హరీష్ పై పెద్ద భారమే!
ఇండస్ట్రీలో ఏదైనా డైరెక్టర్ కు ఫ్లాప్ పడితే దాని తాలూకా ఎఫెక్ట్ చాలా కాలం అలానే ఉండిపోతుంది.
By: Sravani Lakshmi Srungarapu | 5 Sept 2025 10:56 AM ISTఇండస్ట్రీలో ఏదైనా డైరెక్టర్ కు ఫ్లాప్ పడితే దాని తాలూకా ఎఫెక్ట్ చాలా కాలం అలానే ఉండిపోతుంది. ఆ ఫ్లాపు వల్ల మరో ఛాన్స్ ఇవ్వడానికి నిర్మాతలు చాలా ఆలోచిస్తారు. ఒకవేళ ఛాన్స్ వచ్చినా ఆ సినిమాకు ఒకప్పుడున్నంత మార్కెట్ ఉండదు. వీటన్నింటినీ మించి నెక్ట్స్ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలనే ప్రెజర్ కూడా సదరు డైరెక్టర్ పై ఉంటుంది.
మిస్టర్ బచ్చన్‌తో డిజాస్టర్
ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ ను చేస్తున్న హరీష్, మధ్యలో పవన్ అందుబాటులో లేకపోవడంతో రవితేజతో కలిసి మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేసి డిజాస్టర్ ను ఖాతాలో వేసుకున్నారు. ఆడియన్స్ ఆ డిజాస్టర్ ను మర్చిపోవాలంటే ఉస్తాద్ భగత్‌సింగ్ తో సాలిడ్ హిట్ కొట్టాలి హరీష్.
ఉస్తాద్ భగత్‌సింగ్ కథలో భారీ మార్పులు
అసలే ఓజి లాంటి ఎంతో హైప్ ఉన్న భారీ ప్రాజెక్టు తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఆ హైప్ ను మ్యాచ్ చేయాలంటే హరీష్ చాలానే చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ సినిమా కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా డైరెక్టర్ మార్పులు చేసుకున్నారని తెలుస్తోంది. గతంలో పవన్ తో చేసిన గబ్బర్ సింగ్ ను మించిన విజయాన్ని పవన్ కు ఇవ్వాలని హరీష్ ప్లాన్ చేశారట.
అందులో భాగంగానే పవన్ ఇచ్చిన డేట్స్ ను వేస్ట్ చేయకుండా చాలా పకడ్బందీగా వాడుకుంటూ షూటింగ్ ను పరుగులెట్టిస్తున్నారు హరీష్. వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి తర్వాత ప్రమోషన్స్ కోసం స్పెషల్ ప్లాన్స్ చేస్తున్నారట. రీసెంట్ గా ఓ సాంగ్ ను పూర్తి చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు మరో సాంగ్ కోసం రంగాన్ని సిద్ధం చేస్తుందట. దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో శనివారం నుంచి ఈ సాంగ్ షూట్ జరగనుందని సమాచారం.
ఈ సాంగ్ లో పవన్ స్టార్ క్రేజీ స్టెప్పులేయనున్నారని, దేవీ శ్రీ ఈ సాంగ్ ను తన స్టైల్ బీట్స్ తో అదిరిపోయేలా కంపోజ్ చేశారని అంటున్నారు. ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా మొదలుపెట్టినప్పుడు ఇది తమిళ బ్లాక్ బస్టర్ తేరికి రీమేక్ అన్నారు కానీ ఇప్పుడిది రీమేక్ కాదని, ఒరిజినల్ స్టోరీ అని చెప్తున్నారు. ఏదేమైనా ఉస్తాద్ భగత్‌సింగ్ రూపంలో హరీష్ మీద చాలా పెద్ద భారమే ఉంది. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా నెక్ట్స్ ఇయర్ ఫస్టాఫ్ లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
