Begin typing your search above and press return to search.

మాట‌ల్లేవ్ మాట్లాడుకోడాల్లేవ్ అనుకుంటే ఇలా షాకిచ్చారేంటీ!

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్లు, పాండ్యా సోదరులైన హార్దిక్ పాండ్యా- కృణాల్ పాండ్యాలు చాలా కాలం తర్వాత ఒకే ఫ్రేమ్‌లో కలిసి కనిపించి క్రికెట్ వర్గాల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు.

By:  Sivaji Kontham   |   2 Aug 2026 4:00 AM IST
మాట‌ల్లేవ్ మాట్లాడుకోడాల్లేవ్ అనుకుంటే ఇలా షాకిచ్చారేంటీ!
X

భారత క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభవార్త రానే వచ్చింది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్లు, పాండ్యా సోదరులైన హార్దిక్ పాండ్యా- కృణాల్ పాండ్యాలు చాలా కాలం తర్వాత ఒకే ఫ్రేమ్‌లో కలిసి కనిపించి క్రికెట్ వర్గాల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో వీరిద్దరూ కలిసి సరదాగా ముచ్చటించుకుంటూ నవ్వుతూ వెళ్తున్న దృశ్యాలు ప్రసార సాధనాల్లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.

గత ఒకటి రెండు సంవత్సరాలుగా హార్దిక్, కృణాల్‌ల మధ్య సరిగా మాట‌ల్లేవని, ఇద్దరి మధ్య తీవ్ర మనస్పర్థలు వచ్చాయని సోషల్ మీడియా వ్యాప్తంగా అనేక వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. హార్థిక్ పాండ్యా త‌న భార్య న‌టాషా స్టాంకోవిక్ నుంచి గ‌త ఏడాది విడిపోయిన సంగ‌తి తెలిసిందే. అదే స‌మ‌యంలో బ్ర‌ద‌ర్స్ మ‌ధ్య విభేధాల గురించి కూడా చాలా ప్ర‌చారం సాగింది. ఐపీఎల్ సీజన్లలో కూడా వీరిద్దరూ కలిసి కనిపించకపోవడంతో వీరి మధ్య విబేధాలు నిజ‌మేనని అభిమానులు కూడా భావించారు. అయితే ఈ కొత్త దృశ్యాలు ఆ అనుమానాలన్నింటికీ చెక్ పెట్టేశాయి.

ఎయిర్‌పోర్ట్‌లో ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ... నవ్వుతూ కనిపించిన ఈ సోదరుల దృశ్యాలు చూస్తుంటే వారి మధ్య ఉన్న బంధం ఎంత బలమైనదో స్పష్టమవుతోంది. ఒకప్పుడు భారత క్రికెట్‌లో పాండ్యా బ్రదర్స్ మధ్య ఉన్న అనుబంధానికి ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఇప్పుడు మళ్లీ వారిద్దరూ అదే హ్యాపీ మూవ్ మెంట్ లో కనిపించడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు- క్రికెట్ ప్రేమికులు అత్యంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. `పాండ్యా బ్రదర్స్ ఈజ్ బ్యాక్` అంటూ రకరకాల కామెంట్లతో తమ సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత సోదరులిద్దరి ముఖాల్లో కనిపించిన ఈ చిరునవ్వులు వారి కుటుంబంలోనే కాకుండా అభిమానుల్లోనూ ప్రత్యేకమైన సంతోషాన్ని నింపాయి.

అన్న‌ద‌మ్ముల మ‌ధ్య మ‌న‌స్ఫ‌ర్థ‌లు స‌హ‌జం. కానీ అవి శాశ్వ‌తం కాదు! మొత్తానికి ఎన్ని మనస్పర్థలు వచ్చినా రక్తం పంచుకు పుట్టిన సోదరులు ఎప్పటికీ ఒకటేనని పాండ్యా బ్రదర్స్ మరోసారి నిరూపించారు. వారి మధ్య ఉన్న పాత అనుబంధం, ఆ ఆత్మీయత మళ్లీ చిగురించడం చూసి క్రీడా లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. మునుముందు వీరిద్దరూ మైదానంలో కూడా ఇదే రకమైన ఉత్సాహంతో అభిమానులను అలరించాలని కోరుకుంటున్నారు.