Begin typing your search above and press return to search.

హరీష్ శంకర్ 'ఉస్తాద్'.. కష్టానికి తగ్గ రిజల్ట్ అందుకుంటారా?

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయ షెడ్యూల్ కారణంగా షూటింగ్‌ కు పెద్ద బ్రేక్ పడింది. ఆ మధ్య ఏకంగా సినిమా నిలిచిపోయిందని వార్తలు వచ్చాయి.

By:  M Prashanth   |   17 March 2026 10:38 AM IST
హరీష్ శంకర్ ఉస్తాద్.. కష్టానికి తగ్గ రిజల్ట్ అందుకుంటారా?
X

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బ్లాక్‌ బస్టర్ హిట్ మూవీ గబ్బర్ సింగ్ తర్వాత దర్శకుడు హరీష్ శంకర్- పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌ లో వస్తున్న ఆ సినిమా కోసం ఒక్క డైరెక్టర్ గా మాత్రమే కాకుండా హరీష్ అన్నీ తానై పనిచేస్తుండటం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలతోపాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మొదలైనప్పటి నుంచి అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయ షెడ్యూల్ కారణంగా షూటింగ్‌ కు పెద్ద బ్రేక్ పడింది. ఆ మధ్య ఏకంగా సినిమా నిలిచిపోయిందని వార్తలు వచ్చాయి. కానీ హరీష్ శంకర్ మాత్రం ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. పవన్ ఫ్రీ అయ్యాక.. డేట్స్ తీసుకుని సినిమా ఎలా అయినా కంప్లీట్ చేయాలని టార్గెట్ తో కష్టపడ్డారు.

రోజుకు రెండు నుంచి మూడు గంటలు మాత్రమే నిద్రపోతూ పనిని ముందుకు నడిపినట్టు టాక్ వినిపిస్తోంది. షూటింగ్ పూర్తిచేయడం మాత్రమే కాకుండా, ఫైనల్ అవుట్‌ పుట్ మెరుగుపరచడంలో కూడా హరీష్ కీలక పాత్ర పోషించారు. ఎడిటింగ్ నుంచి ఫైనల్ కట్ వరకు ప్రతి స్టేజ్ లో దగ్గరుండి పర్యవేక్షించారు. ముఖ్యంగా ట్రైలర్ కట్స్, డబ్బింగ్, సౌండ్ డిజైన్ వంటి విభాగాల్లో ఆయన ప్రత్యేక ఫోకస్ పెట్టారు.

మ్యూజిక్ పరంగా కూడా సినిమా ప్రయాణం ప్రత్యేకమే. ఎందుకంటే మొదటగా సంగీత బాధ్యతలు దేవి శ్రీ ప్రసాద్ వద్ద ఉండగా, తర్వాత అవి ఎస్. తమన్ కు మారాయి. ఆ సమయంలో బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ పనిని హరీష్ శంకర్ స్వయంగా పర్యవేక్షించడం విశేషం. తక్కువ సమయంలోనే సాంగ్స్, టీజర్, ట్రైలర్ విడుదల చేసి సినిమాపై బజ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు.

ఇక ప్రమోషన్ విషయంలో కూడా హరీష్ శంకర్ సింగిల్ గా బాధ్యతలు తీసుకున్నారు. దాదాపు 20 రోజుల పాటు వరుసగా ఇంటర్వ్యూలు, ఈవెంట్లు, మీడియా సమావేశాల్లో పాల్గొంటూ సినిమాకు హైప్ తీసుకొచ్చారు. సినిమా గురించి ప్రతి చిన్న విషయాన్ని ప్రేక్షకులకు రీజ్ అయ్యేలా కృషి చేశారు. ఇప్పుడు సినిమా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతుండగా.. అన్నీతానై ముందుకు నడిపించారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు

అయితే గత మూవీ మిస్టర్ బచ్చన్ తో డిజాస్టర్ అందుకున్న హరీష్ శంకర్.. ఈసారి బ్లాక్ బస్టర్ కొట్టాలని కసితో పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నారు. అలా ఉస్తాద్ కు ఒక దర్శకుడిగా మాత్రమే కాకుండా, ఒక పూర్తి స్థాయి క్రియేటివ్ లీడర్‌ గా ఆయన వ్యవహరించారని చెప్పుకోవచ్చు. అన్ని విభాగాలను సమన్వయం చేస్తూ సినిమాను సమయానికి పూర్తి చేయడం ఆయన డెడికేషన్ కు ఎగ్జాంపుల్. అలా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వెనుక హరీష్ శంకర్ చేసిన కృషి ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. సినిమా విడుదల తర్వాత ఆ కష్టానికి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.