Begin typing your search above and press return to search.

హరీష్ శంకర్.. నెక్స్ట్ హీరో దొరికినట్లేనా..

నిన్న జరిగిన 'రణబాలి' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ హరీష్ శంకర్ స్పీచ్ ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది.

By:  M Prashanth   |   14 Oct 2026 9:02 AM IST
హరీష్ శంకర్.. నెక్స్ట్ హీరో దొరికినట్లేనా..
X

నిన్న జరిగిన 'రణబాలి' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ హరీష్ శంకర్ స్పీచ్ ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది. ఎప్పుడూ తన స్టైల్ లో పంచ్ లు వేసే హరీష్.. నిన్న మాత్రం చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. విజయ్ దేవరకొండ పడే కష్టాన్ని ట్రోల్ చేసేవాడు ఇంకా పుట్టలేదంటూ ఏకంగా స్టేజ్ పైనే రౌడీ హీరోకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఈ స్పీచ్ చూసిన తర్వాత, చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న వీరిద్దరి ప్రాజెక్ట్ మళ్లీ ట్రాక్ ఎక్కబోతోందా అనే గుసగుసలు మొదలయ్యాయి.

నిజానికి విజయ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోందని చాలా ఏళ్లుగా టాక్ ఉంది. గతంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లోనే ఈ ప్రాజెక్ట్ గురించి సీరియస్ గా డిస్కషన్స్ జరిగాయని ఇండస్ట్రీ టాక్. హరీష్ శంకర్ చెప్పిన ఓ లైన్ విజయ్ కు బాగా నచ్చిందని, కానీ కొన్ని కారణాల వల్ల అది సెట్స్ పైకి వెళ్లలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ ఈవెంట్ లో ఇద్దరి మధ్య కనిపించిన బాండింగ్ చూస్తుంటే.. ఆ పాత కథ మళ్లీ ముందుకు కదిలే ఛాన్స్ ఉందంటున్నారు.

ప్రస్తుతం హరీష్ శంకర్ కెరీర్ గ్రాఫ్ కు ఓ సాలిడ్ హిట్ చాలా అవసరం. మైత్రీ బ్యానర్ లో చేసిన 'ఉస్తాద్ భగత్ సింగ్' అనుకున్న స్థాయిలో వర్కౌట్ కాలేదు. కానీ అదే బ్యానర్ లో మరో సినిమా చేయడానికి ఆయన సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటు విజయ్ దేవరకొండ కూడా మైత్రీ వాళ్లతోనే ట్రావెల్ అవుతున్నాడు. 'రణబాలి' వాళ్లదే కాబట్టి, ఈ ఈక్వేషన్స్ అన్నీ కలిపి చూస్తే.. విజయ్ హరీష్ కాంబోను సెట్ చేయడానికి ప్రొడక్షన్ హౌస్ గట్టిగానే ప్లాన్ చేస్తోందనేది ఇన్ సైడ్ టాక్.

విజయ్ మాస్ ఆటిట్యూడ్ కు, హరీష్ మార్క్ ఎనర్జిటిక్ డైలాగులు తోడైతే స్క్రీన్ మీద ఆ ఫైర్ వేరే లెవెల్ లో ఉంటుందని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా రొటీన్ రీమేక్ లకు బ్రేక్ ఇచ్చి ఒక మంచి స్ట్రెయిట్ కమర్షియల్ కథతో హరీష్ వస్తే.. విజయ్ స్వాగ్ కు పక్కాగా సెట్ అవుతుంది. ఈ జోడీ గనక సెట్ అయితే మాత్రం అది డెఫినెట్ గా ఓ క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందనడంలో డౌట్ లేదు.

అయితే ఇదంతా ఎంత త్వరగా పట్టాలెక్కుతుందనేది చూడాలి. ఎందుకంటే ప్రస్తుతానికి విజయ్ ఫోకస్ అంతా ప్యాన్ ఇండియా రిలీజ్ 'రణబాలి' మీదే ఉంది. ఆ తర్వాత కమిట్ మెంట్స్ కూడా ఉన్నాయి. హరీష్ శంకర్ కూడా ఈ ప్రాజెక్ట్ కోసం ఓ సాలిడ్ స్క్రిప్ట్ రెడీ చేయాల్సి ఉంటుంది. డిస్కషన్స్ నడుస్తున్న మాట వాస్తవమే అయినా.. అన్నీ కుదిరి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.