Begin typing your search above and press return to search.

హార్ధిక్ పాండ్యా రహస్యంగా నిశ్చితార్థం?

టీమిండియా ట్యాలెంటెడ్ క్రికెట‌ర్ హార్థిక్ పాండ్యా త‌న భార్య న‌టాషా స్టాంకోవిక్ నుంచి విడిపోయిన త‌ర్వాత అత‌డి ఎఫైర్ల జాబితా అంత‌కంత‌కు పెద్ద‌ద‌వుతోంది.

By:  Sivaji Kontham   |   25 Nov 2025 10:11 AM IST
హార్ధిక్ పాండ్యా రహస్యంగా నిశ్చితార్థం?
X

టీమిండియా ట్యాలెంటెడ్ క్రికెట‌ర్ హార్థిక్ పాండ్యా త‌న భార్య న‌టాషా స్టాంకోవిక్ నుంచి విడిపోయిన త‌ర్వాత అత‌డి ఎఫైర్ల జాబితా అంత‌కంత‌కు పెద్ద‌ద‌వుతోంది. ఇంతకుముందు విదేశీ మోడ‌ల్ జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నాడంటూ ప్రచార‌మైంది. ఈ ఇద్దరూ సోష‌ల్ మీడియాల్లో ఒక‌రినొక‌రు అనుస‌రించ‌డం దీనికి ఆజ్యం పోసింది. ఆ త‌ర్వాత జాస్మిన్ వాలియా అత‌డి నుంచి బ్రేక‌ప్ అయింది.

ఇటీవ‌ల హార్దిక్ పాండ్యా న‌టి కం మోడ‌ల్ మహికా శర్మతో సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్నాడంటూ ప్ర‌చారం సాగుతోంది. ప‌లుమార్లు ఈ జోడీ ప‌బ్లిక్ అప్పియ‌రెన్సులు పుకార్ల‌కు ఊత‌మిచ్చాయి. ఇటీవ‌ల మ‌హీక‌ను ఓ జిమ్ లో ఎత్తుకుని వెళుతున్న హార్థిక్ ఫోటోగ్రాఫ్స్ ఇంట‌ర్నెట్ లోకి దూసుకొచ్చాయి. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా చ‌నువు మితిమీరిందంటూ గుస‌గుస‌లు వినించాయి.

ఇంత‌లోనే ఇప్పుడు ఈ జంట రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారని సోషల్ మీడియాలో గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి. ఆ ఇద్ద‌రి నుంచి ఇటీవ‌లి కొన్ని సోష‌ల్ మీడియా పోస్టులు ఈ త‌ర‌హా చర్చకు దారితీసాయి. మ‌హీక‌ ఉంగరపు వేలుపై మెరిసే పెద్ద‌ ఉంగరాన్ని ఫ్యాన్స్ గమనించిన తర్వాత పాండ్యాతో రహస్యంగా నిశ్చితార్థం అయింద‌ని ఊహాగానాలు మొద‌ల‌య్యాయి.

ప్ర‌స్తుతం ఈ నిశ్చితార్థ‌పు ఉంగ‌రం తాలూకా స్క్రీన్‌షాట్లు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి. మ‌హీక‌శ‌ర్మ‌ ధ‌రించిన ఆభరణాలలో ఈ అంగుళీకం ప్ర‌త్యేకంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. వ‌జ్రాల ఉంగ‌రం త‌ళ‌త‌ళ‌ల గురించి ముచ్చ‌ట్లు మొద‌ల‌య్యాయి. అయితే ఆ ఇద్దరూ నిశ్చితార్థాన్ని నిర్ధారిస్తూ ఎటువంటి బహిరంగ ప్రకటన విడుదల చేయలేదు. ప్ర‌స్తుతానికి ఇవ‌న్నీ ఊహాగానాలుగానే భావించాలి.

జూలై 2024లో హార్థిక్‌- న‌టాషా జంట‌ విడిపోతున్న విష‌యం బ‌హిర్గ‌త‌మైంది. ఆ త‌ర్వాత విడాకులను అధికారికంగా ధృవీక‌రించారు. ప్ర‌స్తుతం అగ‌స్త్య‌కు ఏ లోటు రానివ్వ‌కుండా స‌హ‌త‌ల్లిదండ్రులుగా కొన‌సాగుతున్నారు. పాండ్యా - మహికా జంటపై ఇటీవ‌లే రూమ‌ర్లు మొద‌ల‌య్యాయి. 2025 అక్టోబర్‌లో ముంబై విమానాశ్రయంలో ఈ జంట బహిరంగంగా కనిపించక‌ ముందు సామాజిక మాధ్య‌మాల‌లో ఒక‌రికొక‌రు ద‌గ్గ‌ర‌య్యారు. ఆ త‌ర్వాత ఇద్ద‌రూ క‌లిసి క‌నిపించారు. ఇప్పుడు వ్య‌వ‌హారం ర‌హ‌స్య నిశ్చితార్థం వ‌ర‌కూ వెళ్లింద‌న్న ప్ర‌చారం సాగుతోంది.