ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ హార్దిక్ పాండ్యా.. ప్రియురాలి వీడియో వైరల్
అయితే రీసెంట్ గా హార్థిక్ పాండ్యా గర్ల్ ఫ్రెండ్ మహికా శర్మకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు తీయడంతో వీరిపై హార్దిక్ పాండ్యా మండిపడ్డారు..
By: Madhu Reddy | 9 Dec 2025 5:12 PM ISTఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు బయట ఎక్కడైనా కనిపిస్తే చాలు ఫోటోగ్రాఫర్లు, మీడియా వాళ్ళు వారి వెంటపడి మరీ ఫోటోలు,వీడియోలు తీస్తూ ఇబ్బందులు పెడుతున్నారు. అయితే రీసెంట్ గా హార్థిక్ పాండ్యా గర్ల్ ఫ్రెండ్ మహికా శర్మకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు తీయడంతో వీరిపై హార్దిక్ పాండ్యా మండిపడ్డారు.. హార్దిక్ పాండ్యా గర్ల్ ఫ్రెండ్ మహికా శర్మ ఈమధ్యనే ఓ అద్భుతమైన బ్లాక్ మినీ డ్రెస్ వేసుకొని విహారయాత్రకి వెళ్ళింది.అలా ఆమె రెస్టారెంట్ నుండి బయటకు వెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవ్వడంతో హార్దిక్ పాండ్యా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహికా శర్మకు సంబంధించిన అసభ్యకర ఫోటోలు, వీడియోలు తీసిన బాలీవుడ్ వీడియోగ్రాఫర్ లపై మండిపడుతూ ఈ విధంగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టారు. "ప్రజల దృష్టిలో జీవించడం అనేది శ్రద్ధ మరియు పరిశీలనతో కూడిందని నేను అర్థం చేసుకున్నాను. అది నేను ఎంచుకున్న జీవితంలో ఓ భాగం.కానీ ఈరోజు జరిగిన సంఘటన గీత దాటింది. మహికా బాంద్రా రెస్టారెంట్లో మెట్ల మీద నుండి నడుచుకుంటూ వెళ్తుండగా ఏ స్త్రీని ఆ కోణంలో తీయకూడని ఫోటోని తీశారు. ఒక అమ్మాయిని ఏవిధంగా చూపించకూడదో ఆ విధమైన కోణంలో మహికా ను ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలో బంధించారు. ఇది మహిళలను అవమానించినట్లే. మహిళలు గౌరవానికి అర్హులు.ఎవరైనా సరే హద్దులు దాటకూడదు.
ప్రతిరోజు కష్టపడి పని చేసే మీడియా సోదరులను నేను గౌరవిస్తాను. వారికి ఎల్లప్పుడూ సహకరిస్తాను.కానీ నేను మీ అందరి నుండి అభ్యర్థించేది ఒకే ఒక్కటి. దయచేసి కొంచెం జాగ్రత్తగా ఉండండి.ప్రతి దానిని ఫోటో తీయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క యాంగిల్ లో ఫోటో తీసుకోవాల్సిన అవసరం లేదు.ఈ విషయంలో కొంత మానవత్వాన్ని కలిగి ఉండాలని చెబుతున్నాను. ఛీప్ సెన్సేషనలిజం కోసం ఇలా దిగజారడం సరికాదు. మహిళలను గౌరవించాలి. ఫోటోలు తీసేటప్పుడు మైండ్ ఫుల్ గా ప్రవర్తించాలి. ధన్యవాదాలు" అంటూ తన పోస్టులో పెట్టారు. అయితే మహికా శర్మ ఫోటోలు అసభ్యంగా తీయడం వల్లే హార్దిక్ పాండ్యా ఈ విధంగా మీడియా మిత్రులపై ఫైర్ అయినట్టు తెలుస్తోంది.
ఇక హార్థిక్ పాండ్యా నటాషా తో విడాకుల తర్వాత కొంత మందితో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వినిపించాయి. ప్రస్తుతం మహికా శర్మతో డేటింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మహికా మోడలింగ్ లోకి అడుగుపెట్టే ముందు ఫైనాన్స్ లో డిగ్రీ పూర్తి చేసి తనిష్క్, వివో, యూనిక్లో వంటి బ్రాండ్స్ కి సంబంధించిన యాడ్ ప్రమోషన్స్ చేసింది. అలాగే అనిత డోంగ్రే,మనీష్ మల్హోత్రా, తరుణ్ తహలియా వంటి ఇండియాలోని టాప్ డిజైనర్ల కోసం ర్యాంప్ వాక్ కూడా చేసింది.అలా 2024లో మహికా ఇండియన్ ఫ్యాషన్ అవార్డులో మోడల్ ఆఫ్ ది ఇయర్ (న్యూ ఏజ్ )అవార్డుని అందుకుంది.
