రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ తో హార్దిక్.. ఆమె ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. దానికి కారణం ఆయన విడాకుల తర్వాత చేసే పనిలే.
By: Madhu Reddy | 11 Oct 2025 12:00 AM ISTటీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. దానికి కారణం ఆయన విడాకుల తర్వాత చేసే పనిలే. హార్దిక్ పాండ్యా నటాషా స్టాంకోవిక్ తో గత ఏడాది విడాకులు తీసుకున్న తర్వాత ఓ మోడల్ తో ప్రేమలో ఉన్నట్టు రూమర్లు వినిపించాయి. అయితే ప్రతిసారి ఆ మోడల్ తో హార్దిక్ పాండ్యా తిరుగుతున్నట్టు ఫోటోలు, వీడియోలు చక్కర్లు కొట్టినా కూడా ఇప్పటివరకు ఈ జంట క్లారిటీ ఇవ్వలేదు. అయితే తాజాగా మరోసారి ముంబై ఎయిర్పోర్ట్లో అడ్డంగా బుక్కయ్యారు.
హార్దిక్ పాండ్యా తన రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి మోడల్ మహికా శర్మతో ముంబై ఎయిర్పోర్ట్లో మీడియా కంటపడ్డారు. దాంతో చాలామంది నెటిజన్స్ వీరిద్దరి మధ్య ఏమి లేనప్పుడు ఎందుకు ప్రతిసారి జంటగా కనిపిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలా మరోసారి మీడియాకి చిక్కిన హార్దిక్ పాండ్యా, మహికా శర్మలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారగా.. ఇంతకీ ఈ మహికా శర్మ ఎవరు? అని చాలామంది జనాలు గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. మరి ఇంతకీ ఈ మహికా శర్మ ఎవరు అనేది చూస్తే..
మహికా శర్మ ఎవరో కాదు ప్రముఖ భారతీయ మోడల్.. హీరోయిన్ కూడా.. ఇండియన్ ఫ్యాషన్, వినోద రంగంలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. మోడలింగ్ రంగంలోకి రాకముందు ఫైనాన్స్, ఎకనామిక్స్ లో డిగ్రీ కంప్లీట్ చేసి, ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అలా వివో, యూనిక్లో తనిష్క్ వంటి పాపులర్ బ్రాండ్లకు సంబంధించిన యాడ్ క్యాంపెయిన్ లోను నటించడంతో మహికా శర్మ ఫేమస్ అయింది. అలా ఓవైపు మోడలింగ్ రంగంలో రాణిస్తూనే.. మరోవైపు కొన్ని ఇండిపెండెంట్ సినిమాలు, మ్యూజిక్ ఆల్బమ్స్ లో నటించి నటిగా కూడా రాణించింది. అంతేకాకుండా ఇండియాలో ఫేమస్ డిజైనర్లు అయినటువంటి మనీష్ మల్హోత్రా, తరుణ్ తహాలియాని, అనిత డోంగ్రే, అమిత్ అగర్వాల్ వంటి వాళ్ల కోసం ర్యాంప్ వాక్ చేసింది.
గత ఏడాది ఇండియన్ ఫ్యాషన్ అవార్డ్స్ లో మోడల్ ఆఫ్ ది ఇయర్(న్యూ ఏజ్) అనే అవార్డు కూడా అందుకుంది. అంతేకాదు గత ఏడాది నుండి మహికా శర్మ భారతదేశవ్యాప్తంగా మరింత ఫేమస్ అయ్యింది. దానికి కారణం గత ఏడాది ఓ ప్రముఖ ఫ్యాషన్ షో కి వెళ్ళిన సమయంలో మహికా శర్మ తీవ్రమైన కంటినొప్పితో బాధపడుతుంది. కానీ తన బాధను కప్పిపుచ్చుకొని ఆమె అలానే ర్యాంప్ వాక్ చేసింది. అలా నడుస్తున్న సమయంలో హై హీల్స్ విరిగిపోయినా ఏమి జరగనట్లుగానే తన ర్యాంప్ వాక్ ని కంటిన్యూ చేసింది. అయితే ఈ ర్యాంప్ వాక్ చేసిన సమయంలో మహికా శర్మ ఆత్మవిశ్వాసాన్ని చూసి చాలామంది ప్రశంసలు కురిపించారు. కంటి నొప్పి ఉన్నా, హై హీల్ విరిగిపోయిన ఏమి పట్టించుకోకుండా తనవాక్ కంటిన్యూ చేసి అందరి మన్ననలు పొందింది. ఈ షో నా జీవితానికి చాలా ఇంపార్టెంట్ అని,అందుకే ఎంత బాధ ఉన్నా సరే భరించి ఈ ర్యాంప్ వాక్ పూర్తి చేశాను అంటూ మహికా శర్మ చెప్పుకొచ్చింది. ఈ సంఘటన తర్వాత మహికా శర్మ ఇండియాలో ఫేమస్ మోడల్ గా పేరు తెచ్చుకుంది.
గత సంవత్సరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన భార్యకు విడాకులు ఇచ్చినప్పటి నుండి మహికా శర్మతో డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వినిపించాయి. మాహికా శర్మ కంటే ముందే సింగర్ జాస్మిన్ వాలియాతో కూడా డేటింగ్ చేసినట్టు పుకార్లు వచ్చినప్పటికీ వీరి మధ్య డేటింగ్ కొద్ది రోజులే సాగిందని, ఆ తర్వాత బ్రేకప్ అయ్యాక హార్దిక్ పాండ్యా మహికా శర్మ ప్రేమలో పడ్డట్టు వార్తలు వినిపించాయి. గతంలో రెడ్డిట్లో మహికా శర్మ ఓ సెల్ఫీ పోస్ట్ చేయగా అందులో హార్థిక్ పాండ్యా ఉన్నారని కొంతమంది గుర్తుపట్టినప్పటికీ దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. కానీ తాజాగా ముంబై ఎయిర్పోర్టులో మరోసారి ఈ జంట క్లోజ్ గా కనిపించేసరికి వీరి మధ్య నిజంగానే ఏదో బాండింగ్ ఉందని అందరూ ఓ క్లారిటీకి వచ్చేసారు.
