ఘనంగా కోర్ట్ మూవీ హీరో కొత్త మూవీ పూజా కార్యక్రమం.. శ్రీదేవిని పక్కన పెట్టేసారా?
రోషన్ కొత్త సినిమా విషయానికి వస్తే.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఐకానిక్ నిర్మాణ సంస్థలలో ఒకటిగా నిలిచిన ఈవీవీ సినిమా ప్రతిష్టాత్మకంగా తన ప్రొడక్షన్ లో పదవ చిత్రాన్ని ప్రకటించేసింది.
By: Madhu Reddy | 4 July 2026 12:35 PM ISTరామ్ జగదీష్ రచన దర్శకత్వంలో.. ప్రముఖ హీరో నాని నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ రూపొందించిన కోర్టు డ్రామా మూవీ కోర్ట్.. ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను చందు పాత్రలో ఆకట్టుకున్న హర్ష రోషన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకొని.. మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోల చేత ప్రశంసలు పొందిన ఈ కుర్ర హీరో వరుసగా అవకాశాలు అందుకుంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నారు. ఇకపోతే ఇదే సినిమాలో రోషన్ పక్కన జాబిలీ పాత్రతో అందరి దృష్టిని ఆకర్షించింది శ్రీదేవి.
శ్రీదేవిని పక్కన పెట్టేసిన హర్ష్ రోషన్..
అలా ఈ ఒక్క సినిమాతో సెలబ్రిటీ జంటగా మారిపోయారు. ఇక ఈ సినిమా ఇచ్చిన విజయంతో మళ్ళీ బ్యాండ్ మేళం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ కోర్టు సినిమా ఇచ్చినంత గుర్తింపు ఈ సినిమా అందివ్వలేకపోయింది. ఇకపోతే ఈ సినిమా తర్వాత మళ్లీ వీరు జంటగా నటిస్తారా అనే కామెంట్లు వ్యక్తం అవ్వగా.. లేదనే చెప్పాలి. తాజాగా హర్ష్ రోషన్ శ్రీదేవిని పక్కన పెట్టేసి తన కొత్త మూవీని ప్రకటించేశారు. ఈ మూవీ పూజా కార్యక్రమాలను కూడా ఘనంగా నిర్వహించారు.. ఈ మేరకు ఈ పూజ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవ్వగా.. ఇది చూసిన నెటిజన్స్ రోషన్ శ్రీదేవిని పక్కన పెట్టేశారా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈవీవీ నిర్మాణంలో రోషన్ కొత్త మూవీ..
రోషన్ కొత్త సినిమా విషయానికి వస్తే.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఐకానిక్ నిర్మాణ సంస్థలలో ఒకటిగా నిలిచిన ఈవీవీ సినిమా ప్రతిష్టాత్మకంగా తన ప్రొడక్షన్ లో పదవ చిత్రాన్ని ప్రకటించేసింది. దివంగత లెజెండ్రీ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ స్థాపించిన ఈ బ్యానర్ పై గతంలో మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది, చాలా బాగుంది, తొట్టి గ్యాంగ్, అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ, నువ్వంటే నాకిష్టం, కితకితలు, ఫిట్టింగ్ మాస్టర్ ఇలా పలు వినోదాత్మక చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. ఇక ఇప్పుడు ఈ లెజెండ్రీ బ్యానర్ పై ఈవివి సత్యనారాయణ తనయుడు ఆర్యన్ రాజేష్ మరో నిర్మాత ఎన్వీ కృష్ణారెడ్డితో కలిసి ఒక సినిమా నిర్మించబోతున్నారు.
నిజ జీవిత కథ ఆధారంగా ఇంటెన్స్ లవ్ డ్రామా..
గుండెల్ని పిండేసే ఒక నిజ జీవిత కథ ఆధారంగా ఇంటెన్స్ లవ్ డ్రామాగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో హర్ష్ రోషన్ హీరోగా.. ప్రియాంక ఆచర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి అరుణ్ బాలాజీ, శ్రీరంజని సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. నిజ జీవిత భావోద్వేగాలు, సంబంధాల నేపథ్యంలో రాబోతున్న ఈ ప్రేమ కథ తాజాగా శుభ ముహూర్తంలో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాను ఎన్విఆర్ ఎంటర్టైన్మెంట్ తొలి నిర్మాణంలో ఈవీవీ సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం వాస్తవికత, తీవ్ర భావోద్వేగాలు, బలమైన కథతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఈ చిత్రానికి మడూరి మధు పిఆర్ఓగా పనిచేస్తుండగా.. విష్ణు తేజ పుట్ట మార్కెటింగ్ చేస్తున్నారు. వినీల్ నల్లమల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా, జిజు సన్నీ డిఓపిగా పనిచేస్తున్నారు.
