యంగ్ పెయిర్ కి కూడా అదే రేంజ్ క్రేజ్ ఉంటుంది. రీసెంట్ గా కోర్ట్ సినిమాతో సూపర్ హిట్ జోడీగా పాపులర్ అయ్యారు. హర్ష్ రోషన్, శ్రీదేవి. నాని నిర్మాతగా రామ్ జగదీష్ డైరెక్షన్ లో తెరకెక్కిన కోర్ట్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో హర్ష్, శ్రీదేవి జోడీ కూడా అదిరిపోయింది. కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారంటూ ఇద్దరి ప్రేమకథకు ఆడియన్స్ ఆమోదం తెలిపారు.

బ్యాండ్ మేళం ఫస్ట్ గ్లింప్స్..

కోర్ట్ సినిమా కథ వేరు కానీ అందులో ఈ యువ జంట తమకు స్కోప్ ఉన్నంత వరకు ఇంప్రెస్ చేసింది. ఆ సినిమా ఎలాగు హిట్ అయ్యింది కాబట్టి అదే హిట్ పెయిర్ తో మరో సినిమా చేస్తున్నారు. కోనా ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ లో మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో బ్యాండ్ మేళం సినిమా వస్తుంది. ఈ సినిమాను కావ్య, శ్రీవ్య నిర్మిస్తున్నారు. సినిమాను సతీష్ జువ్వాజీ డైరెక్ట్ చేస్తున్నారు. బ్యాండ్ మేళం సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. కోర్ట్ సినిమాలో ఇద్దరి పాత్రలకు భిన్నంగా ఇద్దరు బ్యాండ్ మేళంలో యువ ప్రేమికులుగా కనిపిస్తున్నారు.

ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఇంప్రెస్ చేసింది. సినిమాకు విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అందిస్తున్నారు. కోర్ట్ సినిమాకు ఈ జంటకు ఆయనే అదిరిపోయే సాంగ్ ఇచ్చాడు. ఇప్పుడు అతనే మళ్లీ ఈ బ్యాండ్ మేళం సినిమాకు పనిచేస్తున్నారు. కోనా వెంకట్ ప్రొడక్షన్ నుంచి కొద్దిపాటి గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా ఇది.

బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా..

సూపర్ హిట్ జోడీ కాబట్టి స్టోరీ, స్క్రీన్ ప్లే ఏమాత్రం ఆసక్తికరంగా ఉన్నా కూడా సినిమా సక్సెస్ అవుతుంది. ఈమధ్య యువ నటులు తమ సత్తా చాటుతున్నారు. క్యూట్ లవ్ స్టోరీస్ తో వాళ్లు చేస్తున్న హంగామా ఒక రేంజ్ లో ఉంది. కోర్ట్ తో హర్ష్ రోషన్, శ్రీదేవి జోడీ సూపర్ పాపులర్ కాగా ఆ జంట కలిసి చేస్తున్న బ్యాండ్ మేళం కూడా సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుంది. బ్యాండ్ మేళం సినిమా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా రాబోతుంది. రిలీజ్ చేసిన గ్లింప్స్ లో హీరో, హీరోయిన్ ఇద్దరు తెలంగాణా యాసలో మాట్లాడుతున్నారు. సో ఈ సినిమా తెలంగాణా విలేజ్ బ్యాక్ డ్రాప్ కథగా వస్తుందని చెప్పొచ్చు.

ఏ సినిమాకైనా ఫస్ట్ ఇంప్రెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. హర్ష్, శ్రీదేవి సూపర్ జోడీని రిపీట్ చేస్తూ బ్యాండ్ మేళం టీం రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ యూత్ ఆడియన్స్ ని అలరిస్తుంది. కోర్ట్ సినిమా చూసిన ఆడియన్స్ అంతా ఈ జోడీ కలిసి నటించడం చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు.