Begin typing your search above and press return to search.

విదేశీ గాయ‌నికి బ్రేక‌ప్ చెప్పి ఈ న‌టితో హార్థిక్ పాండ్య‌!

క్రికెటర్ హార్దిక్ పాండ్యా త‌న భార్య న‌టాషా స్టాంకోవిక్ నుంచి విడిపోయే క్ర‌మంలో నిరంత‌రం హెడ్ లైన్స్ లోకొచ్చాడు.

By:  Sivaji Kontham   |   16 Sept 2025 11:08 AM IST
విదేశీ గాయ‌నికి బ్రేక‌ప్ చెప్పి ఈ న‌టితో హార్థిక్ పాండ్య‌!
X

క్రికెటర్ హార్దిక్ పాండ్యా త‌న భార్య న‌టాషా స్టాంకోవిక్ నుంచి విడిపోయే క్ర‌మంలో నిరంత‌రం హెడ్ లైన్స్ లోకొచ్చాడు. భార్య‌ నుండి విడిపోయిన త‌ర్వాత బ్రిటీస్ గాయ‌ని జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నాడంటూ ప్ర‌చార‌మైంది. కానీ మోడ‌ల్ జాస్మిన్ నుంచి కూడా అత‌డు విడిపోయాడు. ఇప్పుడు మ‌రో మోడల్ కం నటి మహికా శర్మతో డేటింగ్‌లో ఉన్నాడంటూ ఊహాగానాలు సాగుతున్నాయి. రెడ్డిట్‌లో దీనిపై వాడి వేడిగా చ‌ర్చ సాగుతోంది. హార్దిక్ వ్యక్తిగత జీవితాన్ని దగ్గరగా చూస్తున్న అభిమానులలో ఒక‌టే ఎగ్జ‌యిట్ మెంట్ నెల‌కొంది.

హార్దిక్ -నటాషా 2020లో వివాహం చేసుకున్నారు కానీ ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ జంట‌ విడిపోతున్నట్లు ప్రకటించారు. విడిపోయిన త‌రవాత కుమారుడు అగ‌స్త్య‌కు స‌హ‌త‌ల్లిదండ్రులుగా కొన‌సాగుతున్నారు. జాస్మిన్ నుంచి విడిపోయాక‌, మోడల్ మహికా శర్మతో హార్దిక్ పాండ్యా డేటింగ్ ప్రారంభించాడంటూ రెడ్డిట్‌లో ఇప్పుడు విస్త్ర‌తంగా చ‌ర్చ సాగుతోంది.

హార్థిక్ `జెర్సీ నంబర్ 33`ని హైలైట్ చేస్తూ `''కొత్త టోర్నమెంట్.. కొత్త గర్ల్‌ఫ్రెండ్'' అంటూ నెటిజ‌నులు స‌ర‌దా కామెంట్లు చేస్తున్నారు. అయితే మ‌హికా ఉన్న‌ట్టుండి ఎలా లైన్ లోకి వ‌చ్చింది? అంటే... హార్దిక్ - మహికా ఇద్దరూ ఇన్‌స్టాలో ఒకరినొకరు ఫాలో అవుతుండ‌ట‌మే ఈ పుకార్ల‌కు ఆజ్యం పోసింది. ఆమెకు అత‌డి రీల్స్ అంటే ఇష్టం.. అత‌డికి సినిమాలు అంటే ఇష్టం. ఇద్ద‌రికీ బాగా జ‌త కుదిరింది! అంటూ పంచ్ లు వేస్తున్నారు కొంద‌రు నెలిజ‌నులు. ఈ వ్య‌వ‌హారం న‌న్ను కూడా ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.. ఇద్ద‌రికీ కామ‌న్ ఇంట్రెస్ట్స్ ఉన్నాయంటూ ఒక నెటిజ‌న్ కామెంట్ చేసాడు. మొత్తానికి స‌ర‌సంగా ఆ ఇద్ద‌రికీ మ‌ధ్య ఏదో జ‌రుగుతోంద‌ని మ‌రొక‌రు వ్యాఖ్యానించారు.

మహికా శర్మ ఎవరు?

మహికా వ్యాపార కుటుంబం నుంచి వ‌చ్చిన అమ్మాయి. మోడలింగ్ చేస్తున్న స‌మ‌యంలోనే నటన వైపు అడుగులు వేసింది. అంత‌కుముందు ఎకనామిక్స్- ఫైనాన్స్ లో ప‌ట్ట‌భ‌ద్రుల‌య్యారు. తనిష్క్, వివో, యునిక్‌లో కోసం మ్యూజిక్ వీడియోలు చేసింది. ఇండీ సినిమాలు, బ్రాండ్ ప్రచారాలలో కనిపించింది. మనీష్ మల్హోత్రా, అనితా డోంగ్రే, తరుణ్ తహిలియాని లాంటి దిగ్గ‌జ డిజైనర్లతో కలిసి పనిచేసింది. 2024లో ఇండియన్ ఫ్యాషన్ అవార్డులలో మోడల్ ఆఫ్ ది ఇయర్ (న్యూ ఏజ్) అవార్డును గెలుచుకుంది. ఎల్లే, గ్రాజియా వంటి పాపుల‌ర్ మ్యాగ‌జైన్ల క‌వ‌ర్ పేజీల‌పైనా ద‌ర్శ‌న‌మిచ్చింది. ప్రస్తుతానికి, హార్దిక్ పాండ్యా లేదా మహికా శర్మ నుండి ఎటువంటి ధృవీకరణ లేదు.