Begin typing your search above and press return to search.

వాట్ నెక్స్ట్ హ‌రీష్ శంక‌ర్ జీ?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ విజ‌యంతో ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ బౌన్స్ బ్యాక్ అవుతాడ‌ని చాలా మంది ఆశ‌లు పెట్టుకున్నారు.

By:  Srikanth Kontham   |   1 April 2026 5:00 PM IST
వాట్ నెక్స్ట్ హ‌రీష్ శంక‌ర్ జీ?
X

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ విజ‌యంతో ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ బౌన్స్ బ్యాక్ అవుతాడ‌ని చాలా మంది ఆశ‌లు పెట్టుకున్నారు. గ‌బ్బ‌ర్ సింగ్ రేంజ్ విజ‌యాన్ని ఉస్తాద్ తో రిపీట్ చేస్తాడ‌ని భావించారు. కానీ ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ఆ రేంజ్ ను ట‌చ్ చేయ‌లేక‌పోయింది. అంత‌కు ముందు హ‌రీష్ తెరెక్కించిన మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ కూడా డిజాస్ట‌ర్ అయింది. దీంతో హ‌రీష్ త‌దుప‌రి చిత్రంపై సందిగ్ద‌త నెల‌కొంది. హీరీష్ నెక్స్ట్ హీరో ఎవ‌ర‌వుతారు? అనే ప్రశ్న టాలీవు డ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ కూడా మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ రిలీజ్ అయిన రెండేళ్ల‌కు చేసిన చిత్రం.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్ప‌టిక‌ప్పుడు ముందుకు రావడంతో సాధ్య‌మైన ప్రాజెక్ట్ అది. అలా ప‌వ‌న్ రూపంలో మ‌రోసారి గొప్ప అవ‌కాశం వ‌చ్చినా? దాన్ని హరీష్ స‌ద్వినియోగం చేసుకోలేక‌పోయారు. ఈనేప‌థ్యంలో హీర‌ష్ త‌దుప‌రి సినిమాకు మ‌రింత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం స్టార్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాలంటూ బిజీగా ఉన్నారు. ఒక‌వేళ వాళ్ల‌లో ఏ హీరో ఖాళీ అయినా హీరీష్ క‌థ‌కు క‌నెక్ట్ అవ్వ‌డం అంత సుల‌భం కాదు. హ‌రీష్ క‌థ‌లు కొత్త‌గా ఉండ‌వు. పాత క‌థ‌ల్నే కొత్త‌గా చెప్పే ప్ర‌య‌త్నం చేస్తాడు. కాబ‌ట్టి అవి పాన్ ఇండియాలో ఎంత మాత్రం వ‌ర్కౌట్ అవ్వ‌వు.

పైగా స‌క్సెస్ ల్లో ఉన్న హీరో ప్లాప్ డైరెక్ట‌ర్ కి ఛాన్స్ ఇవ్వాలంటే చాలా విష‌యాలు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటాడు. మ‌హేష్‌, చ‌ర‌ణ్‌, ప్ర‌భాస్, బ‌న్నీ, తార‌క్ లాంటి హీరోలైతే హ‌రీష్ తో ముందుకెళ్ల‌డం దాదాపు అసాద్యం. దీంతో హ‌రీష్ శంక‌ర్ టైర్ 2, టైర్ 3 హీరోల కోసం ప్ర‌య‌త్నించాల్సిందే. వారు కూడా చాలా బిజీగా ఉంటున్నారు. క‌థ బాగుంటే కొత్త ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేస్తున్నారు. ఇన్నో వేటివ్ గా ఎవ‌రు క‌థ చెబుతున్నారు? ఎవ‌రి మేకింగ్ బాగుంది? ఇలా ఎన్నో విష‌యాలు ఆలోచించి నిర్ణ‌యం తీసుకుంటున్నారు. హ‌రీష్ కు ఛాన్స్ రావాలంటే న‌వత‌రంతో అత‌డు పోటీ ప‌డాల్సిందే.

లేక‌పోతే ఆ ఛాన్స్ కూడా క‌ష్ట‌మే. హ‌రీష్ శంక‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కూ క‌మ‌ర్శియ‌ల్ సినిమాలే చేసాడు. హీరో ఎలివేష‌న్లు...మాస్ కి క‌నెక్ట్ అయ్యే అంశాల్నే బేస్ చేసుకుని అతడి సినిమాలుంటాయి. వాటిలో ఎక్క‌డా కొత్త ద‌నం ఉండ‌దు. ఇది న‌వ‌తంర శైలికి పూర్తి భిన్నం. హ‌రీష్ కెరీర్ మొత్తంలో భారీ విజ‌యాలు సాధించిన చిత్రాలంటే రెండే. కెరీర్ ఆరంభంలో చేసిన మిర‌ప‌కాయ్, గ‌బ్బ‌ర్ సింగ్ మాత్ర‌మే. సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్, దువ్వాడ జ‌గ‌న్నాధం, గ‌ద్ద‌ల కొండ గణేష్ చిత్రాలు డివైడ్ టాక్ తో ఆడిన‌వే. అప్ప‌టి ట్రెండ్ కు త‌గ్గ‌ట్టు హరీష్ చేసిన చిత్రాలు. ట్రెండ్ మారిన త‌ర్వాత కూడా పాత ప‌ద్ద‌తితో త‌ర్వాతి సినిమాలు క‌నిపిస్తాయి. మ‌రి ఈ ఫేజ్ ను దాటి హ‌రీష్ ఎలా బ‌య‌ట ప‌డ‌తాడో? చూడాలి.