Begin typing your search above and press return to search.

ఆయ‌న వ‌ల్ల నా లైఫ్ లో బిజీగా ఉన్నా

త‌న లైఫ్ కూడా అలా ఒక్క ఛాన్స్ తోనే మొత్తం మారిపోయింద‌ని చెప్తున్నారు న‌టి హ‌రితేజ‌. తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు హ‌రితేజ ఎవ‌రో కొత్త‌గా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేదు.

By:  Sravani Lakshmi Srungarapu   |   19 Oct 2025 10:00 PM IST
ఆయ‌న వ‌ల్ల నా లైఫ్ లో బిజీగా ఉన్నా
X

లైఫ్ లో ఎప్పుడేం జ‌రుగుతుందో ఎవ‌రూ చెప్ప‌లేం. అందుకే లైఫ్ ఈజ్ అన్‌ప్రెడిక్ట‌బుల్ అంటుంటారు. సినీ ఇండ‌స్ట్రీలో ఆ ప్రిడిక్ష‌న్ ఇంకా దారుణంగా ఉంటుంది. ఎవ‌రెప్పుడు ఎలా మారిపోతారో ఎవ‌రూ చెప్పలేం. ఒక్క ఛాన్స్ కొంద‌రి లైఫ్ ను వెన‌క్కి తిరిగి చూసుకునే ప‌న్లేకుండా మార్చేస్తే, అదే ఛాన్స్ మ‌రికొంద‌రి లైఫ్ ను త‌లకిందులు చేస్తుంది.

సీరియ‌ల్స్ నుంచి సినిమాల వ‌ర‌కు..

త‌న లైఫ్ కూడా అలా ఒక్క ఛాన్స్ తోనే మొత్తం మారిపోయింద‌ని చెప్తున్నారు న‌టి హ‌రితేజ‌. తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు హ‌రితేజ ఎవ‌రో కొత్త‌గా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేదు. ప‌లు సీరియ‌ల్స్, టీవీ షోల్లో న‌టించిన హ‌రి తేజ, బిగ్ బాస్ రియాలిటీ షో తో ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువ‌య్యారు. బిగ్ బాస్1 ద్వారా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుని పాపుల‌ర‌య్యారు హ‌రితేజ‌.

అ..ఆలో ప‌నిమ‌నిషి పాత్ర‌లో..

సీరియ‌ల్స్ తో పాటూ వంట‌ల షో కు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించిన హ‌రి తేజ ఇప్పుడు ఎక్కువ‌గా సినిమాల‌పైనే ఫోక‌స్ చేశారు. ప్ర‌స్తుతం క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ప‌లు సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్న హ‌రి తేజకు వ‌రుస అవ‌కాశాలు రావ‌డానికి కార‌ణం డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మేన‌ని ఆమె చెప్తున్నారు. అ..ఆ సినిమాలో త్రివిక్ర‌మ్ ప‌ని మ‌నిషి క్యారెక్ట‌ర్ ఇవ్వ‌డం వ‌ల్ల త‌న లైఫ్ మొత్తం మారిపోయింద‌ని హ‌రితేజ తెలిపారు.

వార‌మైనా ఫోన్ రాలేదు

త్రివిక్ర‌మ్ ప‌ని మ‌నిషి క్యారెక్ట‌ర్ కోసం వెతుకుతున్న టైమ్ లో ఓ రోజు టీవీ చూస్తున్న‌ప్పుడు వంట‌ల షోలో త‌న‌ను చూసి, ఆ జోక్స్, కామెడీ విని ఈ అమ్మాయిని తీసుకుర‌మ్మ‌ని త‌న టీమ్ కు చెప్పార‌ని, త‌న‌కు ఫోన్ చేసి త్రివిక్ర‌మ్ సినిమా అని చెప్ప‌గానే షాక‌య్యాన‌ని హ‌రితేజ చెప్పారు. కానీ ఆ క్యారెక్ట‌ర్ కోసం ఆడిష‌న్ ఇచ్చాక త‌న‌కు ఏమీ చెప్ప‌లేద‌ని, వారం రోజుల‌య్యాక ఇక ఆఫ‌ర్ పోయిన‌ట్టేలే అనుకుంటున్న టైమ్ లో ఫోన్ చేసి డేట్స్ కావాల‌ని అడిగార‌ని, క‌నీసం క‌థేంటో కూడా అడ‌క్కుండానే తాను ఆ సినిమాకు ఒప్పుకున్న‌ట్టు హ‌రితేజ చెప్పారు. అ..ఆ మూవీ చేసేట‌ప్పుడే ఈ సినిమా త‌ర్వాత త‌న లైఫ్ మారిపోతుంద‌ని చెప్పారని ఆమె పేర్కొన్నారు.