Begin typing your search above and press return to search.

గౌర హరి.. టాలీవుడ్ సెన్సేషన్ గా మారనున్నారా?

గౌర హరి మొదట టెలివిజన్ యాడ్స్, సీరియల్స్ కోసం మ్యూజిక్ కంపోజ్ చేశారు. 2015లో చిన్న మూవీ తుంగభద్రతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చారు.

By:  M Prashanth   |   14 Sept 2025 1:55 PM IST
గౌర హరి.. టాలీవుడ్ సెన్సేషన్ గా మారనున్నారా?
X

గౌర హరి.. కొంతకాలం ముందు ఆయనెవరో పెద్దగా తెలియదు. సరిగ్గా పదేళ్ల క్రితం మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. విరాట పర్వం సినిమాతో సంగీత దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. టాలీవుడ్ హల్క్ రానా, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి లీడ్ రోల్స్ లో నటించిన ఆ మూవీకి గాను తన వర్క్ తో అందరినీ మెప్పించారు.

గౌర హరి మొదట టెలివిజన్ యాడ్స్, సీరియల్స్ కోసం మ్యూజిక్ కంపోజ్ చేశారు. 2015లో చిన్న మూవీ తుంగభద్రతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆ తర్వాత పలు సినిమాలకు వర్క్ చేసినా.. హిట్స్ ను మాత్రం అందుకోలేదు. విరాటపర్వం సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన ఆయన.. గతేడాది హనుమాన్ తో భారీ విజయాన్ని అందుకున్నారు.

హనుమాన్ తో పాన్ ఇండియా స్థాయిలో సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందిన గౌర హరి.. ఆ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అందరినీ ఆకట్టుకున్నారు. ఇప్పుడు మిరాయ్ తో ఓ రేంజ్ లో సందడి చేస్తున్నారు. తేజ సజ్జా లీడ్ రోల్ లో నటించిన ఆ సినిమాకు గాను గౌర హరి అందిన మ్యూజిక్ కు ప్రశంసలు వస్తున్నాయి.

కొన్ని నెలలపాటు కష్టపడిన ఆయన.. మిరాయ్ కు ది బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. సాంగ్స్ తోపాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. అంతే కాదు.. మిరాయ్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో వరుస ప్రాజెక్టులకు సైన్ చేశారు. దీంతో టాలీవుడ్ లో వివిధ సినిమాలకు వర్క్ చేయనున్నారు గౌర హరి.

అదే సమయంలో ఆయన త్వరలో టాలీవుడ్ లో సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారనున్నారని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే కొంతకాలంగా దేవిశ్రీ ప్రసాద్, తమన్ సహా పలువురు తెలుగు సినిమా ప్రపంచంలో ఆధిపత్యం చెలాయిస్తున్నారు. మిక్కీ జె మేయర్, గోపి సుందర్, విశాల్ చంద్రశేఖర్, భీమ్స్, రధన్ వంటి యువ స్వరకర్తలు ఉన్నారు.

వారంతగా మంచి ఆల్బమ్‌ లు అందించినప్పటికీ. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో ఇబ్బంది పడుతున్నారు. శ్రీ చరణ్ పాకాల రాణిస్తున్నా.. పరిశ్రమకు ఎప్పుడూ కొత్త ప్రతిభ అవసరం. కాబట్టి గౌర హరి ఇప్పుడు ఆ లోటును పూరించడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. తద్వారా ది బెస్ట్ వర్క్ అందిస్తూనే.. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారనున్నారని టాక్ వినిపిస్తోంది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.