Begin typing your search above and press return to search.

పవన్ నుంచి మరో హుక్ స్టెప్.. ఈసారి మరింత హైప్ పక్కా?

ఇదిలా ఉండగా.. దర్శకుడు హరీష్ శంకర్ తాజాగా మరో ఆసక్తికర విషయం వెల్లడించారు. సినిమాలో ఇంకో పాటను స్పెషల్ గా డిజైన్ చేస్తున్నామని ఆయన చెప్పారు.

By:  M Prashanth   |   22 Jan 2026 10:29 PM IST
పవన్ నుంచి మరో హుక్ స్టెప్.. ఈసారి మరింత హైప్ పక్కా?
X

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మరికొన్ని రోజుల్లో విడుదలవ్వనున్న విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అవ్వగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో అవి కూడా పూర్తి కానుండగా.. ఏప్రిల్ లో సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుందని వినికిడి.

అయితే రీసెంట్ గా సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన దేఖ్లేంగే సాలా సాంగ్ ఓ రేంజ్ లో అలరించింది. ఇప్పటికీ ఆ సాంగ్ ట్రెండింగ్ లోనే ఉండడం విశేషం. ముఖ్యంగా పాటలో పపన్ స్వాగ్ అందరినీ ఫిదా చేసింది. స్టైలిష్ స్టెప్పులు, ఎనర్జీతో కూడిన డాన్స్ అభిమానులను, సినీ ప్రియులను తెగ ఆకట్టుకుంది. సిల్వర్ స్క్రీన్ పై సాంగ్ అదిరిపోయేలా ఉంటుందని ఇప్పుడు అందరికీ క్లారిటీ వచ్చేసింది.

ఇదిలా ఉండగా.. దర్శకుడు హరీష్ శంకర్ తాజాగా మరో ఆసక్తికర విషయం వెల్లడించారు. సినిమాలో ఇంకో పాటను స్పెషల్ గా డిజైన్ చేస్తున్నామని ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్ కోసం మరో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నామని, ఆ పాటకు ప్రత్యేక హుక్ స్టెప్ ఉండే అవకాశముందని హరీష్ శంకర్ పరోక్షంగా పేర్కొన్నారు. ఆ హుక్ స్టెప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా రూపొందించాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

సాధారణంగా పవన్ కళ్యాణ్ డాన్స్ నంబర్లు వస్తే అభిమానుల్లో ఫుల్ జోష్ కనిపిస్తుంది. గబ్బర్ సింగ్ లోని స్టెప్పులు, అత్తారింటికి దారేదిలోని పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. అలాంటి హిట్ హుక్ స్టెప్పులు మళ్లీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో చూడవచ్చనే ఆశ అభిమానుల్లో పెరిగింది. ముఖ్యంగా దేఖ్లేంగే సాలా పాట ఇప్పటికే సినిమాపై ఫుల్ హైప్ క్రియేట్ చేసింది.

ఇప్పుడు మరో పాట కూడా హుక్ స్టెప్‌ తో వస్తే.. సినిమా ప్రమోషన్‌ మరింత పెద్ద ప్లస్ అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తోంది. పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల హీరోయిన్‌ గా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

పవన్ మాస్ అవతార్‌ లో కనిపించబోతున్నారనే విషయం అభిమానుల్లో మరింత ఆసక్తిని రేపుతోంది. ఇక హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌ కు స్పెషల్ క్రేజ్ ఉందని తెలిసిందే. గతంలో గబ్బర్ సింగ్ తో బ్లాక్‌ బస్టర్ అందుకున్న వారిద్దరూ, మళ్లీ అలాంటి మ్యాజిక్ రిపీట్ చేస్తారా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఆ కొత్త హుక్ స్టెప్ సాంగ్.. సినిమాకు ఎంతటి హైప్ తీసుకొస్తుందో వేచి చూడాలి.