ఆ పేటెంట్ హక్కులు తనవే నట!
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ఫ్యామిలీ ఫన్ రైడ్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. కిషోర్ తిరుమల దర్శకుడు. డింపుల్ హయాతి, అషికా రంగనాథ్ హీరోయిన్‌లుగా నటించారు.
By: Tupaki Entertainment Desk | 11 Jan 2026 5:43 PM ISTమాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ఫ్యామిలీ ఫన్ రైడ్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. కిషోర్ తిరుమల దర్శకుడు. డింపుల్ హయాతి, అషికా రంగనాథ్ హీరోయిన్‌లుగా నటించారు. రవితేజ మార్కు మాస్ మసాలా మూవీ కాదిది. ఆయన పంథాకు పూర్తి భిన్నంగా రూపొందిన కంప్లీట్ ఫ్యామిలీ కామెడీ డ్రామా. జనవరి 13న సంక్రాంతి రేసులో దిగుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషనల్ వీడియోలు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. వైఫ్, గాళ్ ఫ్రెండ్ మధ్య నలిగే ఓ యువకుడి కథగా దీన్ని కిషోర్ తిరుమల తెరకెక్కించారు.
టీజఱ్, ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. అయితే ఈ మూవీకి రవితేజ తన పేరు ముందు మాస్ మహారాజా ట్యాగ్‌ని తీసేయమని డైరెక్టర్ కిషోర్ తిరుమలతో అన్నాడట. అదే విషయాన్ని ఇటీవల ఆయన బయటపెట్ఆడంతో దీనిపై స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న హరీష్ శంకర్ `మాస్ మహారాజా` ట్యాగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాకు ఇష్టమైన ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి.
చాలా ప్యాషనేట్, సెన్సిబుల్ ప్రొడ్యూసర్. ఆయనతో నా సినిమా కచ్చితంగా ఉంటుంది. అయితే అది ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందన్నది మాత్రం తాను ఇప్పుడే చెప్పలేను. అయితే ఆయనతో మాత్రం కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకు రవితేజ అన్నయ్య `మాస్ మహారాజా` టైటిల్ తీసేయండి అని అన్నారట. 'మాస్ మహారాజా' టైటిల్ పెట్టింది నేను. దాని పేటెంట్ రైట్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. అది ఉంచాలన్నా..తీసేయాలన్నా నన్ను అడగాలి. మాస్ మహారాజా పేరు తీసేయాలా.. ఉంచాలా అన్నది అన్నయ్య ఇష్టం. కానీ మమ్మల్ని ఆపడం మాత్రం మీకు చాలా కష్టం గుర్తు పెట్టుకోండి.
అన్నయ్య నుంచి మిరపకాయ్ వచ్చినా.. మిస్టర్ బచ్చన్ వచ్చినా ఒకేలా ఉండే వ్యక్తి రవితేజ. ఆయన రియల్ లైఫ్ క్యారెక్టర్‌నే `నేనింతే`లో పూరి జగన్నాథ్ పెట్టాడు. సినిమా ఎలా ఉన్నా సరే అది ఆడిందా.. ఊడిందా? అన్నది తను పట్టించుకోడు. నెక్స్ట్ డే షూటింగ్‌కు వెళ్లిపోతాడు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినదాన్ని మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బ్లాక్ బస్టర్లు వచ్చినప్పుడు పొంగిపోకురా.. ఫ్లాప్‌లు వచ్చినప్పుడు కుంగిపోకురా అని చెప్పాడు. దీన్ని స్థితప్రజ్ఞత అంటారు. రవితేజ భగవద్గీత చదువుకున్నాడో లేదో తెలియదు కానీ అందులో చెప్పినట్టే ఉంటాడు. ఆ క్వాలిటీని పవన్ కల్యాణ్ తరువాత రవితేజలోనే చూశాను.
ఏ ముహూర్తాన అది అలవాటు చేసుకున్నారో కానీ దాన్ని మాకు కూడా నేర్పించారు. అందుకే ఇవాళ ధైర్యంగా మాట్లాడుతున్నాను. దీని కోసం రుషులు ఎక్కడికో వెళ్లి తపస్సు చేస్తుంటారు. అక్కడికి వెళ్లే బదులు రవితేజ అన్నయ్య దగ్గరికి వస్తే సరిపోతుందని పాపం వాళ్లకి తెలియదు` అంటూ చెప్పుకొచ్చాడు. అయితే రవితేజని పొగడటంలో తప్పులేదు కానీ మరీ మోసేయడం ఏమీ బాగాలేదు. రుషులని ఇందులోకి తీసుకొచ్చి స్థితప్రజ్ఞత సాధించడం కోసం రవితేజ వద్దకు వారిని రమ్మనడం కూడా కొంచెం ఓవర్ అయిందని కామెంట్‌లు వినిపిస్తున్నాయి.
