హనుమాన్ అంశ్ వెనుక త్రివిక్రమ్ ప్లాన్ ఇదేనా?
హనుమాన్ అంశ్.. ఈ సినిమాకు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మరో ప్రత్యేకమైన కనెక్షన్ ఏర్పడింది.
By: Sravani Lakshmi Srungarapu | 12 Sept 2026 5:00 PM ISTహనుమాన్ అంశ్.. ఈ సినిమాకు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మరో ప్రత్యేకమైన కనెక్షన్ ఏర్పడింది. హిందీలో ఇప్పటికే మంచి సక్సెస్‌ను అందుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 18న త్రివిక్రమ్ సమర్పణలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సాధారణంగా ఒక డబ్బింగ్ సినిమాను మరో భాషలోకి తీసుకురావడం అంటే అక్కడి మార్కెట్‌కు తగ్గట్టుగా ప్రమోషన్ చేయడం వరకే పరిమితమవుతుంది. కానీ హనుమాన్ అంశ్ విషయంలో త్రివిక్రమ్ పేరు కేవలం సమర్పకుడిగా కాకుండా, సినిమాకు సరైన కాంటెక్స్ట్‌ను క్రియేట్ చేసే అంశంగా మారే అవకాశం కనిపిస్తోంది.
ప్రస్తుతం త్రివిక్రమ్ చేస్తున్న ఆదర్శ కుటుంబం కూడా ఫ్యామిలీ, ఎమోషన్స్, విలువల నేపథ్యంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌గా ఆసక్తిని పెంచుతోంది. అంతేకాదు, పురాణాలు, ఇతిహాసాలు, భారతీయ సంస్కృతికి సంబంధించిన అంశాలను తన రచనల్లో ప్రత్యేకంగా ఉపయోగించే త్రివిక్రమ్.. ఆదర్శ కుటుంబం తర్వాత ఎన్టీఆర్‌తో కలిసి గాడ్ ఆఫ్ వార్ చేయబోతున్న విషయం తెలిసిందే. అంటే ఒకవైపు ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా కుటుంబ నేపథ్యాన్ని టచ్ చేస్తుంటే.. మరోవైపు ఆయన తర్వాతి ప్రాజెక్ట్ మైథాలజీ వైపు అడుగులు వేయనుండటం అందరికీ ఆసక్తిని కలిగిస్తోంది.
ఇలాంటి టైమ్ లో హనుమాన్ అంశ్‌ను తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకురావడం యాదృచ్ఛికంగా కనిపించినా, మార్కెటింగ్ పరంగా మాత్రం ఇంట్రెస్టింగ్ కాంబినేషన్‌గా మారొచ్చు. ముఖ్యంగా పురాణాలు, ఆధ్యాత్మికత, భారతీయ కథనాలపై ఆసక్తి ఉన్న తెలుగు ఆడియన్స్‌కు త్రివిక్రమ్ పేరు ఈ సినిమాపై అదనపు నమ్మకాన్ని కలిగించే అవకాశం ఉంది. హనుమంతుడి నేపథ్యంతో వచ్చిన కథకు త్రివిక్రమ్ వంటి రైటర్, డైరెక్టర్ ప్రెజెంటర్ గా ఉండటం వల్ల తెలుగు రిలీజ్‌కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చే ఛాన్స్ ఉంది.
అయితే ఆఖరికి త్రివిక్రమ్ ఇమేజ్ ఈ సినిమాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, హిందీలో పనిచేసిన ఈ కంటెంట్ తెలుగులో ఏ స్థాయిలో కనెక్ట్ అవుతుంది అన్నదే కీలకం. ఒకవేళ హనుమాన్ అంశ్ కూడా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తే.. త్రివిక్రమ్ పేరు కేవలం ప్రెజెంటర్ క్రెడిట్‌గా కాకుండా, తన తర్వాతి మైథాలజీ ప్రయాణానికి ముందే ఒక ఇంట్రెస్టింగ్ కనెక్షన్‌గా మారే అవకాశం లేకపోలేదు.
