Begin typing your search above and press return to search.

అందుకే ఆయ‌న డైరెక్ట‌ర్ వెర్ష‌న్ ఆఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్!

అయితే ప్రీ లుక్ పోస్ట‌ర్ లో హీరో వెనుక నుంచి తీసిన ఫోటో లో ఉన్న‌ది ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాదు. హ‌రీష్ శంక‌ర్ అనే ప్ర‌చారం జ‌రిగింది.

By:  Srikanth Kontham   |   12 March 2026 12:38 PM IST
అందుకే ఆయ‌న డైరెక్ట‌ర్ వెర్ష‌న్ ఆఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్!
X

డైరెక్ట‌ర్ హరీష్ శంకర్ పక్కా పవన్ కళ్యాణ్ ప్యాన్. అందులో ఎలాంటి సందేహం లేదు. త‌న అభిమాన హీరోను వెండి తెరపై ఎలా చూపించాలో? ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. తొలి సినిమా `గబ్బర్ సింగ్` తోనే ప్రూవ్ చేసుకున్నాడు. ఆ త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్ ప్లాపుల్లో ఉన్నా? ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిలిచి మ‌రీ `ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్` కి అవ‌కాశం ఇచ్చారంటే? హ‌రీష్ ని ప‌వ‌న్ ఎంత‌గా న‌మ్ముతారు అన‌డానికి ఇదొక మ‌చ్చు తున‌క‌. త్వ‌ర‌లో రిలీజ్ అవుతోన్న ఈ సినిమాపై ఎలాంటి అంచ‌నాలున్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే ప్రీ లుక్ పోస్ట‌ర్ లో హీరో వెనుక నుంచి తీసిన ఫోటో లో ఉన్న‌ది ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాదు. హ‌రీష్ శంక‌ర్ అనే ప్ర‌చారం జ‌రిగింది.

దీంతో హ‌రీష్ శంక‌ర్ డూప్ గా న‌టించారే వార్త‌లు నెట్టింట వైర‌ల్ అయ్యాయి. అయితే ఈ పోలిక పై హ‌రీష్ తాను ఇవ్వాల్సిన వివ‌ర‌ణ ఇచ్చేసినా ప‌వ‌న్ తో పోల్చ‌డం ప‌ట్ల చాలా సంతోషాన్ని వ్య‌క్తం చేసారు. దీన్నో ప్ర‌శంస‌గా, పుర‌స్కారంగా తీసుకున్న‌ట్లు హరీష్ మాటల్లో క‌నిపిస్తుంది. తనను ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్‌తో పోల్చడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఒక అభిమానిగా తన హీరోని పోలి ఉన్నాననే వార్త వినడం కంటే పెద్ద సంతోషం మరొకటి ఉండదన్నారు. ఆయనతో పోల్చడం నిజంగా గర్వంగా, సంతోషంగా అనిపించింద‌న్నారు.

వ్య‌క్తిగ‌తంగానూ హరీష్ లో ప‌వ‌న్ మ్యాన‌రిజ‌మ్ క‌నిపిస్తుంది. ఆయన నడిచే తీరు, డ్రెస్సింగ్ స్టైల్ వంటివి హరీష్ సినిమాల్లో ప్రతిబింబిస్తుంటాయి. అందుకే అభిమానులు కూడా హరీష్ శంకర్‌ను డైరెక్టర్ వెర్షన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గా పిలుస్తుంటారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో సినిమా అంటే చాలా మంది ద‌ర్శ‌కులు ఒత్తిడికి గుర‌వుతుంటారు. ఆయ‌న‌తో ప్రీగా ప‌ని చేయ‌గ‌ల‌మా? లేదా? అన్న టెన్ష‌న్ చాలా మందిలో క‌నిపిస్తుంది. కానీ హ‌రీష్ శంక‌ర్ లో మాత్రం అలాంటి భావ‌న ఎక్క‌డా క‌నిపించ‌దు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో ఎంతో స్వేచ్ఛ‌గా సినిమా చేయ‌గ‌ల‌రు.

ప‌వ‌న్ ని త‌న దారిలోకి తెచ్చుకుని ప‌ని చేయించుకోవ‌డంలో స్పెష‌లిస్ట్. ఈ విష‌యంలో త్రివిక్ర‌మ్ కంటే హ‌రీష్ శంక‌ర్ మ‌రింత మెరుగ్గా ప‌నిచేస్తార‌ని చెప్పొచ్చు. అలాగ‌ని ప‌వ‌న్ స్వేచ్ఛ‌కు భంగం క‌లిగించ‌రు. ప‌వ‌న్ రాజకీయ హోదాను దృష్టిలో పెట్టుకుని ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ లో ఎలాంటి ఐటం పాట పెట్ట‌లేదు. నిజానికి సినిమాలో ఐటం పాట అవ‌స‌ర‌మే. కానీ హీరో గౌరవానికి భంగం కలగకూడదనే ఉద్దేశంతో ఆ ఛాన్స్ తీసుకోలేదు.