వాళ్లిద్దరిపై స్టార్ ప్లేయర్ క్లారిటీ ఎప్పుడు?
ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా విడాకుల తర్వాత ఆటతో మళ్లీ చెలరేగిన వైనం తెలిసిందే. మనసుకు తగిలిన గాయం నుంచి త్వరగానే కోలుకుని ఆటపై ఆ ప్రభావాన్ని ఎక్కడా చూపించలేదు.
By: Srikanth Kontham | 20 Nov 2025 8:36 AM ISTఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా విడాకుల తర్వాత ఆటతో మళ్లీ చెలరేగిన వైనం తెలిసిందే. మనసుకు తగిలిన గాయం నుంచి త్వరగానే కోలుకుని ఆటపై ఆ ప్రభావాన్ని ఎక్కడా చూపించలేదు. ఈ సమయంలో అభిమానుల మద్దతు స్టార్ ప్లేయర్ కు అలాగే దక్కింది. సోషల్ మీడియా వేదికగా మనోధైర్యాన్ని కల్పించారు. అలాగని ఈ నయా ఆల్ రౌండర్ సింగిల్ లైఫ్ కేం పరిమితం కాలేదు. కొంత కాలంగా మహియోకా శర్మతో డేటింగ్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే.
మిహియోకాతో కలిసి ఉన్న ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ పిక్స్ లో హార్దిక్ తనయుడు ఆగస్త్య కూడా ఉన్నాడు. ఒకటి సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఫోటో కాగా, మరొకటి ప్రియురాలని ఎత్తుకుని ముద్దాడుతోన్న పిక్ వైరల్ అవుతుంది. ఇది ప్రస్తుతం ట్రెడింగ్ లో ఉన్న టాపిక్. అయితే భార్య నటాషాతో విడిపోయిన వెంటనే? హార్దిక్ బ్రిటీష్ సింగర్ జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేసినట్లు వార్తలొచ్చాయి. అటుపై వారిద్దరి రిలేషన్ షిప్ పై మళ్లీ ఎలాంటి అప్డేట్ లేదు. కలిసి ఉన్న ఫోటోలు కూడా నెట్టింట ఎక్కడా వైరల్ అవ్వలేదు.
దీంతో ఆ భామకు గుడ్ బై చెప్పేసి మహియోకా శర్మతో డేటింగ్ మొదలు పెట్టాడు? అన్నది కరెంట్ టాపిక్ గా మారిం ది. ఇటీవలే పుట్టిన రోజు వేడుకలు కూడా శర్మా బ్యూటీ ఆధ్వర్యంలోనే సెలబ్రేట్ చేసుకున్నాడు. మరి వీటిపై క్లారిటీ రావాలంటే హార్దిక్ నోరు విప్పాల్సిందే. మహికా శర్మ విషయానికి వస్తే ఈ బ్యూటీ ఢిల్లీకి చెందిన భామ. ఎన్నో కోట్లకు అధిపతి. వృత్తిరీత్యా మోడల్. మహికా శర్మకు ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మహికా ఢిల్లీలో పాఠశాల విద్యను అభ్యసించింది.
అటుపై గుజరాత్‌లోని పండిట్ దీనదయాళ్ పెట్రోలియం విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. అలాగే అమెరికాలోని మేరీల్యాండ్ యూనివర్శిటీలో కమ్యూనిటీ సైకాలజీ చదివింది.
ఈ బ్యూటీ కొన్ని చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించింది. బాలీవుడ్ స్టార్ వివేక్ ఓబెరాయ్ నటించిన `ఇన్ టు ది డస్క్` లో కనిపించింది. అలాగే `పీఎం నరేంద్ర మోడీ` సినిమాలోనూ నటించింది.
