Begin typing your search above and press return to search.

బ్లాక్ బస్టర్ 'హనుమాన్ అంశ్'.. తెలుగు ట్రైలర్ ఎలా ఉందంటే?

ట్రైలర్ చూస్తే.. ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదనే విషయం క్లియర్ గా తెలుస్తోంది. ఒక వ్యక్తి జీవితంలో జరిగిన మార్పు.. ఆ మార్పు వెనుక ఉన్న డివోషనల్ జర్నీ..

By:  M Prashanth   |   5 Oct 2026 7:53 PM IST
బ్లాక్ బస్టర్ హనుమాన్ అంశ్.. తెలుగు ట్రైలర్ ఎలా ఉందంటే?
X

చిన్న సినిమాగా వచ్చి.. పెద్ద సంచలనమే సృష్టించింది హనుమాన్ అంశ్. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌ తో తెరకెక్కిన ఆ సినిమా ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. హిందీలో ఇప్పటికే మంచి విజయం అందుకున్న ఆ డివోషనల్ స్టోరీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అక్టోబర్ 9న థియేటర్లలో విడుదల కానున్న ఆ సినిమా తెలుగు ట్రైలర్ ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతోంది.

ట్రైలర్ చూస్తే.. ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదనే విషయం క్లియర్ గా తెలుస్తోంది. ఒక వ్యక్తి జీవితంలో జరిగిన మార్పు.. ఆ మార్పు వెనుక ఉన్న డివోషనల్ జర్నీ.. చుట్టూ ఉన్న మనుషులపై అతని ఎఫెక్ట్.. ఇలా కథను ఇంట్రెస్టింగ్ గా చూపించే ప్రయత్నం చేశారు. ట్రైలర్‌ లో ఎక్కువగా స్టోరీలోని డివోషనల్ యాంగిల్ కే ఇంపార్టెన్స్ ఇచ్చారు.

నీమ్ కరోలీ బాబాగా మారడానికి ముందు లక్ష్మీనారాయణ్ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనే అంశం చుట్టూనే కథ సాగుతుంది. తల్లి మరణం తర్వాత అతని ఆలోచనల్లో మార్పు రావడం.. ఆ తర్వాత సన్యాసం వైపు అడుగులు వేయడం వంటి సీన్స్ ట్రైలర్‌ లో కనిపించాయి. ఒక సాధారణ వ్యక్తి ఆధ్యాత్మిక గురువుగా ఎలా మారాడనే హైప్ పెంచేలా సీన్లను కట్ చేశారు.

అదే సమయంలో బ్రిటిష్ పాలనకు సంబంధించిన సన్నివేశాలు కూడా ట్రైలర్‌ లో కనిపించాయి. రైలు నుంచి దింపేయడం వంటి సీన్లు కథ ఏ కాలంలో సాగుతుందో చెప్పకనే చెబుతున్నాయి. ఆ తర్వాత బాబా చుట్టూ చేరే ప్రజలు.. వారితో ఆయన మాట్లాడే తీరు.. వారిలో ధైర్యం నింపే ప్రయత్నం వంటి సన్నివేశాలు కూడా ఉన్నాయి. ట్రైలర్‌ లో హనుమంతుడి ప్రస్తావనకు కూడా స్పెషల్ ప్లేస్ ఇచ్చారు.

హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం.. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని గ్రామస్థులకు చెప్పడం వంటి సన్నివేశాలు సినిమాకు ఉన్న డివోషన్ యాంగిల్ ను చూపిస్తున్నాయి. బాబా రోల్ లో ప్రశాంతత, చమత్కారం రెండింటినీ కలిపి చూపించే ప్రయత్నం చేశారు. మరోవైపు.. బాబా వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఇన్సిడెంట్స్ కూడా సినిమాలో మెయిన్ గా కనిపిస్తున్నాయి. భార్యతో వచ్చే విభేదాలు, కుటుంబానికి దూరమవుతూ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగడం వంటి సీన్స్ ఆయన ప్రయాణం అంత ఈజీగా సాగలేదనే విషయాన్ని చూపిస్తున్నాయి.

విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించిన ఆ సినిమాలో శోభిత్ శ్రీవాత్సవ లీడ్ రోల్ లో నటించారు. చందన్ కె. ఆనంద్, పూర్ణిమ తివారి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఇప్పటికే హిందీలో భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమాను ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఆసక్తిగా మారింది. ముఖ్యంగా ట్రైలర్‌ లో పెద్దగా హడావుడి లేకుండా కథ, పాత్ర, ఆధ్యాత్మిక అంశాలపైనే దృష్టి పెట్టడం కనిపిస్తోంది. హిందీలో సినిమాకు వచ్చిన రెస్పాన్స్ తెలుగు వెర్షన్‌ పై కూడా అంచనాలు ఏర్పడ్డాయి. మరి తెలుగు ప్రేక్షకులను ఆ మూవీ ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.