Begin typing your search above and press return to search.

మెగాస్టార్‌తో హ‌రీశ్‌ సినిమా ఏ జోన‌ర్‌లో అంటే..!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ కల్యాణ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌`. హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌కుడు.

By:  Ravindar Gorantla   |   17 March 2026 3:02 PM IST
మెగాస్టార్‌తో హ‌రీశ్‌ సినిమా ఏ జోన‌ర్‌లో అంటే..!
X

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ కల్యాణ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌`. హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌కుడు. `గ‌బ్బ‌ర్‌సింగ్` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌రువాత వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో దీనిపై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మార్చి 19న భారీ స్థాయిలో ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకొస్తోంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొంటూ సినిమాపై మ‌రింత హైప్‌ని క్రియేట్ చేస్తున్నారు. ప‌వ‌న్ కల్యాణ్‌కు వ‌ర్క్ పై ఉన్న డెడికేష‌న్ గురించి వివ‌రిస్తూనే మెగాస్టార్ చిరంజీవితో ప్రాజెక్ట్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్యాలు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

మెగాస్టార్‌తో సినిమా చేయాల‌ని కొంత మంది డైరెక్ట‌ర్ల త‌ర‌హాలోనే హ‌రీశ్ శంక‌ర్ కూడా ఎదురు చూస్తున్నాడు. దీనిపై తాజాగా హ‌రీష్ స్పందించారు. ``ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌` ట్రైల‌ర్ చూసి చిరంజీవి నాతో 20 నిమిషాలు మాట్లాడారు. డైలాగులు బాగున్నాయ‌న్నారు. ప‌వ‌న్ అందంగా ఉన్నార‌ని ఆనందంగా చెప్పారు. ఆ ఫోన్ పెట్టేశాక నాకో విష‌యం అర్థ‌మైంది. చిరంజీవికి ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌మ్ముడు మాత్ర‌మే కాదు.. కొడుకు కూడా అనిపించింది. ప్ర‌తి షాట్ గురించి చెబుతూ ఆయ‌న మురిసిపోయారు.

నేను చిరంజీవిని చాలా సార్లు క‌లిశాను. ఆయ‌న‌తో కొన్ని యాడ్ ఫిల్మ్స్ తీశాను. ఆయ‌న‌తో నేను చేయ‌బోయే సినిమా ప్రాసెస్‌లో ఉంది. ఖ‌చ్చితంగా మెగాస్టార్‌తో ఒక రౌడీ అల్లుడు, దొంగ మొగుడు, గ్యాంగ్ లీడ‌ర్ లాంటి సినిమా చేసి తీర‌తాను` అని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా ఈ సినిమాల్లో చిరు చూపించిన మాస్ మేన‌రిజ‌మ్స్‌, టైమింగ్‌ని దృష్టిలో పెట్టుకుని అందుకు త‌గ్గ క‌థ‌లు సిద్ధం చేస్తున్న‌ట్టుగా వెల్ల‌డించారు. మెగాస్టార్‌ని ఓ అభిమాని ఎలా చూడాల‌ని కోరుకుంటున్నాడో అలాగే ఆయ‌న‌తో చేసే సినిమా ఉంటుంద‌న్నారు.

గ‌త కొంత కాలంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాల‌ని పూరి జ‌గ‌న్నాథ్ లాంటి ద‌ర్శ‌కులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అప్ప‌ట్లో `ఆటో జానీ` మూవీని చిరుతో చేయాల‌ని పూరి జ‌గ‌న్నాథ్ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేయ‌డం తెలిసిందే. అయితే ఫ‌స్ట్ పార్ట్ న‌చ్చ‌డం, సెకండ్ పార్ట్ చిరుకు పెద్ద‌గా న‌చ్చ‌క‌పోవ‌డంతో స్క్రిప్ట్‌లో మార్పులు చేయాల‌ని చిరు కోర‌డం, అందుకు పూరి అంగీక‌రించి మార్పులు చేర్పులు చేయ‌డం..అయినా అది కార్యరూపం దాల్చ‌క‌పోవ‌డం తెలిసిందే.

మ‌రి రౌడీ అల్లుడు త‌ర‌హా సినిమా చిరుతో చేస్తాన‌ని చెబుతున్న హ‌రీశ్ శంక‌ర్ ప్లాన్ వ‌ర్క‌వుట్ అవుతుందా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. ప‌వ‌న్‌తో చేసిన సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డం, `ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌`లోనూ బ్లాక్ బస్ట‌ర్ హిట్ ఛాయ‌లు క‌నిపిస్తుండ‌టంతో హ‌రీశ్‌కు చిరు అవ‌కాశం ఖ‌చ్చితంగా ఇస్తార‌ని, అది త్వ‌ర‌లోనే కార్య‌రూపం దాల్చుతుంద‌ని ఇన్ సైడ్ టాక్‌. ఇదిలా ఉంటే ఈ మూవీ త‌రువాత హ‌రీశ్ శంక‌ర్ సితార బ్యాన‌ర్‌లో బాల‌య్య‌తో ఓ భారీ యాక్ష‌న్ డ్రామాని చేయ‌డానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. దాని త‌రువాతైనా మెగాస్టార్‌తో ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కుతుందా? అన్న‌ది వేచి చూడాల్సిందే.