Begin typing your search above and press return to search.

దేవీ శ్రీ‌ ప్ర‌సాద్‌ని అలా ఎత్తేశారేంటో..?

దీంతో ప‌వ‌న్ అభిమానుల్లో మ‌ళ్లీ సంద‌డి మొద‌లైంది. నెట్టింట ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో హంగామాకు రెడీ అయిపోతున్నారు.

By:  Tupaki Entertainment Desk   |   11 Feb 2026 11:50 AM IST
దేవీ శ్రీ‌ ప్ర‌సాద్‌ని అలా ఎత్తేశారేంటో..?
X

దేవీశ్రీ‌ప్ర‌సాద్‌..ఒక ద‌శ‌లో టాలీవుడ్‌లో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఓ వెలుగు వెలిగాడు. త‌నే కావాల‌ని స్టార్ హీరోలు సైతం ఎదురు చూశారంటే అప్ప‌ట్లో అత‌ని డిమాండ్ ఏస్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ద‌శ‌లో టాలీవుడ్‌లో దేవి డేట్స్ కోసం చూడ‌ని స్టార్ డైరెక్ట‌ర్‌, స్టార్ హీరో లేరంటే అతిశ‌యోక్తికాదు. అంతా బిజీగా మారి టాలీవుడ్‌, కోలీవుడ్‌ల‌లో టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిపించుకున్నాడు. అయితే ఆ త‌రువాతే త‌మ‌న్‌తో పాటు భీమ్స్ సిరిరోలియో ఎంట్రీతో నెంబ‌ర్ రేసులో వెక‌బ‌డిపోయాడు. ఇప్పుడు మ‌ళ్లీ త‌న స్థానాన్ని ద‌క్కించుకోవ‌డం కోసం దేవి మ‌ళ్లీ ప‌రుగు మొద‌లు పెట్టాడు.

ఇందులో భాగంగా `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌` కోసం త‌న టాలెంట్‌ని మొత్తం చూపిస్తూ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నాడు. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా రూపొందుతున్న మూవీ ఇది. హ‌రీష్ శంక‌ర్ డైరెక్ట్ చేస్తున్నాడు. `గ‌బ్బ‌ర్‌సింగ్‌` త‌రువాత మ‌ళ్లీ వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌`పై అంచ‌నాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ సాంగ్ `దేఖ్‌లేంగే సాలా..` నెట్టింట ఓ ఊపు ఊపేస్తోంది. త్వ‌ర‌లో సెకండ్ సాంగ్‌ని రిలీజ్ చేయ‌బోతున్నారు. `ఆరా ఆఫ్ ఉస్తాద్` పేరుతో ఈ పాట‌ని రిలీజ్ చేయ‌బోతున్నారు.

దీంతో ప‌వ‌న్ అభిమానుల్లో మ‌ళ్లీ సంద‌డి మొద‌లైంది. నెట్టింట ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో హంగామాకు రెడీ అయిపోతున్నారు. స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ - దేవి శ్రీ‌ప్ర‌సాద్ కాంబినేష‌న్ అంటే ముందుగా గుర్తొచ్చేది బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `గ‌బ్బ‌ర్‌సింగ్‌`. ఈ ఆల్బమ్ ఇప్ప‌టికీ ఎవ‌ర్ గ్రీన్ ఆల్బమ్‌గా నిలవ‌డం తెలిసిందే. మ‌ళ్లీ ఇదే కాంబినేష‌న్ `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌`కు వ‌ర్క్ చేస్తుండ‌టంతో అభిమానులు, సినీ ల‌వ‌ర్స్ ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఆ అంచ‌నాల‌కు ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఈ ఆల్బ‌మ్ ఉంటుంద‌ని డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ గ్యారంటీ ఇస్తున్నాడు.

సెకండ్ సాంగ్ రికార్డింగ్ పూర్త‌యిన సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ పెట్టిన పోస్ట్ నెట్టింట వైర‌ల్ అవుతోంది. `ఆరా ఆఫ్ ఉస్తాద్‌` అనే క్యాప్ష‌న్ ఇచ్చి ఒక క్రేజీ ఫొటోని షేర్ చేశాడు. ఈ ఫొటోలో హ‌రీష్ శంక‌ర్‌, ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ లిరిసిస్ట్ చంద్ర‌బోస్ ఇద్ద‌రూ ఆనందంతో మ్యూజిక్ సేన్సేష‌న్ దేవిశ్రీ‌ప్ర‌సాద్‌ని ఎత్తుకుని క‌నిపించారు. ఇదే సంద‌ర్‌భంగా హ‌రీష్ శంక‌ర్ అన్న మాట‌లు సినిమాపై `ఆరా ఆఫ్ ఉస్తాద్‌`పై అంచ‌నాల్ని పెంచేస్తున్నాయి. దేవీ త‌న మ్యూజిక్‌తో ఓ అగ్నిప‌ర్వ‌తాన్ని సృష్టించాడ‌ని, దానికి చంద్ర‌బోస్ త‌న ప‌దాల‌తో ప‌వ‌ర్ ఇచ్చాడ‌ని చెప్ప‌డం ఆక‌ట్టుకుంటోంది.

అంటే `ఆరా ఆఫ్ ఉస్తాద్‌` ఓ రేంజ్ ఎలివేష‌న్స్‌తో ప‌వ‌న్ స్టార్‌డ‌మ్‌ని, ఆయ‌న క్రేజ్‌ని తెలియ‌జెప్పే విధంగా ఉంటుంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ పాట‌కు థియేట‌ర్ల‌లో అభిమానులు పూన‌కాల‌తో ఊగిపోవ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్ స్టిల్స్‌, `దేఖ్ లేంగే సాలా..` సాంగ్‌లో అభిమానుల్లో అంచ‌నాల్ని పెంచేసిన `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌` మార్చి 26న అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా థియేట‌ర్ల‌లోకి రాబోతోంది. `ఓజీ` త‌రువాత ప‌వ‌న్ నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డం, అందులో హ‌రీష్ శంక‌ర్ డైరెక్ట్ చేయ‌డంతో అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ మూవీ రిలీజ్ అవుతుందా అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.