హార్థిక్- మహీక పెళ్లి.. ఆ సింధూర తిలకం ప్రూఫ్ నమ్మొచ్చా?!
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ ఫోటోను నిశితంగా గమనిస్తే... అందులో మహీకా శర్మ నుదిటిపై పాపిడి భాగంలో ఉన్నది పెళ్లి సింధూరం కాదు.
By: Sivaji Kontham | 26 Jun 2026 10:49 PM ISTసోషల్ మీడియాలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై వచ్చే కొన్ని రూమర్స్, ఫోటోలు నెటిజన్లను ఎంతలా ఆకర్షిస్తాయో సోషల్ మీడియా చర్చలు చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా క్రికెటర్ హార్దిక్ పాండ్యా - మోడల్ మహీకా శర్మల వివాహం గురించి ఇంటర్నెట్‌లో విపరీతమైన ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా హార్థిక్- మహీక జంట పెళ్లయిందని ప్రూఫ్ చూపిస్తూ, మహీక నుదిటిన సింధూర తిలకం దిద్దిన ఓ ఫోటోను నెటిజనులు వైరల్ చేస్తున్నారు. అయితే ఈ వార్తల వెనుక ఉన్న అసలు వాస్తవాలను పరిశీలిస్తే...
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ ఫోటోను నిశితంగా గమనిస్తే... అందులో మహీకా శర్మ నుదిటిపై పాపిడి భాగంలో ఉన్నది పెళ్లి సింధూరం కాదు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఏదైనా ప్రఖ్యాత దేవాలయాన్ని సందర్శించినప్పుడు లేదా ఇంట్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినప్పుడు అర్చకులు పెద్దగా తిలకం దిద్దడం లేదా బొట్టు పెట్టడం సర్వసాధారణం. ఈ ఫోటో కూడా వారు ఏదైనా గుడిని సందర్శించిన సందర్భంలో తీసినది కావచ్చునని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికత విపరీతంగా పెరిగిపోయింది. ఒక సాధారణ ఫోటోను తీసుకొని దానికి సింధూరం లేదా ఇతర మార్పులను జోడించి అచ్చం నిజమైన ఫోటోలా మార్చడం చాలా సులభం. ఈ క్రమంలోనే సదరు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ అయిన ఫోటో కూడా ఏఐ ఎడిట్ అయి ఉండవచ్చని... అందుకే అనుమానాలు రాకుండా ఉండేందుకు ఆ అకౌంట్ నిర్వాహకులు ఆ తర్వాత దాన్ని డిలీట్ చేసి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇంటర్నెట్‌లో పెళ్లి తేదీ రూమర్స్:
భారతదేశంలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో హార్దిక్, మహీకాల వివాహంపై సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం సాగింది. ముఖ్యంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కొన్ని పారడీ-ఫ్యాన్ పేజీలు ఒక అడుగు ముందుకు వేసి ఉదయ్‌పూర్‌లో వారు పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొన్ని తేదీలను (ఉదాహరణకు మే 22) కూడా ప్రచారంలోకి తెచ్చాయి. ఎలాంటి అధికారిక ఆధారం లేని ఇటువంటి పోస్టుల వల్లే నెటిజన్లలో ఈ గందరగోళం మొదలైంది.
అధికారిక ధృవీకరణ లేదు:
హార్దిక్ పాండ్యా లాంటి ఒక అంతర్జాతీయ స్టార్ క్రికెటర్ లేదా మహీకా శర్మ లాంటి ప్రముఖ మోడల్ వివాహం చేసుకుంటే ఆ వార్త కేవలం ఒక చిన్న సోషల్ మీడియా అకౌంట్‌కు మాత్రమే పరిమితం కాదు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన మీడియా ఛానెళ్లు, పత్రికలు దీనిని ఒక పెద్ద బ్రేకింగ్ వార్తగా ప్రసారం చేస్తాయి. కానీ ఇప్పటివరకు హార్దిక్ పాండ్యా లేదా మహీకా శర్మ ఈ పెళ్లి వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు సదా మౌనంగానే ఉన్నారు.
పబ్లిక్ అప్పియరెన్స్ తర్వాత పుకార్లు:
గతంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత హార్దిక్ పాండ్యా మైదానంలో మహీకా శర్మను ప్రత్యేకంగా అభినందించడం... అలాగే వారిద్దరూ కలిసి ముంబై విమానాశ్రయంలో .. ఇతర పండుగ వేడుకల్లో జంటగా కనిపించడం వల్ల వీరి రిలేషన్‌షిప్‌పై అందరి దృష్టి పడింది. వారు కేవలం డేటింగ్‌లో ఉన్నారనే విషయం నిజమే అయినా వివాహం అనే పెద్ద నిర్ణయాన్ని వారు ఇంకా తీసుకోలేదు. కాబట్టి అధికారిక సమాచారం వచ్చే వరకు ఇలాంటి ఫోటోలను చూసి పెళ్లయిపోయిందని నమ్మలేము. హార్థిక్ మాజీ భార్య నటాషా స్టాంకోవిక్ తో ఇప్పటికీ స్నేహంగా ఉన్నాడు. తనయుడికి ఇద్దరూ సహతల్లిదండ్రులుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు క్రికెట్ కెరీర్ విషయంలో సీరియస్ గా ఉన్న హార్థిక్ ఈ వార్తలన్నిటినీ పట్టించుకునే పరిస్థితిలో లేడు.
