Begin typing your search above and press return to search.

మహికా శర్మతో రిలేషన్ కన్ఫర్మ్ చేసిన హార్దిక్ పాండ్యా..

కానీ ఫైనల్ గా హార్దిక్ పాండ్యా తన లవర్ కి సంబంధించి అఫీషియల్ గా ఫోటోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తాజాగా హార్దిక్ పాండ్యా తన ప్రియురాలు మహికా శర్మతో ఉన్న ఫోటోని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.

By:  Madhu Reddy   |   11 Oct 2025 1:05 PM IST
మహికా శర్మతో రిలేషన్ కన్ఫర్మ్ చేసిన హార్దిక్ పాండ్యా..
X

భారతీయ క్రికెట్ ఆటగాడు హార్థిక్ పాండ్యా ఎట్టకేలకు తన గర్ల్ ఫ్రెండ్ కి సంబంధించి అధికారిక ప్రకటన ఇచ్చేశారు. గత కొద్ది రోజుల నుండి హార్దిక్ పాండ్యా ఓ మోడల్ తో తిరుగుతున్నారని, ఆమెతో డేటింగ్ చేస్తున్నారని ఎన్నో రూమర్లు వినిపించాయి. అయితే ఈ రూమర్లకు తగ్గట్టుగానే ఈ జంట ఎక్కడ పడితే అక్కడ మీడియా కంట పడడంతో అంతా ఈ జంట గురించే మాట్లాడుకున్నారు. కానీ ఫైనల్ గా హార్దిక్ పాండ్యా తన లవర్ కి సంబంధించి అఫీషియల్ గా ఫోటోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తాజాగా హార్దిక్ పాండ్యా తన ప్రియురాలు మహికా శర్మతో ఉన్న ఫోటోని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.

ఈరోజు అనగా అక్టోబర్ 11న హార్దిక్ పాండ్యా పుట్టినరోజు.. ఈ సందర్భంగా గర్ల్ ఫ్రెండ్ తో కలిసి బర్త్డే సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు వెళ్లడానికి ముంబై ఎయిర్పోర్టుకి వెళ్లారు. అలా ముంబై ఎయిర్పోర్ట్ కి వెళ్లిన సమయంలో ఈ జంట మీడియాకి చిక్కడంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ హాట్ టాపిక్ అయింది. కానీ ఫైనల్ గా హార్దిక్ పాండ్యా తన బర్త్డే సందర్భంగా గర్ల్ ఫ్రెండ్ మహికా శర్మతో ఉన్న ఫోటోలను ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. చాలా రోజుల నుండి హార్దిక్ పాండ్యా విషయంలో వినిపిస్తున్న రూమర్లకు ఒకే ఒక్క ఫోటోతో క్లారిటీ ఇచ్చారు. హార్దిక్ పాండ్యా. తన బర్త్డేని గర్ల్ ఫ్రెండ్ మహికా శర్మతో కలిసి జరుపుకోబోతున్నట్టు అర్థమవుతోంది. ఈ ఫొటోస్ తో మహికా శర్మ,హార్దిక్ పాండ్యాల రిలేషన్ పై అఫీషియల్ క్లారిటీ వచ్చేసింది. వీరిద్దరూ ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నట్టు సమాచారం.

హార్దిక్ పాండ్యా పర్సనల్ లైఫ్ కి వస్తే..ఆయన గత ఏడాది తన భార్య నటాషా స్టాంకోవిక్ కి విడాకులు ఇచ్చారు. వీరిద్దరూ 2020లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయినా 4సంవత్సరాలకే విడాకులు తీసుకున్నారు. వీరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. నటాషా తో విడాకుల తర్వాత హార్దిక్ సింగర్ జాస్మిన్ వాలియాతో కూడా కొద్ది రోజులు చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. కానీ వీరి మధ్య బంధం ఎన్నో రోజులు నిలవలేదు. జాస్మిన్ తో బ్రేకప్ తర్వాత హార్దిక్ మహికా శర్మతో డేటింగ్ లో ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన రిలేషన్ ని హార్దిక్ పాండ్యా ఇప్పుడు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చారు.

హార్దిక్ పాండ్యా తన ప్రియురాలు మహికా శర్మను పరిచయం చేయడంతో చాలామంది ఇంతకీ ఈ మహికా శర్మ ఎవరు అని తెలుసుకునే పనిలో పడ్డారు. ఈ మహికా శర్మ ఎవరో కాదు ఇండియన్ మోడల్.. అలాగే కొన్ని ఇండిపెండెంట్ సినిమాల్లో నటిగా కూడా రాణించింది. అలా పలు బ్రాండ్ ప్రకటనల్లో కనిపిస్తూ మోడలింగ్ రంగంలో రాణిస్తున్న మహికా శర్మ హార్దిక్ పాండ్యాతో రిలేషన్ తో ఒక్కసారిగా సోషల్ మీడియాలో.. మెయిన్ మీడియాలో.. హైలెట్ గా నిలిచింది.