Begin typing your search above and press return to search.

భార్య నుంచి విడిపోయినా హార్థిక్ 4 కోట్ల ఖ‌రీదైన గిఫ్ట్

హార్దిక్ పాండ్యా తన కొడుకు అగస్త్యకు అత్యంత ఖరీదైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును కానుకగా ఇవ్వడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.

By:  Sivaji Kontham   |   22 Feb 2026 6:19 PM IST
భార్య నుంచి విడిపోయినా హార్థిక్ 4 కోట్ల ఖ‌రీదైన గిఫ్ట్
X

హార్దిక్ పాండ్యా తన కొడుకు అగస్త్యకు అత్యంత ఖరీదైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును కానుకగా ఇవ్వడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. అయితే ఇది కేవలం ఒక వస్తువుకు సంబంధించిన విషయం కాదు.. మ‌న‌సుకు, బంధానికి సంబంధించిన విష‌యం. ఒక తండ్రి తన కొడుకు పట్ల చూపే ప్రేమ.. వారి మధ్య ఉన్న ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన సున్నితమైన అంశం. హార్థిక్ కుమారుడు అగ‌స్త్య నందా- మాజీ భార్య న‌టాషా స్టాంకోవిక్ ఈ కార్ ని ఎంతో అబ్బుర‌ప‌డుతూ కానుక‌గా అందుకున్నారు కానీ..!

ఖరీదైన కానుకలు లోటును తీరుస్తాయా?

క‌చ్చితంగా ఆ లోటు తీర‌ద‌ని మాన‌సిక నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు తండ్రి ఇచ్చే సమయం, తోడు, ఇచ్చే భద్రతా భావం ముందు ఎంతటి విలాసవంతమైన కారు అయినా తక్కువే. ముఖ్యంగా హార్దిక్ నటాషా విడిపోయిన తర్వాత అగస్త్య తల్లి దగ్గర ఉంటున్నాడు. ఇలాంటి సమయంలో తండ్రి పక్కన లేని లోటును ఏ ఇత‌ర కానుక‌లు లేదా వస్తువు భర్తీ చేయలేదని విశ్లేషిస్తున్నారు.

మరోవైపు హార్దిక్ పాండ్యా తన కొడుకును ఎంతగా ప్రేమిస్తాడో రెగ్యుల‌ర్ గా చూస్తూనే ఉన్నాం. హార్దిక్ తన ప్రొఫెషనల్ లైఫ్.. పర్సనల్ లైఫ్ ఒత్తిడిలో ఉన్నా కానీ.. దొరికిన ప్రతి అవకాశంలోనూ అగస్త్యతో గడపడానికి ప్రయత్నిస్తుంటారు. కొందరు తండ్రులు తమ ప్రేమను సమయంతో వ్యక్తపరుస్తారు.. మరికొందరు తమ పిల్లలకు అత్యుత్తమమైన జీవితాన్ని ఇవ్వడం ద్వారా .. ఖరీదైన కానుకల రూపంలో వ్యక్తపరుస్తారు. హార్దిక్ దృష్టిలో ఇది తన కొడుకుపై ఉన్న ప్రేమకు ఒక నిదర్శనం కావచ్చు.

అగస్త్యకు ఆ లోటు ఉందా?

పిల్లల మనస్తత్వ శాస్త్రం ప్రకారం.. తల్లిదండ్రులు విడిపోయినప్పుడు పిల్లలు ఒక రకమైన భావోద్వేగ సంఘర్షణకు లోనవుతారు. నటాషా స్టాన్‌కోవిక్ అగస్త్యను చాలా జాగ్రత్తగా, అతనికి తండ్రి లేని లోటు తెలియకుండా పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. హార్దిక్ - నటాషా విడిపోయినా ఒక తండ్రిగా హార్దిక్ తన బాధ్యతలను నెరవేరుస్తున్నాడు. అగస్త్యకు తండ్రి అందుబాటులో లేక‌పోవ‌డం పెద్ద లోటు.. ఒకే ఇంట్లో కలిసి ఉండలేకపోవడం అనే శూన్యత ఎదుర‌వుతుందని విశ్లేషిస్తున్నారు.

డబ్బుతో సౌకర్యాలను కొనవచ్చు కానీ.. సంతోషాన్ని లేదా బంధాలను కొనలేం. హార్దిక్ ఇచ్చిన కారు అగస్త్యకు భవిష్యత్తులో ఒక విలాసం కావచ్చు.. కానీ చిన్నతనంలో తండ్రి వేలు పట్టుకుని నడిచే ఆ క్షణాలు మళ్ళీ రావు. ఆ లోటు తీరాలంటే హార్దిక్ సాధ్యమైనంత ఎక్కువ సమయం తన కొడుకుతో గడపడమే ఏకైక మార్గం. మొత్తానికి ల్యాండ్ రోవర్ అనేది ఒక తండ్రి తన కొడుకు కోసం చూపే బాధ్యతగా చూడవచ్చు కానీ.. ఆ కారు లోపల తండ్రి కూర్చుని ఉంటేనే ఆ చిన్నారికి అసలైన సంతోషం. అగ‌స్త్య‌కు 4 కోట్ల ఖ‌రీదు చేసే కార్ ని కొనిచ్చినా కానీ లోటు అలానే మిగిలి ఉంది.