Begin typing your search above and press return to search.

హ‌రీష్ శంక‌ర్ త్యాగానికి గౌర‌వం ద‌క్కేనా?

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ల‌లో హ‌రీష్ శంక‌ర్ శైలి ప్ర‌త్యేకం. డైలాగ్స్ కానీ టైమిగ్ కానీ చాలా ప్ర‌త్యేకంగా కొత్త‌గా ఉంటుంది.

By:  Ravindar Gorantla   |   18 March 2026 1:57 PM IST
హ‌రీష్ శంక‌ర్ త్యాగానికి గౌర‌వం ద‌క్కేనా?
X

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ల‌లో హ‌రీష్ శంక‌ర్ శైలి ప్ర‌త్యేకం. డైలాగ్స్ కానీ టైమిగ్ కానీ చాలా ప్ర‌త్యేకంగా కొత్త‌గా ఉంటుంది. ఫ్యాన్స్ క‌యితే హ‌రీష్ శంక‌ర్ డైలాగ్స్, స్టార్ హీరోల‌కు ఇచ్చే ఎలివేష‌న్స్ పూన‌కాలు తెప్పిస్తుంటుంది. మిగ‌తా హీరోల‌కు భిన్నంగా ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో ఆయన సినిమా అంటే ష్యాన్స్‌లో ఉండే హంగామా వేరు. కార‌ణం వ‌రుస ఫ్లాపులతో ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు `గ‌బ్బ‌ర్‌సింగ్‌` మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని అందించ‌డ‌మే కాకుండా ప‌వ‌న్ నుంచి అభిమానులు ఎలాంటి సినిమాని కోరుకుంటున్నారో ఎగ్జాట్లీ అలాంటి మూవీని అందించి ఫ్యాన్స్‌ని ఓ రేంజ్‌లో ఖుషీ చేశాడు.

అప్ప‌టి నుంచి ప‌వ‌న్ ఫ్యాన్స్‌ల‌లో ఓ ఫ్యాన్స్ అయిపోవ‌డ‌మే కాకుండా వాళ్ల‌కి అత్యంత ఫేవ‌రేట్ డైరెక్ట్ అయ్యారు హ‌రీష్ శంక‌ర్‌. ప‌దేళ్ల విరామం త‌రువాత ప‌వ‌న్‌కు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని అందించ‌డంతో హ‌రీష్‌పై ప‌వ‌న్ అభిమానుల్లో ప్ర‌త్యేక‌మైన అభిమానం, ప్రేమ ఏర్ప‌డ్డాయి. దీంతో ప‌వ‌న్, హ‌రీష్‌ల క‌ల‌యిక‌లో సినిమా ఎప్పుడెప్పుడా అని గ‌త కొంత కాంగా ఎదురు చూసిన అభిమానుల‌కు `ఉస్దాద్ భ‌గ‌త్‌సింగ్‌`తో బిర్యానీ పెట్టేందుకు రెడీ అయిపోయాడు. అయితే ఈ సినిమా త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ `థేరి`కి రీమేక్ అని ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో కొంత వ‌ర‌కు మెగా ఫ్యాన్స్ నిరుత్సాహానికి గుర‌య్యారు.

నెట్టింట హ‌రీష్‌కు వ్య‌తిరేకంగా కామెంట్‌లు చేసి త‌మ అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. అయితే టీజ‌ర్‌, ట్రైల‌ర్ రిలీజ్‌ల త‌రువాత వారి ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు మొద‌లైంది. ప‌దేళ్ల గ్యాప్ త‌రువాత `గ‌బ్బ‌ర్‌సింగ్‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని అందించి ప‌వ‌న్‌ని ఫ్యాన్స్ కోరుకున్న విధంగా చూపించాడ‌ని, మ‌ళ్లీ అదే మ్యాజిక్‌ని `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌`కు రిపీట్ చేయ‌బోతున్నాడ‌ని హ‌రీష్‌ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. సినిమా ట్రైల‌ర్ ఇంట్రెస్టింగ్‌గానే ఉన్నా సినిమాకు రావాల్సినంత బ‌జ్ ఇంత వ‌ర‌కు రాలేదు.

ఈ నేప‌థ్యంలో మార్చి 19న `ధురంధ‌ర్ 2`కు పోటీగా రిలీజ్ అవుతున్న `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌` ఫ్యాన్స్ ఆశించిన స్థాయిలో లేక‌పోతే ప‌రిస్థితి ఏంట‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ సినిమాని ప‌ట్టాలెక్కించ‌డానికి ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ ఓ యుద్ధ‌మే చేశాడు. ప‌వ‌న్ డేట్స్ కోసం రెండు మూడేళ్లు ఎదురు చూశాడు. ఆ టైమ్‌లో త‌ను వేరే ప్రాజెక్ట్ చేసుకోవ‌చ్చు కానీ అలా ఆలోచించ‌కుండా ప‌వ‌న్ కోస‌మే త‌న విలువైన స‌మ‌యాన్ని డెడికేట్ చేశాడు. ఆ త్యాగం ఫ‌లించి సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుందా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రినీ తొలిచేస్తోంది.

ప‌వ‌న్ సినిమా అంటే ఉండే బ‌జ్ వేరు. కానీ ఈ సినిమాకు ఆ బ‌జ్ క‌నిపించ‌క‌పోవ‌డం.. హ‌డావిడిగా రిలీజ్ డేట్‌ని ముందుకు జ‌రిపి మోన్‌స్ట‌ర్ లాంటి `ధురంధ‌ర్ 2`కు పోటీగా రిలీజ్ చేస్తుండ‌టంతో అభిమానుల్లో క‌ల‌వ‌రం మొద‌లైంది. హ‌రీష్ శంక‌ర్‌ని త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌క‌పోయినా..`ధురంధ‌ర్ 2` మేనియా ముందు `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌` ప్ర‌భావం చూపిస్తుందా? అన్న‌ది అభిమానుల్లో సందేహంగా మారింది. `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌` ఈ ఒత్తిడిని త‌ట్టుకుని నిల‌బ‌డి బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయితేనే డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ త్యాగానికి అర్థం ఉంటుంద‌ని, అభిమానుల్లో ఆయ‌న గౌర‌వం నిల‌బ‌డుతుంద‌నే టాక్ వినిపిస్తోంది.