కాబోయే భార్యకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన స్టార్ సింగర్
టాలీవుడ్ స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తనకు కాబోయే భార్యకు ఇచ్చిన సర్‌ప్రైజ్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
By: Sravani Lakshmi Srungarapu | 25 Nov 2025 1:00 PM ISTటాలీవుడ్ స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తనకు కాబోయే భార్యకు ఇచ్చిన సర్‌ప్రైజ్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. రాహుల్ సిప్లిగంజ్, హరిణ్యా రెడ్డి పెళ్లి ఈ నెల 27న జరగనున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ పెళ్లి పనులు మొదలైపోయాయి. పెళ్లి వేడుకల్లో భాగంగా తాజాగా సంగీత్ వేడుకలు నిర్వహించగా, ఆ సంగీత్ ఈవెంట్ లో రాహుల్ ఇచ్చిన సర్‌ప్రైజ్ కు హరిణ్య షాకైంది.
హరిణ్యకు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్
టీమ్ ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ను ఈ సంగీత్ ఈవెంట్ కు రాహుల్ ఇన్వైట్ చేయగా, చాహల్ ఆ ఈవెంట్ కు హాజరయ్యారు. చాహల్ ను చూసి హరిణ్య ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. ఈ విషయాన్ని, సంగీత్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ హరిణ్య ఇంత పెద్ద గిఫ్ట్ తన లైఫ్ లో మర్చిపోలేనని, థాంక్యూ రాహుల్ అంటూ పోస్ట్ చేయగా, అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చాహల్ కు హరిణ్య వీరాభిమాని
హరిణ్య చాహల్ కు పిచ్చి అభిమాని. తన అభిమాన ప్లేయరే స్వయంగా తమ సంగీత్ కు వచ్చి ఆ ఈవెంట్ ను మరింత స్పెషల్ గా మార్చడంతో హరిణ్య ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రస్తుతం రాహుల్, హరిణ్య, చాహల్ తో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండగా, ఆ ఫోటోలను చూసి ఫ్యాన్స్, నెటిజన్లు కాబోయే జంటకు శుభాకాంక్షలు చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు.
నవంబర్ 27న రాహుల్- హరిణ్యల పెళ్లి
ఇక రాహుల్, హరిణ్య పెళ్లి విషయానికొస్తే వీరి పెళ్లికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా రాహుల్ పెళ్లికి ఆహ్వానించగా, ఆయన పెళ్లికి వస్తారని తెలుస్తోంది. కాగా నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కూతురే హరిణ్య రెడ్డి. నవంబర్ 27న ఉదయం 5 గంటలకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ఓ లగ్జరీ ప్యాలెస్ లో రాహుల్- హరిణ్యల పెళ్లి ఎంతో ఘనంగా జరగనుంది.
